Amulya Gowda: గుండె నిండా గుడిగంటలు మీనా (అమూల్య గౌడ) కెరీర్, రెమ్యునరేషన్, లవ్ లైఫ్.. టాప్ సీక్రెట్స్!
Gunde Ninda Gudi Gantalu Meena: గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో మీనాగా నటిస్తోంది అమూల్య గౌడ. సీరియల్ లో అత్యంత పద్ధతిగా కనిపించే ఈ కన్నడ బ్యూటీ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంటుంది.

Gunde Ninda Gudi Gantalu Amulya Gowda: గుండె నిండా గుడి గంటలు..ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 సీరియల్స్ లో ఇదొకటి. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సీరియల్ లో బాలు భార్య మీనాగా నటిస్తోంది అమూల్య గౌడ. అందం, నటనతో తక్కువ టైమ్ లో తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పూలమ్మే పిల్లగా , పేదింటి కూతురిగా, మధ్యతరగతి కుటుంబానికి కోడలిగా మీనా నటనకు ఫుల్ మార్క్స్.
గుండెనిండా గుడిగంటలు సీరియల్ కన్నా ముందు మీనా తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు కార్తీకదీపంతో పరిచయం అయింది. కార్తీకదీపం సీరియల్ లో దీప-కార్తీక్ పిల్లలైన శౌర్య, హిమల్లో పెద్దైన శౌర్యగా నటించింది అమూల్య గౌడ. సీరియల్ లో ఆటో డ్రైవర్ గా ఎంట్రీ ఇచ్చిన అమూల్య గౌడ రౌడీబేబీగా ఆకట్టుకుంది.

మైసూర్ కి చెందిన అమూల్య గౌడ పదేళ్ల క్రితం కన్నడ సీరియల్ స్వాతిముత్తుతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటించిన కమలి సీరియల్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత పునర్ వివాహ, ఆరామనే సీరియల్స్ చేసింది. అందం, నటనంతో కన్నడ స్మాల్ స్క్రీన్ పై మంచి ఫాలోవర్స్ ని ఏర్పరుచుకుంది. సేమ్ క్రేజ్ తెలుగులోనూ తెచ్చుకోవాలనే ఆలోచనతో ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో వచ్చిన ఆఫరే కార్తీకదీపంలో శౌర్య పాత్ర

గుండెనిండా గుడిగంటలు సీరియల్ ప్రారంభానికి ముందు కన్నడ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది అమూల్య గౌడ. హౌజ్ లో ఆట, టాస్కుల కన్నా గ్లామర్ తో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలోనూ అమూల్య గౌడ షేర్ చేసే ఫొటోస్ చూస్తే మతి పోతుంది. పురివిప్పిన నెమలిలా చినుకుల్లో ఆడుతూ, విహారయాత్రల్లో సందడి చేస్తూ, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ, పొద్దునే కాఫీ తాగుతూ, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఇలా డిఫరెంట్ ఫోటొస్ అభిమానులతో షేర్ చేసుకుంటుంటుంది. ఇన్ ష్టాగ్రామ్ లో అమూల్య షేర్ చేసిన ఫొటోస్ చూస్తే సీరియల్ లో పద్ధతిగా కనిపించే మీనాయేనా ఈమె అనేలా ఉంటాయ్ .

ఇక గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో మీనా పాత్రకోసం అమూల్య గౌడ వారానికి రెండున్నర లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అంటే నెలకు అమూల్య ఆదాయం 10 లక్షలన్నమాట. మొత్తానికి కార్తీకదీపంలో శౌర్యగా మెప్పించి గుండెనిండా గుడిగంటలులో మీనాగా ఆకట్టుకుంటున్న అమూల్య గౌడ ఫ్యూచర్లో మరిన్ని తెలుగు సీరియల్స్ లో మెరవడం ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు

ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎన్నెన్నో జన్మలబంధం, సత్యభామ సీరియల్ హీరో గుర్తున్నాడా...తన అసలు పేరు నిరంజన్. అమూల్య గౌడ నిరంజన్ తో కలసి నటించిన సీరియల్ కమల. ఈ సీరియల్ టైమ్ లో ఏర్పడిన స్నేహం రియల్ లైఫ్ లోనూ కొనసాగుతోంది. స్మాల్ స్క్రీన్ పై బెస్ట్ రొమాంటిక్ జోడీగా అవార్డులు కూడా అందుకున్నారు. ఇద్దరూ కలసి దిగిన ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తుంటారు.






















