Guppedanta Manasu June 24th: వసు ఊహల్లో చపాతీలు చేసుకుంటున్న రిషి - కాలేజ్ సీట్ టచ్ చేయలేరంటూ జగతి స్ట్రాంగ్ వార్నింగ్!
Guppedantha Manasu June 24th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు జూన్ 24 ఎపిసోడ్
మిషన్ ఎడ్యుకేషన్ రన్ చేయడానికి సరైన స్టాఫ్ లేరు అందుకే ప్రభుత్వంతో ఫెయిల్యూర్ అనిపించుకోవడం కన్నా ఈ ప్రాజెక్టు నుంచి క్విట్ అయిపోదాం అంటాడు శైలేంద్ర. కాలేజీ స్టాఫ్ అందరూ కూడా శైలేంద్ర కే వత్తాసు పలుకుతారు. అందరిపై జగతి ఫైర్ అవుతుంది.
జగతి: మిషన్ ఎడ్యుకేషన్ అనేది నా బ్రెయిన్ చైల్డ్ దానిని కంటిన్యూ చేయాలో క్విట్ చేయాలో నిర్ణయించే హక్కు నాకు రిషికి, వసుకి మాత్రమే ఉంది. వాళ్లు లేరు కాబట్టి ఈ ప్రాజెక్టుని నేను ముందుకు తీసుకు వెళ్తాను ఇష్టం లేని వాళ్ళు పక్కకు తప్పుకోవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి మీటింగ్ నుంచి కోపంగా బయటకు వెళ్లిపోతుంది జగతి
ఫణీంద్ర: జగతి నిర్ణయం సరైనది, తను స్టూడెంట్స్ మంచికోసం చేస్తోంది. నీ సపోర్ట్ ఉంటుందా అని మహేంద్రని అడిగితే అన్నయ్యా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లకే నా సపోర్ట్ అంటాడు మహేంద్ర. కాలేజీ స్టాఫ్ కూడా జగతికి సపోర్ట్ చేస్తామంటారు.
మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టాఫ్ అందర్నీ తిడతాడు ఫణీంద్ర. అలా ఎలా ప్లేట్ ఫిరాయిస్తారు అని అడుగుతాడు. మేము ఏమీ చేయలేం సార్.చూశారు కదా మహేంద్ర సర్ వాళ్లే జగతి మేడంకి సపోర్ట్ చేస్తున్నారు మేము సపోర్ట్ చేయకపోతే మా లైఫ్ నీ రిస్క్ చేసిన వాళ్ళం అవుతాం. గతంలో ఇద్దరు లెక్చరర్లు ఇలాగే మీ ఫ్యామిలీ విషయాల్లో దూరి ఉద్యోగం పోగొట్టుకున్నారు, మేం ఆ నిర్ణయం తీసుకోలేం అనేసి వెళ్లిపోతారు.
