Guppedanta Manasu Serial Today July 31st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: వసుధారకు అన్ని విషయాలు చెప్పిన రిషి – ఎండీ అయినట్టు పగటి కలలు కంటున్న శైలేంద్ర
Guppedanta Manasu Today Episode: తాను రంగాగా ఎందుకు మారాల్సి వచ్చిందో మీకెందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో వసుధారకు రిషి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: రిషిని రంగాగా ఎందుకు మారాల్సి వచ్చిందని వసుధార అడుగుతుంది. మీ హెల్త్ బాగయ్యాకైనా మేము మీకు గుర్తు రాలేదా? అంటుంది. మీ నాన్న గారైనా మీకు గుర్తుకు రాలేదా? అంటూ వసుధార అడగడంతో నాకు హెల్త్ బాగయ్యాక అందరూ గుర్తొచ్చారు కానీ విధి ఆడిన వింత నాటకం బాటలోనే నేను నడిచాను. మీరంతా నాతోనే ఉన్నారు అంటాడు రిషి.
వసుధార: మీరు శైలేంద్ర దగ్గర కూడా రంగాగా ఎందుకు ఉంటున్నారు. మీరే రిషి అని చెప్పేస్తే అయిపోతుంది కదా.
రిషి: నాకు తెలుసు వసుధార
వసుధార: మీకు తెలుసా..?
రిషి: అవును నాకు తెలుసు వసుధార. నేను నీకు అనుకోకుండా ఎదురుపడ్డాను అనుకుంటున్నావ్ కదా. కానీ, నువ్ ఆపదలో ఉన్నావని తెలిసే ఎదురుపడ్డాను
వసుధార: ఇవన్ని మీకెలా తెలిసాయి సార్
రిషి: నీకు త్వరలోనే క్లారిటీ వస్తుంది. అంతవరకు నువ్వు నన్ను ఏమీ అడగొద్దు. ఎలాగైనా మన కాలేజీని కాపాడుకోవాలి. రేపు మనం కాలేజీకి వెళ్దాం.
అనగానే వసుధార, రిషిని హగ్ చేసుకుంటుంది. మరోవైపు కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటదట. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. డీబీఎస్టీ కాలేజీ అంటే దేవాలయం. ఆ దేవాలయాన్ని ఏ దేవుడు కాపాడలేకపోతున్నాడు. అని విద్యార్థులు మాట్లాడుకుంటారు. తర్వాత శైలేంద్ర కాలేజీకి ఎండీ అయినట్లు, రంగా, రిషిలాగా వచ్చి కాలేజీని గవర్నమెంట్ హ్యాడోవర్ చేసుకోవడాన్ని ఆపేసినట్టు, శైలేంద్రను కాలేజీకి ఎండిని చేయమని చెప్పినట్లు కలగంటాడు. ఇంతలో ధరణి వచ్చి నిద్రలో కలగంటున్న శైలేంద్రను నిద్ర లేపుతుంది. నిద్ర లేచిన శైలేంద్ర మనమేంటీ ఇక్కడ ఉన్నాం అని అంటాడు.
ధరణి: మనం ఇక్కడే ఉండాలి.
శైలేంద్ర: అంటే నాకు కల వచ్చిందా..? పొద్దున వచ్చిన కలలు నిజమౌతాయంటారు.
ధరణి: అదేంటీ నిన్నే కదా ప్రభుత్వం కాలేజీని తీసుకుంటుందని బాధపడ్డారు. ఇప్పుడేంటి మీరు ఎండీ అయినట్లు కలలు కంటున్నారు.
శైలేంద్ర: మనిషికి ఆశ ఉండటం సహజం. కొన్నిసార్లు మన సిక్త్స్ సెన్స్ మనకు హింట్స్ ఇస్తుంది.
అని శైలేంద్ర అనగానే మన కాలేజీ మన చేతుల్లోకి వస్తే చాలు. మీరు ఎండీ అయితే ఏంటి? కాకపోతే ఎంటి అని ధరణి వెళ్లిపోతుంది. ఛీ నా జీవితం నేను ఎండీ అయినా పర్వాలేదట. కానీ, కాలేజీ మాత్రం ఉండాలట అని శైలేంద్ర అనుకుంటాడు. తర్వాత డీబీఎస్టీ కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుందని మీటింగ్‌లో చెబుతాడు మినిస్టర్.
మంత్రి: మీరేమైనా మాట్లాడుతారా ఫణీంద్ర గారు.
ఫణీంద్ర: లేదు మంత్రి గారు. మా నాన్న కలను నిజం చేయలేకపోతున్నాను. అదే నాకు బాధగా ఉంది.
అంటూ ఫణీంద్ర ఎమోషనల్ అవుతుంటే మీరు బాధపడకండి డాడ్. రిషిలా రంగా వచ్చి ఈ డీబీఎస్టీ కాలేజీ గవర్నమెంట్ హ్యాడోవర్ చేసుకోకుండా ఆపేస్తాడు. అప్పుడు మన కాలేజీ మన చేతుల్లోనే ఉంటుంది అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. ఇక కాలేజీ గురించి, రిషి, వసుధారల గొప్పతనం గురించి, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి చాలా గొప్పగా చెబుతాడు మినిస్టర్. జగతి, రిషి చనిపోవడం, వసుధార వెళ్లిపోవడం, మీరు ఎండీగా ఉండేందుకు అయిష్టపడటం వల్లే ఈరోజు కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుంది. ఇలా జరుగుతున్నందుకు నాకూ చాలా బాధగా ఉంది అని మినిస్టర్ అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.