Guppedanta Manasu Serial Today July 22nd: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: వసుధారను చూసిన శైలేంద్ర – నడిరోడ్డు మీద వసుధారను వదిలేసి వెళ్లిన రంగ
Guppedanta Manasu Today Episode: టీ కొట్టు దగ్గరే రంగ, వసుధారను వదిలేసి వెళ్లడంతో శైలేంద్ర వసుధారను చూస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: ఆటోలో వెళ్తున్న వసుధార, రంగను పెళ్లికొడుకు ఎలా ఉన్నాడని అడుగుతుంది. అదంతా నాకెలా తెలుస్తుందని నేను వాళ్లకు ఒక క్లారిటీ ఇవ్వడానికే అక్కడికి వెళ్లానని చెప్తాడు రంగ. ఇంతలో టీ కొట్టు దగ్గర ఆటో ఆపి టీ తాగుదాం అంటుంది వసుధార. ఇద్దరూ కలిసి టీ తాగడానికి వెళితే వసుధార మళ్లీ ఫ్రెష్ గా టీ పెట్టమని చెప్తుంది. దీంతో రంగ టీ ఎలా చేయాలో చాయ్ వాలాకు చెప్తాడు. దీంతో వసుధార మీరు కచ్చితంగా రిషి సారే అచ్చం రిషి సర్ లాగే మీరు కూడా టీ గురించి మాట్లాడుతున్నారు అంటుంది. మీతో ఏం మాట్లాడాలన్నా భయమేస్తుంది అంటాడు రంగ. మరోవైపు దేవయాని, శైలేంద్ర, రంగ గురించి మాట్లాడుకుంటారు.
దేవయాని: ఓరేయ్ వాడు రిషినే అంటావా?
శైలేంద్ర: కాదు మామ్
దేవయాని: వాణ్ని చూడగానే ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోయినంత పనైపోయింది.
శైలేంద్ర: అవును మామ్ నాకైతే ఒళ్లంతా సెవరింగ్ వచ్చింది. కానీ వాడు రంగా అని తెలిశాక కొంచెం రిలాక్స్ అయ్యాను.
దేవయాని: రిలాక్స్ అవడం ఏంట్రా అసలు వాడు రంగా అని గ్యారెంటీ ఎంటి?
శైలేంద్ర: వాడు గ్యారంటీగా రంగానే మామ్. వాడి నాన్నమ్మను కూడా చూశాము కదా? అంతెందుకు పెళ్లి కూతురు వాళ్లు వాడి బంధువులని కంన్‌ఫం అయ్యింది కదా? అందులోను ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుందని చెప్పారు కదా? దీన్ని బట్టి చూస్తే వాడు రంగానే కదా?
దేవయాని: కాదురా నాకేదో డౌట్‌గా ఉంది.
ధనరాజ్: నన్ను కారులో కూర్చోబెట్టి బయట వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు.
శైలేంద్ర: నవ్వేం లేని పోని డౌట్లు పెట్టుకుని నువ్వు కంగారుపడి నన్ను కంగారుపెట్టకు. మామ్ మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు కదా అందులో వీడొకడు.
దేవయాని: లేదు నాన్నా నా మనసుకు ఏదో తేడా కొడుతుంది.
అనగానే వాడెప్పుడో చనిపోయాడని చనిపోయిన వాడు ఎలా మళ్లీ వస్తాడని శైలేంద్ర అనడంతో దేవయాని తిడుతుంది. అసలు వాడు రంగానా? లేదా అనేది నువ్వు ఈ ఊరిలోనే ఉండి తెలుసుకోమని చెప్తుంది. శైలేంద్ర సరేనంటాడు. దీంతో దేవయాని, ధనరాజ్ వెళ్లిపోతారు. శైలేంద్ర అక్కడే ఉండిపోతాడు. శైలేంద్ర వచ్చి రంగ గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. రిషి ఫోటో చూపించి ఊరిలో వాళ్లను ఎవరిని అడిగినా రంగ అని చెప్తారు. అప్పారావును శైలేంద్ర రంగా గురించి అడిగి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోమని చెప్తాడు. అప్పారావు రంగాకు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. టీ కొట్టు దగ్గర ఉన్నానని చెప్పడంతో అప్పారావు శైలేంద్రకు టీ కొట్టు అడ్రస్ చెప్తాడు. శైలేంద్ర అక్కడికి వెళ్తాడు. మరోవైపు రంగా, వసుధార మాట్లాడుకుంటారు.
వసుధార: ఫోన్ చేసింది ఎవరు? సార్.
రంగ: ఎవరో చెబితే మీకు తెలుస్తుందా మేడం.
వసు: పేరు చెబితే కదా సార్ నాకు తెలుసో లేదో తెలిసేది.
రంగ: ఆయన పేరు అప్పారావు. మా బాబాయ్ తెలుసా? మీకు తెలియదు కదా?
వసు: తెలియదు సర్
రంగ: మరి తెలియకపోతే ఎలా అడుగుతారు మేడం. మీకు అనవసరమైనవి పనికిమాలిన విషయాల్లో కలగజేసుకోవడం ఇష్టం అనుకుంటా? జీవితంలో ఒక్కటి గుర్తు పెట్టుకోండి. అవసరం లేకున్నా మనకు తెలియాల్సినవి తెలుస్తాయి. తెలియని విషయాలు తెలుసుకోవాలని ట్రై చేయకండి.
వసు: వాళ్ల విషయం నాకు అవసరం లేదు కానీ మీకు సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలి.
అని చెప్తుండగానే రంగాకు ఫోన్ వస్తుంది. రంగా ఫోన్ మాట్లాడుతుంటే ఒకవైపు రౌడీలు, మరోవైపు శైలేంద్ర తిరుగుతుంటారు. ఇంతలో రంగ ఫోన్ కట్ చేసి తనకు అర్జెంట్‌గా పని ఉందని మీరు ఇంటికి వెళ్లండి అని వసుధారకు చెప్పి రంగా వెళ్లిపోతాడు. ఇంతలో రంగా కోసం వచ్చిన శైలేంద్ర, వసుధారను చూసి షాక్ అవుతాడు. రౌడీలు వసుధారను చూసి పట్టుకోవడానికి వెళితే వసుధార పారిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.