Also Read: వసుతో కలసి రిషి ప్రయాణం, శైలేంద్ర కొత్త ప్లాన్ కి చెక్ పెట్టిన జగతి
మినిష్టర్ ను కలుస్తుంది జగతి
జగతి: చదువుకోలేని పిల్లలకి అండగా ఉండాలన్నది రిషి ఆశయం. నేను తన ఆశయాన్ని నిలబెడతాను సార్
మినిస్టర్: రిషికి అయిన గాయం చిన్నది కాదు..తాను కోలుకోవాలంటే మీరు నిజం చెప్పాలి, తనపై ఉన్న అభియోగాన్ని తొలగించాలి అందుకు మీరు నిజం చెప్పాలి
జగతి: అన్ని ప్రశ్నలకు రిషి వస్తేనే సమాధానాలు బయటకు వస్తాయి
మినిస్టర్: మీకు ఎవరి నుంచి ఇబ్బంది ఉందో చెప్పండి నేను చూసుకుంటాను
ఇంతలో ఎంట్రీ ఇస్తాడు శైలేంద్ర..ఏంటి ఇక్కడకు వచ్చాడు అనుకుంటుంది జగతి
శైలేంద్ర: పర్మిషన్ లేకుండా వచ్చినందుకు మినిస్టర్ కి సారీ చెప్పి మా పిన్ని మిషన్ ఎడ్యుకేషన్ గురించేనా మాట్లాడుతున్నారు ఆవిడ ఆ పని చేయలేరు మీతో చెప్పడానికి మొహమాటపడుతున్నారు అందుకే ఈ ప్రాజెక్ట్ క్విట్ చేసి వేరే కాలేజీకి ఈ ప్రాజెక్టు సబ్మిట్ చేయండి
మినిస్టర్: శైలేంద్ర చెప్పింది నిజమేనా
జగతి: ఈ ప్రాజెక్ట్ ని నేను హ్యాండిల్ చేస్తాను సార్ దీన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత నాది ఇందులో ఎలాంటి మార్పు లేదు
మినిస్టర్ : శైలేంద్ర కి చివాట్లు పెట్టిన మినిస్టర్ మీ పిన్ని కెపాసిటీ నీకు తెలియనట్లుగా ఉంది. ఆవిడ దేన్నైనా హ్యాండిల్ చేయగలరు , ఇకముందెప్పుడూ జగతి మేడం గురించి మీరు తక్కువ చేసి మాట్లాడొద్దు, వీలైతే సహాయం చేయండి లేదంటే పక్కకు తప్పుకోండి అని స్ట్రాంగ్ చెబుతాడుట
జగతి: మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్ అని చెప్పి..శైలేంద్ర ఇకపై ఇలాంటివి చెప్పి మినిస్టర్ గారికి చెప్పి ఆయన టైమ్ వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి వెళ్లిపోతుంది జగతి...
Also Read: ప్రేమ వర్షంలో తడిసిముద్దయ్యేందుకు ఎదురుచూస్తోన్న వసు, ఎడారిలోనే ఉంటానంటున్న రిషి!
ఇంటికి కోపంగా వచ్చిన శైలేంద్ర ఆ వెనుకే వచ్చిన జగతిపై ఫైర్ అవుతాడు
ఫణీంద్ర: ఏంటి నీ ధైర్యం మిషన్ ఎడ్యుకేషన్ ఎలా రన్ చేద్దామనుకుంటున్నావు
జగతి: నన్ను నమ్ముకున్న వాళ్లే నా ధైర్యం. నా కొడుకు కోసమే నేను లొంగిపోయాను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తలోగ్గేది లేదు
దేవయాని కూడా జగతికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది...ఆమె కనుసైగ చూసి సైలెంట్ అయిపోతాడు శైలేంద్ర. మీరు అందరూ ఒకటే అన్నమాట అంటూ కోపంగా వెళ్ళిపోతాడు.
దేవయాని: జగతితో నువ్వు మేము చెప్పినట్లు చేయాలి ఎందుకంటే ఇది మా టైం
జగతి: ఇన్నాళ్లు మీ టైం కానీ ఇప్పుడు నా టైం. నేను ఏది చెప్తే అదే జరగాలి. డి బి ఎస్ టి కాలేజ్ ఎప్పటికీ మీ చేతుల్లోకి రాదు ఒకవేళ నన్ను చంపి కాలేజీని వశం చేసుకోవాలి అనుకుంటే అది కూడా జరగదు. సమయం వచ్చినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశానో మీకే చెప్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది
కాలు నొప్పితో బాధపడుతున్న ఏంజెల్ కి చపాతి చేయడంలో హెల్ప్ చేస్తాడు రిషి. వసు తనకి చపాతీలు చేయటాన్ని నేర్పించిన సంఘటన గుర్తు చేసుకుంటాడు. అది గమనించిన ఏంజెల్ ఎందుకు ఉన్నట్టుండి మూడీగా అయిపోతావు నీకు గతంలో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతుంది.
ఎపిసోడ్ ముగిసింది...