అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 10th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: ఎంజేల్ తో పెళ్లికి ఒప్పుకున్న మను – రిషిని చంపేస్తానన్న శైలేంద్ర

Guppedanta Manasu Today Episode: కాలేజీ బోర్డు మీటింగ్ లో తనను ఎండీ ప్రకటించిన తర్వాత రంగాను చంపేస్తానని శైలేంద్ర చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  మ‌హేంద్ర‌ను ఒంట‌రిగా వ‌దిలిపెట్టి అక్కడి నుంచి దూరంగా ఎందుకు వ‌చ్చార‌ని అనుపమను వసుధార అడుగుతుంది. అయితే దేవ‌యానికి మ‌ను తండ్రి ఎవ‌ర‌న్న‌ది తెలిసింద‌ని, అది అడ్డం పెట్టుకొని త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేసింద‌ని వ‌సుధార‌తో చెబుతుంది అనుప‌మ‌. ఆ నిజం బ‌య‌ట‌ప‌డ‌కూడ‌ద‌నే మ‌నును దూరంగా తీసుకొచ్చానని చెప్తుంది అనుపమ. తాను చేసి పొర‌పాటు వ‌ల్లే దేవ‌యానికి నిజం తెలిసిపోయింద‌ని వ‌సుధార బాధ‌ప‌డుతుంది. ఇదంతా మా త‌ల‌రాత దానికి నువ్వేం చేస్తావ‌ని వ‌సుధార‌తో అంటుంది అనుప‌మ‌.

వసుధార: మేడం ఇక మను గారికి మహేంద్ర సారే తన తండ్రి అని నిజం చెప్పండి.

అనుపమ: మ‌నుకు నిజం తెలిస్తే ఎన్ని అన‌ర్థాలు జ‌రుగుతాయో, మ‌హేంద్రకు ఏమ‌వుతుందో నీకు అర్థం కావడం లేదు వసుధార.

వసుధార: అలాంటివేమి జ‌ర‌గ‌వు మేడం. మీరు అనవసరమైన భయాలు పెట్టుకోకుండా మనుగారికి నిజం చెప్పండి.

అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే వారి మాటలు మను వింటాడు. తన తండ్రి ఎవరో శైలేంద్ర, దేవయానిలకు కూడా తెలిసిందని తనకు మాత్రమే ఇంకా తెలియలేదని బాధపడతాడు. తన తండ్రి గురించి ఎవరిని అడగాల్సిన అవసరం లేదని ఏం చేయాలో క్లారిటి వచ్చిందని మనసులో అనుకుంటాడు. మ‌రోవైపు ఒంట‌రిగా ఉన్న రిషి ద‌గ్గ‌ర‌కు శైలేంద్ర వ‌స్తాడు.

శైలేంద్ర: నువ్వు రిషిలా నటించమంటే.. జీవిస్తున్నవా? వసుధారను తిడితే నాకే వార్నింగ్‌ ఇస్తావా?

రిషి: అదేం లేదు సార్‌ గారండి.. వసుధారను నమ్మించేందుకే అలా చేశాను.

శైలేంద్ర: సరే  కాలేజీలో బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో నువ్వు.. నన్ను ఎండీగా ప్రకటించాలి. నా పని పూర్తి కాగానే మిగిలిన డబ్బులు ఇచ్చి నిన్ను మీ ఊరికి పంపిస్తాను.

రిషి: ప‌ని పూర్త‌వ్వ‌గానే న‌న్ను ఏం చేయ‌వ‌ని గ్యారెంటీ ఏంటి?

శైలేంద్ర: నేను ఉండ‌గా నిన్ను ఎవ‌రూ ఏం చేయ‌లేరు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెడ‌తాను.

రిషి: అవును ఎండీ సీట్ అంటే ఎందుకు అంత ఇష్టం నీకు.

శైలేంద్ర: ఎండీ సీట్ చేప‌ట్టాల‌నేది నా జీవితాశ‌య‌ం.  డీబీఎస్‌టీ సామ్రాజ్యంలో రాజుగా ఉండాల‌న్నది నా క‌ల, కాలేజీలో నా మాట శాస‌నంగా మారాల‌న్నది నా కోరిక.

  అంటూ రిషి,జ‌గ‌తి, వ‌సుధార ఇలా ఒక్కొక్క‌రు త‌న క‌ల‌కు అడ్డుగా నిలుస్తూ వ‌చ్చార‌ని ఆగిపోతాడు. అయితే  మ‌హేంద్ర ఫ్యామిలీని నాశ‌నం చేసింది నువ్వేనా? అని రిషి అడగ్గానే లేదని సొంత ఫ్యామిలీని ఎవరైనా నాశనం చేసుకుంటారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు శైలేంద్ర. కాలేజీ గ‌వ‌ర్న‌మెంట్ హ్యాండోవ‌ర్ కాకుండా ఉండాల‌నే నీకు డ‌బ్బులు ఇస్తూ ఈ నాటకం ఆడుతున్నానని చెప్తాడు. మరోవైపు మనం పెళ్లి చేసుకుందామా? అని మనును అడుగుతుంది ఎంజేల్‌. అయితే తనకు వారం రోజుల టైం కావాలని.. నా నిరీక్షణకు వారం రోజుల్లో ఫలితం దక్కనుందని తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామంటాడు మను. మరోవైపు దేవయాని, శైలేంద్ర మాట్లాడుకుంటుంటారు.

దేవయాని: రంగా, రిషి కాదని తెలిస్తే మన పరిస్థితి ఏంటి? వ‌సుధార‌తో రంగా క‌లిసి ఉండ‌టం చూస్తే కంపరంగా అనిపిస్తుంది.

శైలేంద్ర: అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు మామ్‌. ఒక‌వేళ రంగా దొరికిపోయే ప‌రిస్థితి వ‌స్తే వాడిని నేనే లేపేస్తాను.

ధరణి: ఏవండి రంగా అంటే ఎవరండి?

శైలేంద్ర: రంగా నా ఫ్రెండ్.. అయినా ఇక్కడ నీకేం పని వెళ్లు బయటకు

 అంటూ ధరణిని తిట్టి బయటకు పంపిస్తాడు శైలేంద్ర. ఇంతలో మను శైలేంద్రకు ఫోన్‌ చేస్తాడు. శైలేంద్ర ఫోన్‌ లిప్ట్‌ చేయడు. తర్వాత మహేంద్ర, వసుధార, రిషి తమ ఇంటికి వస్తారు. ఇంట్లో జగతి ఫోటో చూసిన మహేంద్ర ఎమోషనల్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
Podarillu Serial Today July 28th:ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget