జ్ఞాన విజ్ఞానాలతో విచక్షణతో తృప్తిచెందిన యోగులు, ఇంద్రియాలను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వీరి దృష్టిలో మట్టి, రాళ్ళు, బంగారం అన్నీ ఒకటే
జ్ఞానం అంటే గురువు గారి దగ్గర వినడం - శాస్త్ర గ్రంధాల పఠనం ద్వారా సిద్ధాంతపరంగా తెలుసుకున్న విషయం
విజ్ఞానం అంటే అంతర్గతంగా అనుభవవేద్యమైన జ్ఞానం. ఇది అంతర్గంతంగా ఉంటుంది
ఉన్నతంగా ఆలోచించేవారి బుద్ధి ఈ జ్ఞానం, విజ్ఞానం రెండింటితో ప్రకాశితమవుతుంది
ఈ వివేకము కలిగిన యోగి..అన్ని భౌతిక వస్తువులను ఒకేలా చూస్తాడు. వేటి ఆకర్షణకు లోనుకాడు. అన్ని వస్తువులను భగవత్ సంబంధంగానే పరిగణిస్తాడు
కూటస్థ అంటే చంచలమైన ఇంద్రియ అనుభూతుల నుంచి మనస్సుని దూరంగా ఉంచి అనుకూల పరిస్థితుల కోసం చూసుకోకుండా లేదా ప్రతికూల పరిస్థితులను తప్పించుకోకుండా ఉండే వాడని అర్థం
విజితేంద్రియ అంటే ఇంద్రియములను నిగ్రహించిన వాడు
యుక్త అంటే పరమాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండేవాడు
అంతర్గతంగా అనుభవంలోనికి వచ్చిన విజ్ఞానంతో సంపూర్ణంగా తృప్తి పొందేవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు