![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedanta Manasu March 21st: ఇద్దరి మధ్యా దూరం లేదు భారం మాత్రమే అన్న రిషి, దేవయాని ఫస్ట్ నైట్ ప్లాన్ కి రిషిధార ఇచ్చే సమాధానం!
Guppedantha Manasu March 21th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
![Guppedanta Manasu March 21st: ఇద్దరి మధ్యా దూరం లేదు భారం మాత్రమే అన్న రిషి, దేవయాని ఫస్ట్ నైట్ ప్లాన్ కి రిషిధార ఇచ్చే సమాధానం! Guppedanta Manasu Serial March 21st Episode 716 Written Update Today Episode Guppedanta Manasu March 21st: ఇద్దరి మధ్యా దూరం లేదు భారం మాత్రమే అన్న రిషి, దేవయాని ఫస్ట్ నైట్ ప్లాన్ కి రిషిధార ఇచ్చే సమాధానం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/5765cc6968a5d3c5ba237dd8fbf3604c1679369888690217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గుప్పెడంతమనసు మార్చి 21 ఎపిసోడ్
వసుధార బండి దాచేసిన రిషి...ఎట్టకేలకు కార్లో వసుని తీసుకెళతాడు...ఇద్దరూ కార్లో వెళుతుంటారు..
వసుధార: నేను ఏం ఆలోచిస్తున్నానో అని అడగరా సార్
రిషి: నువ్వు ఏం ఆలోచిస్తే నాకెందుకు
వసు: నేను మీ గురించి ఆలోచిస్తున్నాను సార్
రిషి: నా గురించి ఏం ఆలోచిస్తున్నావు
వసు: మీరు మా ఎండీ కదా సార్
రిషి: ఎండీ ని కాదు ..అయినా నా కోపం భరిస్తానన్నావు కదా భరించు
వసు: ఎక్కడో చదివాను భరించి వాడే భర్త అని కానీ మన విషయంలో రివర్స్ ఉంది..ఈ నెల శాలరీ తొందరగా వస్తే మేలు సార్
రిషి: ఇంకా రాలేదా అయినా డబ్బుతో నీకేం పని
వసు: నాకు పెళ్లి అయింది కదా సార్ ఖర్చులు ఉంటాయి కదా...
ఇంతలో సార్ కారు ఆపండి మిర్చి బజ్జీ తిందాం అని వసు అంటే నా దగ్గర డబ్బుల్లేవ్ అని రిషిఅంటే.. నేనిస్తానంటుందివసుధార. మిర్చి బజ్జి తినడం ఇష్టంలేక ఏదేదో మాట్లాడుతాడు రిషి. అర్థమైంది లెండి అన్న వసుధార..ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కి వెళదాం అని అడుగుతుంది... ఇంటికి వెళుతున్నాం అని క్లారిటీ ఇస్తాడు రిషి
Also Read: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర
అటు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుండగా నాకు ఒక్కటే కాదు ధరణి అందరికీ సమానంగా వడ్డించు అంటుంది దేవయాని. అప్పుడు ధరణి నువ్వు కూడా కూర్చోమ్మా అని దేవయాని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు దేవయాని ధరణికి వడ్డించడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని వసుధార మీ అమ్మా నాన్నలను రమ్మని చెప్పు అని అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. ఎందుకు అక్కయ్య అని జగతి అంటుంది. పెళ్లైన తర్వాత మిగతా తంతులు పూర్తి చేయాలి కదా అని అంటుంది. మేడం ఇప్పుడు అవన్నీ వద్దు అనడంతో..చూశావా నన్ను ఇంకా మేడం అంటున్నావు అంటే ఇంకా మన మధ్య ఎంత దూరం ఉందో అని అంటుంది. ఏంటి జగతి నువ్వు ఏమి మాట్లాడవు వారు పెళ్లి చేసుకున్నారు మిగతావన్నీ పెద్దవాళ్ళుగా మనం చూడాలి కదా అని అంటుంది. రిషి తినకుండా చేయి కడుక్కుని వెళ్లిపోతాడు. వసు కూడా తినకుండా వెళ్లిపోతుంది. ఆ తర్వాత జగతి మహేంద్ర ఇద్దరు రూమ్ లోకి వెళ్లి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.ఇంతలో వసు వస్తుంది
Also Read: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
జగతి: మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు వసు. మనకు కొన్ని ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి. దేవయాని అక్కయ్య అన్నట్టు వాటన్నింటినీ విడిచిపెట్టి మీరిద్దరూ ఎన్ని రోజులని ఇలా ఉంటారు
వసు: నాదేముంది మేడం
జగతి: సమస్య మీ ఇద్దరితో అయినప్పుడు ఇద్దరూ కలసి పరిష్కారం వెతుక్కోవాలి కదా
వసు: ముందు రిషి సార్ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి
జగతి: ఒకసారి మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది వసుధార
వసు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
వసుధారకు నిద్రలోంచి మెలకువ రావడంతో బయటకు వస్తుంది..అదే సమయానికి రూమ్ బయట నిల్చుని డోర్ కొట్టాలి అనుకుంటాడు రిషి.
ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు నాతో ఏమైనా మాట్లాడాలా అని వసు అడిగితే..ఏదో శబ్దం అయితే వచ్చాను అనడంతో పిల్లి శబ్దం అయ్యుంటుంది సార్ అని అంటుంది. ఇద్దరూ కాసేపు ఫన్నీగా వాదించుకుంటారు.
వసు: ఇద్దరి మధ్య గోడలు మాత్రమే అడ్డంగా ఉన్నాయి సార్.
రిషి: దూరం అనగా దూరం అనకు వసుధార కేవలం భారం మాత్రమే ఉంది అని అంటాడు రిషి. అప్పుడు రిషి మనసులో మనిద్దరికీ సంబంధించి అన్ని ఆలోచిస్తావు చేస్తావు ఆ ఒక్క విషయంలో ఎందుకు అలా చేశావు వసుధార అనుకుంటూ ఉంటాడు. పెద్దమ్మ అన్న మాటల గురించి ఏమైనా అడగాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు రిషి.
వసు: మనసులో నాకేం ప్రశ్నలు లేవు..సమాధానాలు మాత్రమే ఉన్నాయి..కానీ మీ ప్రశ్నలకు అది సరిపోవడం లేదని మీరనుకుంటున్నారు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)