అన్వేషించండి

Guppedanta Manasu Serial Today April 20th: మను తండ్రి ఎవరో లాజిక్ తో చెప్పిన శైలేంద్ర, మనుకి షాక్ ఇచ్చిన మహేంద్ర

Guppedanta Manasu Today Episode: మ‌ను నిజంగానే మ‌హేంద్ర కొడుకు కావ‌చ్చున‌ని శైలేంద్ర సందేహం వ్య‌క్తం చేస్తాడు. దత్తత ఇష్టం లేదన్నమను మాటకి మహేంద్ర రియాక్షన్ ఇవాల్టి ఎపిసోడ్ లో హైలెట్.

Guppedanta Manasu Today Episode: దేవయానికి రకరాల పిచ్చి మాటలు చెప్పి అనుకి, మహేంద్రకి ఏదో ఉంది అన్న డౌట్ వచ్చేలా చేస్తాడు శైలేంద్ర. మహేంద్ర దత్తత విషయంలో ఇప్పటికే ఉన్న సమస్య చాలని లేనిపోని డౌట్ లు క్రియేట్ చేయద్దు అని చెబుతుంది  దేవయాని 

మహేంద్ర తన కోడలు వసుధార ఇంటికి వచ్చేసరికి ఎదురుగుండా మను ఉంటాడు. లోపల నుండి అనురాధ  కూడా బయటకి వస్తుంది. 

మను: అసలు ఏంటి సర్ ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు... నా పర్మిషన్ లేకుండా నన్ను దత్తత  తీసుకోవడం ఏంటి సార్.

మహేంద్ర: మంచి చేయటానికి పర్మిషన్ కావాలా మను.

మను: ఎవరికి మంచి,  దేనికి మంచి సార్.

మహేంద్ర: అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. 

మను: అది మీ ఊహ సార్. మీరు అనుకుంటున్నారేమో కానీ నా జీవితంలో ఎప్పుడూ మంచి ఉండదు, జరగదు కూడా. మీరు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి సార్. 

మహేంద్ర: ఇవి పిచ్చి పిచ్చి ఆలోచనలు అని నువ్వు ఎలా డిసైడ్ అవుతావు మను. 

మను: కాకపోతే మరేంటి సార్. ఇప్పటికే అందరిలో మీరు నా తండ్రి అని చెప్పినందుకు నేను చాలా హర్ట్ అయ్యాను. కానీ మీ మీద ఉన్న గౌరవంతో నేనేమి మాట్లాడకుండా ఉన్నాను సార్. ఏంటి మేడం మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు. మీరు కూడా ఏంటి, సార్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మీరు దగ్గరుండి ఎంకరేజ్ చేస్తారా... 

వసుధార: ఒకరు ఒక పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత, దానిని ముందుకు తీసుకెళ్లడానికి ఎవరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని ఎవరు డిస్కరేజ్ చేస్తే ఆ పనిని ఆపమన్న ఆపరు. 

మను: ఇవన్నీ కాదండి. ఎలాంటి సిచువేషన్ లో మీకు ఈ ఆలోచన వచ్చిందో, ఏ ఆలోచనతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు నాకు తెలియదు. ఇప్పుడు మీరు మీ మనసుని మార్చుకోవాల్సిందే. మీ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే.

మహేంద్ర: కుదరదు. మా అన్నయ్య వాళ్ళే ఇప్పటిదాకా చెప్పారు. చాలా బ్రతిమిలాడారు. నాతో కూడా కుదరదని చెప్పాను. రెండు రోజుల్లో దత్తత కార్యక్రమం ఉంటుంది..

మను: ఏంటి సార్ మీరు.. నాకిష్టం లేకుండా నన్ను దత్తత తీసుకోవడం ఏంటి.

మహేంద్ర: అవును తీసుకుంటా అంటున్నాను. అది కూడా ఏదో ఫార్మాలిటీగా ఒక సంతకం పెట్టేసి నువ్వు నా కొడుకువి అయిపోయావు అని చెప్పడం కాదు. జాతకాలు అవి చూసి పంతులు గారితో మాట్లాడి, అధికారుల సమక్షంలో బంధు మిత్రుల సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. 

మను: సర్ ప్లీజ్ మీరు ఇలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా భరించలేకపోతున్నారు. ఎన్ని రోజులు మీరు నాలో మీ కొడుకుని చూసుకుంటున్నాను అన్నారు కాబట్టి ఏమో అనుకున్నాను. కానీ చివరికి ఇలా చేస్తారు అని అస్సలు ఊహించలేదు సార్. 

మహేంద్ర: నిన్ను నా కొడుకులా భావించాను. అందుకే నీతో కూడా చాలాసార్లు అన్నాను కదా. నేను నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను అనుకో. నా కొడుకు ఇవ్వాలి అనుకున్న కంకణం కూడా నీకు ఇద్దామని అనుకున్నాను కదా. కానీ దత్తతి తీసుకోవాలని మాత్రం ఇంతకుముందే అనిపించింది. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. 

మను: మీకు అంతగా కొడుకు కావాలనుకుంటే బయట చాలామంది దొరుకుతారు. మీరు ఎవరినైనా దత్తత తీసుకోండి. నన్ను మాత్రం అలా చేయకండి సార్. నేను అది చాలా అవమానంగా ఫీల్ అవుతుంటాను 

మహేంద్ర: ఏంటి మనం ఇన్నాళ్లు నువ్వు తండ్రి ఎవరో తెలియకుండా చాలా అవమానంగా పెరిగావు కదా. అంతకన్నా ఎక్కువగా అవమానంగా ఫీల్ అవుతావా. తండ్రి ఎవరో తెలియకుండా బతకడం కంటే, ఇతను నా తండ్రి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది కదా. 

మను: సార్ మీకు చెబుతుంటే అర్థం కాదా. 

వసుధార: మను గారు ప్లీజ్ కంట్రోల్. 

మను: ఏంటండీ, ఏంటి కంట్రోల్. చెబుతుంటే అర్థం చేసుకోవాలి కదా. అసలు మీరు ఏ హక్కుతో మీరు నన్ను దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారు. 

మహేంద్ర: అవునా.. అయితే మరి ఏ హక్కుతో నువ్వు మా కాలేజ్ ని కాపాడావు.. చెప్పు ఏ  హక్కుతో  50 కోట్ల చెక్కు ఇచ్చావు. ఏ హక్కుతో వసుధార బర్త్ డే సెలబ్రేట్ చేసావ్. 

మను: సార్ అవన్నీ చిన్న చిన్న విషయాలు సార్. 

మహేంద్ర: చిన్న చిన్న విషయాలని నువ్వు అనుకుంటే ఎలా. ఆరోజు వసుధార ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయిందో నీకు తెలుసు కదా.  నువ్వు ఏ హక్కుతో ఇవన్నీ చేసావో, నేను కూడా అదే హక్కుతో ఇప్పుడు నిన్ను నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను.

మను: మీరు దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారేమో. నేను మాత్రం అందుకు అంత సిద్ధంగా లేను. నేను ఆ కార్యక్రమానికి రాను, రాలేను కూడా సార్. మీరు ఎవరితో చేసుకుంటారు  చేసుకోండి. 

మహేంద్ర: నువ్వు ఆరోజు వస్తున్నావు, నన్ను కలుస్తున్నావు, నేను అనుకున్నది జరుగుతుంది. లేదంటే నువ్వు నన్ను  మళ్ళీ జీవితంలో కలుసుకోలేవు. మళ్లీ ఇక నన్ను జీవితంలో చూడలేవు.

మను: సార్ మీకు ఏమైనా పిచ్చా 

మహేంద్ర: అవును నేను పిచ్చోడిని. కొన్ని కొన్ని విషయాలలో  చాలా మూర్ఖంగా,  చాలా మొండిగా  ఉంటాను. కావాలంటే పసుధార అని అడుగు.

అని అంటూ  అక్కడనుండి బయటకి వచ్చేస్తాడు. కోపంగా మను అక్కడనుండి వెలిపోతాడు. మహేంద్ర విశ్వనాదం కి ఫోన్ చేసి ఆరోగ్యం బానే ఉంది కదా అని అడుగుటాడు.  మీ మనవడు మను ని దత్తత తీసుకుందామనుకుంటున్నాను అని చెబుతారు.  ఇద్దరి మధ్య మాటలు  ఆగిపోతాయి. విషయం అందరికీ చెప్పానని, మీకు కూడా ఒక మాట చెబుతున్నాను అని కాల్ కట్ చేస్తాడు.  విశ్వనాధ్ ఇంట్లో మనుని దత్తత తీసుకుంటున్నాడు అన్న విషయం చెబుతాడు. మను అసలు తండ్రి గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఇదంతా అనుపమ కుటుంబంలో కూడా వివాదాన్ని రేపుతుంది. అనుప‌మ‌కు పెద్ద‌మ్మ‌కు ఫోన్ చేస్తుంది. ఇక‌నైనా మౌనం వీడ‌మ‌ని స‌ల‌హా ఇస్తుంది. ఒక్క అడుగు ధైర్యంగా వేస్తే ఈ అవ‌మానాలు, త‌ల‌వంపులు ఉండ‌వు. నిన్ను వేలేత్తి చూపిన వాళ నోర్లు మూత‌ప‌డ‌తాయి అని బుద్ధి చెబుతుంది. 

ద‌త్త‌త‌కు రాక‌పోతే తాను చ‌నిపోతాన‌ని మ‌హేంద్ర బెదిరించ‌డం గురించి మ‌ను ఆలోచిస్తుంటాడు. ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి వెళ్లాలా? వ‌ద్దా? అని ఆలోచిస్తుంటాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget