అన్వేషించండి

Guppedanta Manasu May 19th: ఇంత అందంగా ఉండడం కూడా క్రైమే వసుధారా - అదుపుతప్పుతున్న మాస్టారి మనసు!

Guppedantha Manasu May 19th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుప్పెడంతమనసు మే 19 ఎపిసోడ్

రిషి - వసు ఇంటికి ఆలస్యంగా రావడంతో జగతి రిషిని ఏమనలేక వసుపై కోప్పడుతుంది. రిషి హర్ట్ అయి జగతిపై కోప్పడతాడు. ఆ తర్వాత వసుధార ఇంటి లాన్ లో కూర్చుని ఆలోచిస్తుంది. వసు కోసం వెతుక్కుంటూ రిషి అక్కడకు వస్తాడు. ఏంటిసార్ ఇలా వచ్చారంటే..నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు అందుకే వచ్చానంటాడు. మీ కోపం తగ్గిందా అని వసు అడిగితే..కోపం కాదు నాముందే మేడం నిన్ను అలా అనడం నాకు నచ్చలేదంటాడు. 
వసు: ‘ఏం లేదు సార్ మనకు ప్రమాదం జరుగుతుందేమోనని మేడమ్ భయం సార్.. అమ్మ ప్రేమకి..’ అని ఏదో చెప్పబోయి రిషి వైపు చూసి ఆగిపోతుంది. వెంటనే ‘హా.. అదే.. అంటే.. మేడమ్‌కి భయం ఎక్కువ కదా సార్’
రిషి: మనకు ప్రమాదం తలపెట్టేవాళ్లు ఎవరున్నారు . మేడమ్ మన గురించి ఎక్కువగా ఆలోచించడం లేదా? నిజం చెప్పు వసుధార.. తను మన గురించి అనవసరంగా భయపడుతున్నారు కదా.
వసు: వెంటనే వసుకి జగతి మాటలే గుర్తొస్తాయి. ‘రిషి నన్ను ఎన్ని మాటలన్నా కానీ.. కోప్పడినా కానీ నేను భరిస్తాను వసు.. నా బిడ్డకు ఏదైనా జరగరానిది జరిగితే ఈ తల్లి గుండె ఆగిపోతుంది వసు’ అన్న జగతి ఆవేదన గుర్తొస్తుంది. 
రిషి: మేడమ్ మీద కోప్పడాలంటే నాకూ మనసు రావడం లేదు. కానీ తను చేసే పనులు.. మాట్లాడే మాటలు నాకు కోపం తెప్పిస్తున్నాయి’
వసు: మేడమ్ బాధపడలేదు సార్ 
రిషి: అదేంటీ బాధపడలేదా 
వసు: అవును సార్.. బాధలేదా అని నేనూ అడిగాను.. రిషి ఏమన్నా నేను బాధపడను.. నాకు కావాల్సింది రిషి సంతోషంగా, క్షేమంగా ఉండాలి అన్నారు సార్.. మేడమ్ చాలా గొప్పవారు సార్.. ప్రతిక్షణం మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. తనవి అనవసరమైన ఆలోచనలు కావు సార్..’ అంటుంది 
గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోదాం అనుకుంటాడు.. కానీ వసుధార మాత్రం మీ మనసులో భారం దించకుండా గుడ్ నైట్ చెప్పలేను అంటుంది. ఆ తర్వాత చిన్న క్విజ్ ఆడుతారు..ఇద్దరికీ పరిచయం మొదట్లో జరిగిన గొడవల గురించి మాట్లాడుకుంటారు. అలా ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూ అక్కడే నిద్రపోతారు. పొద్దున్నే ధరణి కాఫీ తీసుకొచ్చి నిద్రలేపుతుంది. రాత్రంతా నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటున్నారా అని ధరణి అంటే..అవును అంటారు ఇద్దరూ. ఆ తర్వాత కాఫీ తాగి రెడీ అయి కాలేజీకి వెళదాం అనుకుని లేస్తారు.

Also Read: రిషి నోట మొదటిరాత్రి మాట, ఈ సారి టార్గెట్ మిస్సవదన్న శైలేంద్ర!

సగం పెళ్లైంది కదా...
కాలేజ్‌కి వెళ్లడానికి తలస్నానం చేసి వచ్చిన వసు.. వైట్ డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటూ ఉంటుంది. ఇంతలో రిషి వస్తాడు. అప్పుడే వసు చేతిలోంచి టవల్ కింద పడిపోతే.. రిషి దాన్ని అందుకుంటాడు.  వసు మెడ వంపుల్లో ఉన్న తడిని తుడిచేందుకు ట్రై చేస్తాడు. వసుకి రిషి ఉద్దేశం అర్థమై సిగ్గుతో టవల్ లాక్కుని ‘సార్ మీరు ఇలాంటి పనులు చేయకూడదు..’ అంటుంది. ‘ఏ ఇదేమైనా క్రైమా?’ అంటాడు రిషి రొమాంటిక్‌గా చూస్తూ. ఎవరు చేసినా క్రైమ్ కాకపోవచ్చు కానీ మీలాంటి జెంటిల్‌మెన్ చేస్తూ దాన్నే క్రైమ్‌లాగా పరిగణలోకి తీసుకోవచ్చని రిప్లై ఇస్తుంది. వసు కొంచెం ఓరగా చూస్తూ సిగ్గుపడుతుంది. ‘అయినా మనిద్దరికీ నిశ్చితార్థం అయిపోయింది కదా అని రిషి అంటే ఇంకా పెళ్లికాలేదు కదా సార్ అంటాడు రిషి. ఇంతకీ నువ్వు దేనిగురించి మాట్లాడుతున్నావ్ అని రిషి అంటే..మీరు దేనిగురించి ఆలోచిస్తున్నావో దాని గురించే మాట్లాడుతున్నా అని చెబుతుంది. ‘కొన్ని కొన్నిచూపులని బట్టి చేతలని బట్టి.. ఆలోచనలు అర్థమవుతాయి సార్..’ అంటుంది వసు. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో నీ తర్వాతే వసుధార అంటూ త్వరగా రెడీ అవు అంటాడు రిషి. నన్ను రెడీ అవమని మీరు సరిగా రెడీ అవలేదంటూ రిషి షర్ట్ బటన్స్ పెడుతుంది. అది చూసి జగతి మురిసిపోతుంటే..దేవయాని క్రూరంగా నవ్వుకుంటుంది..ఇంకెన్నాళ్లు లే అని.

Also Read: శనిజయంతి రోజు ఈ రాశులవారిపై శనిదేవుడి అనుగ్రహం ఉంది!

మిషన్ ఎడ్యుకేషన్ కి ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో అందరూ చెబుతుంటే తెలుసుకున్నాను కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నానంటూ రిషిని పొగుడుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ మిగిలిన స్టేట్స్ లో కూడా పెట్టాలి..అందుకే నువ్వు వసుధార వేరే స్టేట్స్ కి వెళ్లి అక్కడ కూడా మిషన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలంటాడు.
రిషి: నేను అక్కడికి వెళితే మన కాలేజీని ఎవరు చూసుకుంటారు అంటాడు
శైలేంద్ర: నేను లేనా అందుకు నాకు అర్హత లేదా అని అసహనం వ్యక్తం చేస్తాడు . దేశం నలుమూలలా నీపేరు తెలియాలి అదే నా కోరిక 
రిషి: నో చెప్పేస్తాడు
శైలేంద్ర: నాకు తెలుసు రిషి నువ్వు కాలేజీ వదలవని..నీ ప్రాణాన్ని నా ప్రాణంలా చూసుకుంటాను నువ్వేం దానిగురించి భయపడకు
ఫణీంద్ర: శైలేంద్రా ఇది రిషికే కాదు నాక్కూడా ఇష్టంలేదు తను లేకపోతే కాలేజీ రూపురేఖలు కూడా మారిపోతాయి
దేవయాని: నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి...శైలేంద్ర చెప్పిన మాట విను..ఇక్కడ పరిస్థితులు సర్దుమణిగాక రావొచ్చు కదా
రిషి: నేను కనిపించకపోతే నువ్వు తట్టుకోగలవా
దేవయాని: రిషి కాలేజీ గురించి మన గురించి ఆలోచిస్తున్నాడు..మీరైనా చెప్పండి అంటుంది
ఫణీంద్ర: నీ మాటల్లో అర్థం ఉంది..రిషి మాటల్లో అర్థం ఉంది..ఫైనల్ నిర్ణయం రిషిదే 
శైలేంద్ర: వసుధారా నువ్వు సైలెంట్ గా ఉంటావేంటి..నీ అభిప్రాయం ఏంటి 
వసు: రిషికి ఏదైనా ప్రమాదం తలపెడతాడు ఏమో అనే భయంతో...మనం వెళ్లిపోవడమే కరెక్ట్ అంటుంది 
రిషి: ఎక్కడికి వెళ్లేది అని ఫైర్ అయిన రిషి..ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్లలేను.. నాకు ఎదురొచ్చే శత్రువులను ఎలా పక్కనపెట్టాలో నాకు తెలుసు..అయినా అన్నయ్యకి తెలియకపోయినా నీకు తెలుసు కదా వసుధారా..నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు... మీరు ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారో తెలియడం లేదంటూ..మీ మనసులో ఏముందని జగతిని అడుగుతాడు..
వసు: మనం వెళ్లిపోదాం సార్..
రిషి: కావాలంటే నువ్వెళ్లు...కాలేజీని, ఇంటిని వదిలిపెట్టి రాను అనేసి కోపంగా రూమ్ లోకి వెళ్లిపోతాడు..
రూమ్ లోకి వెళ్లి శైలేంద్ర మాటలు, వసుధార మాటలు గుర్తుచేసుకుంటాడు.... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget