అన్వేషించండి

Guppedanta Manasu July 24th: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషిధార మీద అనుమానపడిన ఏంజెల్- రిషిని మట్టి కరిపించమని కొడుక్కి నూరిపోసిన దేవయాని

Guppedantha Manasu July 24th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి బతికే ఉన్నాడని తెలిసి మళ్లీ కుట్రకు తెరతీశాడు శైలేంద్ర

రిషిని భోజనానికి పిలవడానికి వసు, ఏంజెల్ వెళతారు. ఈరోజు వసు మనతో కలిసి భోజనం చేస్తుందని ఏంజెల్ చెప్పేసరికి రిషి తను రానని చెప్తాడు.

వసు: ఏంటి సర్ నెనున్నానని పారిపోతున్నారా?

రిషి: పారిపోవాల్సిన అవసరం నాకు లేదు

వసు: మరి అయితే దీన్ని ఏమంటారు? మనసు నావైపు తిరిగిపోతుందని భయపడుతున్నారా?

రిషి: నాకెందుకు భయం. తప్పు చేసిన వాడిలా తన ముందు నేనెందుకు తల దించుకుని కూర్చోవాలి. అయినా నేనెందుకు రూమ్ లో కూర్చుని తినాలి. తనకి భయపడి గదిలో ఉండిపోయానని అనుకుంటుందేమో తప్పు చేసిన వాడిలా ఎందుకు పారిపోవాలి?

Also Read: కృష్ణని ప్రేమగా మెచ్చుకున్న భవానీ- అమ్మా కొడుకుని మడతేట్టిసిన ముకుంద

ఏంజెల్: ఏంటి వసు మీరు ఎప్పుడు కళ్ళతోనే మాట్లాడుకుంటారా? మిమ్మల్ని చూస్తుంటే అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంది. మీకు పాఠాలు చెప్పడంతో పాటు మనసులో భావాలు కూడా పసిగడతారు. సర్లే నేను ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు నాకు నేనే ప్రశ్నలు వేసుకుని నేనే సమాధానాలు వెతుక్కోవాలి. సరే రిషి నీకు భోజనం గదికి తీసుకొస్తానులే

రిషి: అక్కర్లేదు నేను మీతో పాటు తింటాను

ఏంజెల్: మహేంద్ర సర్ చెప్పినట్టు వెన్నెల్లో కూర్చుని తింటే బాగుంటుంది కదా. చక్కగా టెర్రస్ పైన సెటప్ చేసి కూర్చుని తినేవాళ్ళం

రిషి: మనకి ఇష్టమైన వాళ్ళతో ఎక్కడ కూర్చుని తిన్నా బాగుంటుంది. కానీ ఇష్టం లేని వాళ్ళతో ఎక్కడ కూర్చున్నా తిన్నట్టు ఉండదు

వసు: సర్ నేను ఇంట్లో  నుంచి వెళ్లిపోదామని అనుకుంటున్నా

విశ్వనాథం: అంత సడెన్ గా ఎందుకు

వసు: ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం ఇబ్బందిగా ఉంటుంది

విశ్వం: మీ నాన్న ఏవో పనులు ఉన్నాయని చెప్పారు. ఆయన రాకుండా వెళ్ళడం ఎందుకు? మీ నాన్న వచ్చిన తర్వాత వెళ్ళవచ్చు అప్పటి వరకు ఇక్కడే ఉండు

ఏంజెల్: మీరిద్దరూ ఎప్పుడూ ఒక్క మాట కూడ మాట్లాడుకోరు ఏంటి? మీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే లవ్ లో కూడా పడిపోయే వారు అనేసరికి రిషిధార మోహ మొహాలు చూసుకుంటారు. తనకి యాక్సిడెంట్ అయితే నువ్వే సేవ్ చేశావు. ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుంటున్నారు. రిషి నువ్వు కొంచెం మనుషుల్లో కలిసి పోవాలి. వసు నువ్వే ఆ పని చెయ్యి. కావాలంటే నేనే టైమ్ ప్రకారం తీసుకొచ్చి రిషిని నీ ముందు కూర్చోబెడతాను. రిషికి మనుషుల్లో ఎలా ఉండాలో నేర్పించు వసుధార.  

