అన్వేషించండి

Guppedantha Manasu October 12th: అంతా ప్రేమమయం - నిజం తెలుసుకుని వసుకి ప్రామిస్ చేసిన రిషి!

Guppedantha Manasu Today Episode: కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతిని చంపేశారు.. ఇప్పుడు రిషి ఏం చేస్తాడో చూడాలి...

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంతమనసు అక్టోబరు 12 ఎపిసోడ్
జగతిని తలుచుకుని బాధపడుతున్న రిషిని ఓదార్చుతాడు చక్రపాణి... ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని నోటికి పనిచెబుతుంది
దేవయాని: మీ మనసులో బాధలేదు కానీ ఉన్నట్టు నటిస్తున్నారు. ఇంత జరిగినా మీ భార్య ఎందుకురాలేదు
పెద్దమ్మా ఎందుకిదంతా అని రిషి అంటాడు కానీ దేవయాని అస్సలు తగ్గదు.. జగతిని చివరిసారిగా చూసేందుకు కూడా ఆమె రాలేదంటే ఏమనుకోవాలి. మీరు అవకాశవాదులు సంబంధం కలుపుకోవడంతో ఉన్నంత ఆత్రం ఆ తర్వాత లేదు..
చక్రపాణి: నా భార్య సుమిత్రకి జగతి మేడం అంటే అభిమానం
దేవయాని: పెళ్లికి రాలేదు..జగతి మేడం చనిపోయినప్పుడు కూడా రాలేదు.. మీ ప్రేమలన్నీ నటనే
చక్రపాణి: మీరు అలా మాట్లాడి నా మనసు నొప్పించకండి..
దేవయాని: మిమ్మల్ని రెండు మాటలంటేనే మీకు అంత బాధ అనిపించినప్పుడు మాకెలా ఉండాలి
చక్రపాణి: అసలు ఉంటే కదా రావడానికి
రిషి: నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆమె కనిపించలేదు 
ఇప్పుడెందుకని చక్రపాణి చెబుతున్నా దేవయాని రెచ్చిపోతుంది
చక్రపాణి: జగతి మేడం కన్నా ముందే నా భార్య దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. తనపై మీకు ఉండాల్సింది సానుభూతి కాదు ప్రేమ అని ఆ విషయం మీకు చెప్పకుండా వసు ఆపేసింది..మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నా భార్య ఫొటో చూడకుండా దాచిపెట్టింది. బాధలో ఉన్న మిమ్మల్ని మరింత భాదపెట్టకూడదని నా కూతురు అలా చేసింది. అందులో మరో ఉద్దేశం లేదు... మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా మాట్లాడుకునేవాళ్లం కాదమ్మా అనేసి..అక్కడి నుంచి వెళ్లిపోతాడు చక్రపాణి...

Also Read: శైలేంద్ర గురించి రిషికి క్లారిటీ ఇచ్చిన వసుధార - దేవయానిని వణికించిన మహేంద్ర!

రిషి రూమ్ లో కూర్చుని చక్రపాణి మాటలు, వసుధారని గతంలో బాధపెట్టిన విషయాలు తలుచుకుంటూ బాధపడతాడు.. ఇంతలో వసుధార అక్కడకు వస్తుంది
వసు: ఏం ఆలోచిస్తున్నారు సార్..మినిస్టర్ గారి మాటల గురించా ఓ అడుగు ముందుకేయాల్సినచోట ఆలోచిస్తూ ఆగిపోకూడదు. మేడం ఆశయం మీ వల్లే సాధ్యం అవుతుంది.అందుకే మీరు మళ్లీ మీ సీట్లో కూర్చోవాలి సర్..
రిషి: అందుకు నా మనసు అంగీకరించడం లేదు
వసు: ఎక్కడ మీకు గౌరవం పోయిందో అక్కడే గౌరవం దక్కాక అడుగుపెట్టాలని మీకున్నట్టే నాక్కూడా ఉంది. కానీ మీరు ఇప్పుడు పంతంతో ఉంటే ఇప్పుడు కాలేజీ చేయిజారిపోతుంది
రిషి: నిజం అందరి ముందూబయటపెడితే చాలు..కానీ అక్కడ మా అమ్మ ఉండదు కదా..తను చేసిన త్యాగం ప్రతిక్షణం నా కళ్లముందు కదలాడుతోంది. అమ్మని పోగొట్టుకుని  ఆ బాధని గుండెల్లోనే దాచుకుని ముందుకు సాగిపోవడానికి నేను వసుధారని కాదు 
రిషి మాటలకు వసుధార షాక్ అవుతుంది...మీ అమ్మ చనిపోయిందని నాకు తెలిసిపోయింది వసుధారా...ఎప్పుడూ పంతంతోనే ఉంటాను అనుకున్నావు కానీ నీ బాధను పంచుకోవడానికి కూడా నేను పనికిరానా వసుధారా..అసలు ఎందుకు దాచిపెట్టావ్ అని అడగ్గానే... వసు కన్నీళ్లతో రిషిని హగ్ చేసుకుంటుంది...

