Gruhalakshmi September 28th: ఒక్కటైన దివ్య, విక్రమ్- తులసి సేవలో నందు, హనీపై రత్నప్రభ పైశాచికత్వం!
దివ్య, విక్రమ్ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Gruhalakshmi Serial September 28th : దివ్య విక్రమ్ ప్రేమని అర్థం చేసుకుంటుంది. విక్రమ్ దగ్గరకి వచ్చి తనతో ప్రేమగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది.
విక్రమ్: నువ్వు నా మనసులో ఉన్నావ్ కానీ తెలుసుకోలేకపోయాను
దివ్య: తెలుసుకోలేకపోవడం కాదు ఉక్రోషం కమ్మేసింది. ఇంకెప్పుడు నీకు దూరం కాను. ఆవేశంలో చేసిన చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష అనుభవించాను. నువ్వంటే నిర్లక్ష్యంతో వదిలేసి పుట్టింటికి వెళ్లలేదు. నేను ప్రాణంగా ప్రేమించే విక్రమ్ అర్థం చేసుకోలేదని వెళ్ళాను. వెంటనే విషయం అర్థం చేసుకుని నీకోసం తిరిగి వచ్చేశాననని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఐలవ్యూ విక్రమ్. ఇది నిజంగా నా గుండెల్లో నుంచి వచ్చి మాట
విక్రమ్: ఇక చాలు గతాన్ని తవ్వుకోవద్దు
రేపు వినాయకచవితి మన మధ్య దూరం తగ్గించిన దేవుడికి పూజలు చేసుకుందామని అనుకుంటారు. బండి మీద నుంచి కిందపడేసరికి తులసికి దెబ్బలు తగులుతాయి. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఎవరి సపోర్ట్ తీసుకుని బెడ్ దిగాలి. ఇంట్లో పనులు చేయకూడదని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదంతా నందు వల్లే జరిగిందని అనసూయ వాళ్ళు తిడతారు. అప్పుడే దివ్య ఫోన్ చేస్తుంది. తనకి దెబ్బ తగిలిన విషయం చెప్పొద్దని తులసి అంటుంది. పండుగ ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలని తులసి అనేసరికి అసలు రానని దివ్య చెప్తుంది.
Also Read: మురారీతో తింగరిపిల్ల రొమాంటిక్ మూమెంట్ - కృష్ణతో ముకుంద సవాల్!
బసవయ్య, జాహ్నవి చెస్ ఆడుకుంటూ ఉంటారు. ఈ ఇంటికి పట్టిన శని వదిలించడానికి పిలిచానని రాజ్యలక్ష్మి అంటుంది. అప్పుడే విక్రమ్ వచ్చి స్థలం తాలూకూ డాక్యుమెంట్స్ ఇవ్వబోతాడు. అవి తనకి కాదని ఇంటి మహాలక్ష్మి దివ్య చేతిలో పెట్టమని చెప్తుంది. ఆ మాటకి జాహ్నవి షాక్ అవుతుంది. అవి దివ్య చేతికి ఇవ్వమని చెప్పేసరికి విక్రమ్ వాటిని తనకి ఇస్తాడు. వాటిని తీసుకుని జాగ్రత్తగా దాచి పెట్టమని అంటుంది. దీని వెనుక ఏదో ప్లాన్ వేసిందని అర్థం అవుతుంది. వినాయక చవితి రోజు దేవుడి ముందు పూజలో పెట్టమని చెప్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత రాజ్యలక్ష్మి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని ఏదో తేడాగా ఉందని అనుకుంటుంది.
జానూ: ఆ డాక్యుమెంట్స్ బావతో నాకు ఇప్పించాల్సి ఉంది
రాజ్యలక్ష్మి: ప్రస్తుతానికి అవి దివ్య చేతికి వెళ్ళాయి. కానీ చివరికి అవి నీ చేతికి వస్తాయి చూస్తూ ఉండు
తులసి మంచం మీద నుంచి లేవలేక బాటిల్ తీసుకోబోయి కింద పడేస్తుంది. వెంటనే చూసిన నందు వచ్చి తనకి అందిస్తాడు. రికవర్ అయ్యేంత వరకు సేవలు చేసుకొనివ్వమని నందు అడుగుతాడు. ఇక తులసి పూజకి కావాల్సిన వస్తువులన్నీ చెప్పి తీసుకురమ్మని అంటుంది.
Also Read: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా
హనీ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. తులసి ఆంటీ గురించి ఆలోచించి తనని ఇబ్బంది పెట్టనని చెప్తుంది. హనీ అన్నం తింటుంటే తన ముందు ఉన్న ప్లేట్ లాగేసి పచ్చి కూరగాయ ముక్కలు పెడుతుంది.
రత్నప్రభ: ఇక నుంచి హనీ ఇవే తినాలి
పెద్దాయన: నీ ప్రతాపం ఏదైనా ఉంటే నా మీద చూపించి చిన్న పిల్ల మీద కాదు. దాని ఆస్తి మీద పెత్తనం చెలాయిస్తూ దాన్నే పస్తులు ఉంచుతావా?
రత్నప్రభ: చాలా పెద్ద మాటలు వస్తున్నాయి. నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా జరుగుతుంది
హనీ: నాకు పచ్చి కూరగాయలు తినడం చాలా ఇష్టం తాతయ్య వాటిని తింటాను
రత్నప్రభ: చిన్న పిల్ల బాగా అర్థం చేసుకుంది
Also Read: కనకమా మజాకా, స్వప్న సేఫ్- అమ్మాకొడుక్కి అదిరిపోయే షాక్!
తులసి మంచం దిగడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ నందు ఫుడ్ పట్టుకుని వస్తాడు.ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తులసి భోజనం చేస్తూ ఉండగా ఆగిపోయి హనీ గుర్తుకు వచ్చిందని బాధపడుతుంది. తన గురించి చూసుకోవడానికి ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారని అంటాడు.