ఆ మాటలకి రిషి భోజనం చేయకుండా అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత ఏంజెల్ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడే వసు మెసేజ్ చేస్తుంది. మన గతం తెలియనక్కర్లేదు. మన మధ్య ఏదో ఉందని అనుమానం రానక్కర్లేదు. మామూలుగా ఉండటానికి ట్రై చేయండి అది నాకంటే మీకంటే మంచిదని మెసేజ్ పంపిస్తుంది. అది రిషి చూసి రిప్లై ఇవ్వకుండా ఉంటాడు. కాసేపు ఇద్దరూ మనసులతో మాట్లాడుకుంటారు.

Also Read: నిజానికి చేరువలో రిషి -ఆవేదనలో వసు, మహేంద్ర ముందు ఓపెన్ అయిపోయిన శైలేంద్ర!

శైలేంద్ర- దేవయాని: మహేంద్ర చేసిన పనికి శైలేంద్ర రగిలిపోతూ ఉంటాడు. జరిగింది తలుచుకుంటుంటే మైండ్ పని చేయడం లేదు. ఆవేశపడకు నాన్న నువ్వు కొప్పడితే ప్రయోజనం ఏముండదు. ఇంతకీ నువ్వు ఏం అడిగావు వాళ్ళకి ఎందుకు అంత కోపం వచ్చింది. రిషి ఎక్కడఉన్నాడో చెప్పమని అడిగాను. రిషిని మనమే బయటకి పంపించామని జగతి మహేంద్రకి చెప్పి ఉంటుందా? నాకు కూడా అదే అనిపిస్తుంది మమ్మీ.. బాబాయ్ కి చూచాయగా తెలిసినట్టుగా ఉంది. కానీ తెలిసిన విషయాలు బయట పెట్టడం లేదు చివరికి డాడీకి కూడా చెప్పడం లేదు. ఏం దాచారు? విష్ కాలేజ్ కి వెళ్ళినట్టు చెప్పలేదు అక్కడ రిషి, వసుధారని కలిశారు. అంటే వీళ్ళు ఇంకేదో ప్లాన్ చేశారు అందుకే అవన్నీ బయట పెట్టలేదు. అయినా డాడ్ ఏంటి నన్ను అంటారు. వాళ్ళ మీద మీ నాన్నకి ఉన్న నమ్మకం అది. రిషిని మట్టిలో కలిపేస్తే మనం అనుకున్నది జరుగుతుంది. ఎండీ సీటులో నువ్వే కూర్చుంటావ్. ఇంకెప్పుడు కూర్చునేది అందుకే బాబాయ్ ని కూడా మట్టిలో కలిపేస్తే సరిపోయేది నువ్వే వినలేదు. నువ్వు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. వాళ్ళని మీ డాడీ ముందు ఎలా ఇరికించాలో అది ఆలోచించు.

కాలేజ్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి జగతి బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేశారని, లిస్ట్ లో పేరు కూడా లేదని చెప్పేసరికి శైలేంద్ర రగిలిపోతాడు. ఇది నీ కాలేజ్ నిన్ను ఎవరూ పిలవాల్సిన పని లేదని వెళ్ళమని దేవయాని రెచ్చగొట్టి పంపిస్తుంది. వసు కాలేజ్ కి వెళ్దామని అనుకుంటే కారు ఏంజెల్ తీసుకెళ్లిందని విశ్వనాథం చెప్తాడు. అప్పుడే రిషి రావడంతో తనని కాలేజ్ కి తీసుకెళ్లమని చెప్తాడు. తనకి దారిలో పని ఉందని తప్పించుకోవడానికి చూస్తాడు. కానీ విశ్వం మాత్రం పర్లేదు పని చూసుకుని వసుని కూడా తీసుకెళ్లమని అంటాడు. దీంతో వసు సంతోషపడుతుంది.

వసు: నాదొక చిన్న రిక్వెస్ట్. నేను మీ దగ్గర పాఠాలు నేర్చుకున్నా నేను పాఠాలు ఎలా చెప్తానో మీరు క్లాస్ లో కూర్చుని వినాలి

రిషి: నెవర్ అది జరగదు

వసు: సరే అయితే నేను మీతో రాను ఆటో బుక్ చేసుకుని వెళ్లిపోతాను

రిషి: పొగరు.. సరే వింటాను కానీ పదే పది నిమిషాలు కూర్చుంటాను

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Embed widget