Also Read: కాలేజ్ MDగా రిషి రీఎంట్రీ - దేవయాని, శైలేంద్రకి బిగ్ షాక్!

రిషి: మీ అమ్మగారు ఎలా చనిపోయారు...
( రిషి సార్ జీవితంలో నేను లేనమ్మా అని వసుమాటలకు సుమిత్ర కుప్పకూలిపోతుంది..అది గుర్తుచేసుకుంటుంది వసుధార)
వసు: మా అమ్మ పోవడానికి పరోక్షంగా నేనే కారణం..ఓ అబద్ధపు సాక్ష్యం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మీపై అభియోగం మోపానని మీరు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్లాను... జరిగిన విషయం చెప్పగానే అమ్మ తట్టుకోలేకపోయింది..ఆ క్షణమే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. మా అమ్మను హాస్పిటల్లో చేర్పించిన అదే సమయానికి మీరు హాస్పిటల్ కి వచ్చారు. మీకు ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్స్ ముందుకు రాకపోతే అది మీరు అని తెలియకుండానే noc మీద నేను సంతకం చేశాను. ఆ తర్వాత మీకు వాళ్లు ట్రీట్మెంట్ చేశారు. ఓ పక్క మా అమ్మ పోయిందనే బాధ, మరోపక్క మీరు దూరమయ్యారనే బాధను చూడలేక మేం ఊరు మారాల్సి వచ్చింది. నేను మీకోసం వెతకని చోటు లేదు..ఎక్కడా మీ గురించి తెలియలేదు. మహేంద్ర సార్ వాళ్లకి కూడా తెలియలేదు. నేను ఒంటరిగా ఉంటే ఏమవుతానో అని మా నాన్న నన్ను కాలేజీలో పనిచేయడానికి పంపించారు..అక్కడే మీరు కలిశారు.. నా జీవితంలోకి మళ్లీ వెలుగొచ్చింది.. ఏంజెల్ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది నేను కాపాడుకుంది నా రిషి సార్ ని అని..
రిషి: ఇన్నాళ్లూ నా ప్రాణాలు కాపాడింది ఏంజెల్ అనుకున్నాను..కానీ నా ప్రాణాలు కాపాడేందుకు నువ్వు కూడా కారణం అయ్యావు.. నన్ను క్షమించు. నా వల్లే మీ అమ్మగారు పోయారు
వసు: ఇందులో మీ తప్పేంలేదు..మీరు బాధపడతారనే ఈ విషయం దాచిపెట్టాను. నాకు కావాల్సింది సానుభూతి కాదు ప్రేమ..
రిషి: నేను చాలా మూర్ఖంగా ఆలోచించాను..నా వ్యక్తిత్వంపై మచ్చ వేశారనే బాధతో దూరంగా వెళ్లిపోయాను.. సూటి పోటి మాటలతో మీ మనసుకి గాయం చేశాను..నేను ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల మీ అమ్మకు నువ్వు..మా అమ్మకు నేను దూరమయ్యాను... అర్థం చేసుకోలేకపోయానని బాధపడతాడు
వసు: మీరు బాధపడకూడదనే మేం ఇన్నాళ్లూ భరిస్తూ వస్తున్నాం
నీలాంటి అమ్మాయి ప్రేమ పొందినందుకు నేను అదృష్టవంతుడిని అని రిషి అంటే..మీ ప్రేమ దొరకడం నా అదృష్టం అని వసు అంటుంది..
ఇకపై మనం రిషిధారలం...మన  బంధాన్ని ఇంకెవ్వరూ వేరుచేయలేరు, నువ్వు బాధని మోస్తూ నన్ను కాపాడుకున్నావ్ నువ్వు చాలా గొప్పదానివి, నీ ఆలోచనను ఎవ్వరూ అంచనా వేయలేరు..నీ వ్యక్తిత్వానికి ఎవరూ సరితూగరు, నా వెంట నడిచావ్ నా చుట్టూ ఉన్న సమస్యల నుంచి బయటపడేశావ్..నేను ఏం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి... 
మీ మంచి చెడుకు చూసుకోవడం నా బాధ్యత అని వసుధార అంటే..నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను, నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో నాకు తెలుసు అంటే.. మీరెప్పుడూ నా పక్కన ఉంటే చాలు సార్ అంటుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Embed widget