Guppedanta Manasu Serial Today February 5th: మకుల్ నుంచి తప్పించుకున్న భద్ర – డెడ్ బాడీ పక్కన దొరికిన రిషి టీ షర్ట్
Guppedanta Manasu Today Episode: హాస్పిటల్ లో ఒక డెడ్ బాడీ ఉందని దాని పక్కన రిషి వేసుకున్న టీ షర్ట్ దొరికిందని ముకుల్ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: భద్ర పోలీసులకు దొరికాడని తెలిసి దేవయాని భయపడుతుంది. మనం తాము దుర్మార్గాలను భద్ర ఎక్కడ బయటపెడతాడోనని శైలేంద్రతో చెబుతూ కంగారు పడుతుంది. దేవయాని టెన్షన్ పడుతున్నా... శైలేంద్ర మాత్రం సంతోషంగా కనిపిస్తాడు. మన గురించి చెప్పాలంటే భద్ర ఉంటేనే కదా అని అంటాడు. శైలేంద్ర మాటలు విని దేవయాని షాకవుతుంది.
దేవయాని: భద్ర చనిపోయాడా...నువ్వే చంపేశావా
శైలేంద్ర: చంపేయలేదు.. ముకుల్ దగ్గర నుంచి భద్రను తప్పించేశాను
దేవయాని: భద్ర పోలీసులకు దొరికిపోయాడని తెలిసిన దగ్గర నుంచి అన్నం సహించడం లేదు. దాహం వేయడం లేదు. క్షణక్షణం ఏం జరుగుతుందోనని సతమతమైపోయాను. భద్ర జైలు నుంచి తప్పించుకున్నాడని తెలిసిన తర్వాతే టెన్షన్ మొత్తం పోయింది. ఇంతకీ ముకుల్ నుంచి తప్పించుకున్న భద్ర ఎక్కడికి వెళ్లాడు.
శైలేంద్ర: మనకు ఎదురైన సమస్య తీరిపోయింది. అది చాలు... వాడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్లాడు అన్నది మనకు అనవసరం.
దేవయాని: మరి వసుధారను ఏం చేస్తావు. తన వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంక ఎంత కాలం ఎండీ సీట్ కోసం ఎదురుచూస్తావు.
శైలేంద్ర: వసుధార తనకు చాలా చిరాకు తెప్పిస్తుంది. తొందరలోనే తన గుండె ఆగిపోయేలా దెబ్బకొడతాను. త్వరలోనే అదేమిటో చెబుతాను
అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే చాటు నుంచి ధరణి వింటుంది. వారి ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. భద్ర ద్వారా శైలేంద్ర కుట్రలు మొత్తం వెలుగులోకి వస్తాయని అనుకుంటే ఇలా జరిగిందేమిటి అని బాధపడుతుంది. మరోవైపు భద్ర మీ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడని ముకుల్‌ను నిలదీస్తుంది అనుపమ. భద్ర తప్పించుకుంటే రిషి గురించి ఎలా తెలుస్తుందని అడుగుతుంది. అదే అర్థం కావడం లేదని బదులిస్తాడు ముకుల్. రిషి గురించి ఎంక్వైరీ చేయడానికంటే ముందు మీరు నాతో పాటు హాస్పిటల్‌కు రావాలని బాంబు పేలుస్తాడు ముకుల్. ఆ మాట వినగానే మహేంద్ర, వసుధార షాకవుతారు. హాస్పిటల్‌కు ఎందుకు అని అడుగుతారు.
గుర్తుపట్టలేని స్థితిలో ఓ డెడ్‌బాడీ దొరికిందని, ఇప్పుడు రిషి కనిపించడం లేదు కాబట్టి...ఆ డెడ్‌బాడీ ఐడెంటిఫికేషన్ కోసం మీరు హాస్పిటల్‌కు రావాలని ముకుల్ సమాధానమిస్తాడు. అతడి మాటలతో మహేంద్ర, వసుధార ఫైర్ అవుతారు. మరోసారి ఇలాంటి కీడు కలిగించే మాటలు మాట్లాడొద్దు అని చెబుతారు. అయితే కానిస్టేబుల్స్ ద్వారా ఓ టీషర్ట్ ను తెప్పిస్తాడు ముకుల్. ఇది రిషిదేనా అని అడుగుతాడు. చక్రపాణి షాకింగ్‌గా ఆ టీ షర్ట్ చూస్తూ..
చక్రపాణి: కనిపించకుండా పోయిన రోజు రిషి ఇదే టీషర్ట్ వేసుకున్నాడు.
ముకుల్: డెడ్‌బాడీ దొరికిన చోటే ఈ టీషర్ట్ దొరికింది. అందుకే ఐడెంటిఫికేషన్ కోసం మిమ్మల్ని హాస్పిటల్‌కు రమ్మంటున్నాను.
వసుధార: టీషర్ట్ ను పోలిన టీషర్ట్ లు చాలా ఉంటాయి. ఇది రిషి టీషర్ట్ కాదు. రిషికి ఏమైనా అయితే నేను కూడా బతికి ఉండలేను. అతడికి ప్రమాదం జరిగే క్షణం ముందే నేను చచ్చిపోతాను.
అంటూ వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరకు ముకుల్ వెంట మహేంద్రను పంపిస్తుంది అనుపమ. ఫణీంద్ర, మహేంద్రకు ఫోన్ చేస్తాడు. మహేంద్ర కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫణీంద్ర టెన్షన్ పడుతుంటాడు. అదే విషయం దేవయానితో చెబుతాడు. కంగారు ఎందుకు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా లిఫ్ట్ చేస్తాడని భర్తతో అంటుంది దేవయాని. ఆమె మాటలతో ఫణీంద్ర ఫైర్ అవుతాడు. రిషి కనిపించకుండా పోయాడనే దిగులు లేకుండా హాయిగా ఉంటున్నావని క్లాస్ పీకుతాడు. రిషిని సొంత కొడుకుకంటే ఎక్కువగా చూసుకున్నానని, ఈ చేతులతో రిషిని పెంచానని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతుంది దేవయాని. తర్వాత అనుపమకు కాల్ చేస్తాడు ఫణీంద్ర. ఓ డెడ్‌బాడీ ఐడెంటిఫికేషన్ కోసం మహేంద్రను ముకుల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడని ఫణీంద్రతో చెబుతుంది అనుపమ. ఆమె మాటలకు ఫణీంద్ర షాకవుతాడు. వణికిపోతూ సోఫాలో కుప్పకూలిపోతాడు. ఫణీంద్ర హాస్పిటల్‌కు వెళ్లిన సంగతిని దేవయాని, శైలేంద్రలకు చెబుతాడు. తండ్రి చెప్పిన మాటలు విని శైలేంద్ర లోలోన ఆనందపడతాడు. పైకి మాత్రం రిషికి ఏం కాదు. రిషి నా తమ్ముడు, వాడు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడని తండ్రితో అంటాడు శైలేంద్ర. కానీ అది రిషి డెడ్‌బాడీ కావాలని శైలేంద్ర లోలోన కోరుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మోడ్రన్ గోపికలా ముస్తాబై.. షారుఖ్ ఖాన్ సాంగ్స్‌తో వైబ్ అవుతున్న డింపుల్ హయాతి