Gunde Ninda Gudi Gantalu June 26th Episode : బాలుని అవమానించేందుకు సర్వం సిద్ధం..మీనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతోందా - గుండె నిండా గుడి గంటలు జూన్ 26 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: శ్రుతి, రోహిణి తాళి మార్చే వేడుక కోసం హడావుడి చేస్తుంది ప్రభావతి. అంతా కలసి బాలుని టార్గెట్ చేస్తారు. గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 26 ఎపిసోడ్
శృతి, రోహిణికి తాళి మార్చే ఫంక్షన్ కి మౌనికను పిలిచేందుకు ఆమె అత్తవారింటికి వెళతారు సత్యం, ప్రభావతి. మౌనిక భర్త సంజూ, మావ ఇద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అవమానిస్తారు. లేచిపోయి పెళ్లిచేసుకున్న ఆ అమ్మాయికా తాళి మార్చే ఫంక్షన్ అని అవమానంగా మాట్లాడుతారు. కనీసం ముందు కాల్ చేసి రండి అని అవమానకరంగా మాట్లాడుతాడు సంజయ్ తండ్రి. అన్నీ సైలెంట్ గా భరిస్తారు సత్యం, ప్రభావతి . ఇంతలో మౌనిక రావడంతో ఇంట్లో రెండు ఫంక్షన్లు పెట్టుకున్నాం మీరంతా రావాలని ఆహ్వానిస్తారు. నాతో ఏంగేజ్మెంట్ అయ్యాక క్యాన్సిల్ చేసుకున్న ఆమెకేనా అని దెప్పిపొడుస్తాడు సంజయ్. భర్త, మావ ప్రవర్తన చూసి మౌనిక మేం ఫంక్షన్ కి రావడం లేదని చెప్పేస్తుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావని అడుగుతారు సత్యం, ప్రభానవతి. నేను రాకపోతే ఫంక్షన్ ఆగిపోతుందా ఏంటి అని పంపించేస్తుంది. మౌనిక పూర్తిగా మారిపోయిందని, అప్పటిలా మాట్లాడడం లేదని ఫైర్ అవుతుంది ప్రభావతి. సత్యం కూల్ చేస్తాడు
తల్లిదండ్రులతో కఠినంగా మాట్లాడినందుకు మౌనిక బాధపడుతుంది. తన పుట్టింట్లో ఫంక్షన్ కి వెళ్లలేకపోతున్నానని ఏడుస్తుంది. ఇంతలో సంజయ్ వచ్చి మరింత బాధపెడతాడు. మీ అమ్మా నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడి ఈ ఇంటిపై ప్రేమను ఒలకబోస్తున్నావా అని సూటిపోటి మాటలంటాడు. మీకు నచ్చని పని నేను చేయను, మీకు నచ్చదు కాబట్టే రాను అని చెప్పానంటుంది మౌనిక. శ్రుతివల్ల మీకు అవమానం జరిగింది కాబట్టే నేను వెళ్లాలని అనకోవడం లేదంటుంది మౌనిక. మా ఇంటిపై ఎందుకింత ప్రేమ అని వెటకారంగా అడుగుతాడు సంజయ్. నా మెడలో తాళి కట్టినప్పుడే ఇది నా ఇల్లు అయింది అంటుంది మౌనిక. మరింత ఊగిపోయిన సంజయ్..మౌనిక గొంతు పట్టుకుంటాడు. ఇంతలో తల్లి వచ్చి ఆపుతుంది.
మళ్లీ మీనా కోసం పూలు, హల్వా తీసుకొస్తాడు బాలు. మీనా రావడంతో ఇంట్లో నరమానవులు అంతా నిద్రావస్థలో ఉన్నారు.. ఏం తెచ్చానో చెప్పుకో అంటాడు. ఏం తెస్తే ఏం లాభం అంటుంది. ఏం తెచ్చానో చెప్పుకోండి అంటే పూలమ్ముకునేదాన్ని గుర్తుపట్టలేనా మల్లెపూలు అంటుంది. బుద్ధిపోనిచ్చుకోలేదంటాడు బాలు. ఆ పూలు మన షాపులోనే కొనాల్సింది కదా అంటుంది. నీ దగ్గరే పూలు కొని నీకు సర్ ప్రైజ్ ఇమ్మంటావా అంటాడు. ఇంతలో హాల్లోకి వచ్చిన ప్రభావతి, రోహిణి, శ్రుతి వచ్చి ఫంక్షన్లో కట్టుకోవాల్సిన చీరలపై చర్చపెడతారు. మీనాను అవమానిస్తుంది ప్రభావతి. శ్రుతి కల్పించుకుని..నా దగ్గర చీరలున్నాయి నువ్వు కట్టుకో అంటుంది. కట్టుకున్నవాడు కాకుండా ఎవరు ఇచ్చిన చీర కట్టుకున్నా సంతృప్తి ఉండదు అంటుంది మీనా. ఇంతలో బాలు అవస్థ గమనించిన శ్రుతి.. ఎవరూ రారులే మేం వెళుతున్నాం అని ఏడిపించి వెళ్లిపోతుంది
అంతా రెడీ అయి వస్తారు..శ్రుతి, రోహిణిని చూసి మురిసిపోతుంది ప్రభావతి. కార్లు వచ్చాయా అని అడిగితే అంతా బాలు చూసుకుంటున్నాడు అంటాడు రవి. వాడిని నమ్ముకుంటే పని అయినట్టే అని అవమానిస్తుంది ప్రభావతి. ఆయన్ను నమ్ముకుంటే ఎవరూ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటుంది మీనా. మొగుడుని ఓ మాట అంటే పడవు అని ఫైర్ అవుతుంది. ఇంతలో బాలు చీర కొని తీసుకొస్తాడు. మళ్లీ మీనా-బాలుని అవమానిస్తుంది. అంతా కలసి తాళి మార్చే ఫంక్షన్ కి బయలుదేరుతారు.
ఫంక్షన్ హాల్ దగ్గర శ్రుతి తల్లి తండ్రి అందర్నీ ఆహ్వానిస్తారు. సత్యం ఫ్యామిలీ జన్మలో తలెత్తుకోకుండా చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ దెబ్బతో శ్రుతికి అత్తగారింటికి వెళ్లాలంటేనే అసహ్యం పుట్టాలి. శ్రుతి కోసం రవి ఇల్లరికం రావాలి. ఈ రోజు జరగబోయేది ఇదే అంటుంది శోభ. ఇంతలో కార్లోంచి దిగిన ప్రభావతి హడావుడి చేస్తుంది. అందర్నీ ఆహ్వానిస్తారు. బాలు కూడా మర్యాదపూర్వకంగా నమస్కరిస్తాడు. బాలుని అవమానించేందుకు సర్వం సిద్ధమైంది అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది శ్రుతి తల్లి శోభ. మరోవైపు తన తండ్రి ప్రస్తావన రాకుండా ఉండాలంటే బాలుని బుక్ చేసి ఏదైనా గొడవ చేయించాలని ప్లాన్ చేస్తుంది రోహిణి.






















