Gruhalakshmi September 23rd: మీ వేలు పట్టి నేను నడిపిస్తానని తులసికి ధైర్యం చెప్పిన సామ్రాట్ - అవమానించిన అభి, లాస్య
తులసిని తన కంపెనీ మేనేజర్ గా అపాయిట్ చేస్తాడు సామ్రాట్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సామ్రాట్ కి లాస్య బిస్కెట్స్ వేస్తూ ఉంటుంది. మీ ఇంటి దగ్గరే ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్తుంది. మీ ఐడియా బాగుంది కానీ ఆఫీసుకి దూరం అవుతుందేమో అని సామ్రాట్ అంటే మీ సంతోషమే మాకు ముఖ్యం అని లాస్య అంటుంది. ఇక సామ్రాట్ దగ్గర పని చేసే రావ్ పక్కకి వెళ్ళి ప్రకాష్ అనే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తులసికి కూడా ఫోన్ వస్తుంది.. అది మాట్లాడటానికి బయటికి వస్తుంది. నేను ఇప్పుడు సామ్రాట్ గారి దగ్గరే ఉన్నాను కొటేషన్ ఒప్పించి ఆర్డర్ వచ్చేలా ప్లాన్ చేశాను. ఆయనకి నేనంటే గుడ్డి నమ్మకం ఆయన ఆస్తి నా పేరు మీద రాయించుకుని పేపర్ ఇచ్చి సైన్ చేయమంటే కళ్ళు మూసుకుని సైన్ చేస్తాడు పిచ్చోడు, మీరేం టెన్షన్ పడకండి ఈ ఆర్డర్ మీదే పని అయినక ఫోన్ చేస్తాను అని రావ్ ఫోన్లో మాట్లాడటం తులసి వింటుంది.
వెనక్కి తిరిగేసరికి తులసి ఉంటుంది. వినేశారా పర్లేదులే విన్నది అంతా మార్చిపొండి, నిన్న కాక మొన్న వచ్చావ్ నా విషయంలో జోక్యం చేసుకోకు. నీ మ్యూజిక్ స్కూల్ సంగతి చూసుకో నా జోలికి రావద్దు. ఎంత మంచిగా ఉంటానో అంత కిరాతకంగా ఉంటాను’ అని తులసిని బెదిరిస్తాడు. కావాలంటే చెప్పు నాకు వచ్చే వాటాలో పదో పరకో పడేస్తాను.. కాదు కూడదని సామ్రాట్ గారికి చెప్పావో తర్వాత నువ్వు ఉండవ్ నా నెట్ వర్క్ నీకు తెలియదు అని బెదిరిస్తాడు. లోపలికి వచ్చి సామ్రాట్ ముందు మళ్ళీ వినయంగా ఉంటాడు. సైన్ చేశాను ఫైల్ తీసుకుని వెళ్ళండి అని సామ్రాట్ దాన్ని రావ్ కి ఇస్తుంటే తులసి వచ్చి దాన్ని లాక్కుంటుంది. ఏమైంది తులసి గారు ఫైల్ మీరు తీసుకున్నారు అది మ్యూజిక్ స్కూల్ కి సంబంధించినది కాదు మేనేజర్ గారికి ఇవ్వండి అని సామ్రాట్ చెప్తాడు.
Also Read: షాక్! తల్లిని చంపేసిన మాధవ్-రాధని పెళ్లి చేసుకోవడానికి దారుణం
ఇవ్వండి మేడమ్ అని మేనేజర్ కంగారు పడతాడు. ఎవరైనా మీ ఉప్పు తిని మీకే ద్రోహం చేస్తున్నారని తెలిస్తే ఏం చేస్తారు అని తులసి అడిగితే నరికి పారేస్తా అని సామ్రాట్ కోపంగా చెప్తాడు. మేనేజర్ ఫోన్ తీసుకుని అందులోని వాయిస్ రికార్డ్ వినిపిస్తుంది. అది విని సామ్రాట్ షాక్ అవుతాడు. ఆగ్రహంతో ఊగిపోతూ రావ్ మీద చెయ్యి చేసుకుంటాడు. క్షమించండి సార్ అని వాడు సామ్రాట్ ని బతిమలాడతాడు. కానీ సామ్రాట్ మాత్రం ఎవరినైనా క్షమిస్తాను కానీ నమ్మకద్రోహం చేస్తే అసలు ఒప్పుకోను అని కోపంతో రగిలిపోతాడు. తప్పు అయ్యింది వదిలేయమని చెప్పండి అని మేనేజర్ తులసిని బతిమలాడుకుంటాడు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే ఫలితం అనుభవిస్తారు అని తులసి చెప్తుంది. తులసిగారు చెప్పారు కాబట్టి వదిలేస్తున్న ఇంకోసారి నాకు కనిపించకు అని అరుస్తాడు.
సామ్రాట్ తులసికి థాంక్స్ చెప్తాడు. మేనేజర్ లేకపోతే మన వర్క్స్ అన్నీ సఫర్ అవుతాయి. ఇన్ని రోజులు మన వర్క్స్ చూసుకున్నాడు మీ తరఫున నిర్ణయాలు తీసుకునే వాడు ఇప్పటికిప్పుడు ఆ ప్లేస్ లో నమ్మకం దొరికే వ్యక్తి కష్టం కదా అని నందు అంటాడు. అర్హత ఉన్న వ్యక్తి మన ముందే ఉంటాడు చూసుకుంటే సరిపోతుంది కదా అని లాస్య అంటుంది. ఈ టైమ్ లో నందు కరెక్ట్ అని ఆ పోస్ట్ కి సామ్రాట్ సెలెక్ట్ చెయ్యాలి అని లాస్య మనసులో అనుకుంటుంది. నిర్ణయం తీసుకోవడానికి తొందరపడకురా అని సామ్రాట్ బాబాయ్ అంటాడు. మీ డెసిషన్ ఏంటో చెప్పండి అని లాస్య అంటే నాతో రండి ఎనౌన్స్ చేస్తాను అని చెప్తాడు.
Also Read: యష్, వేద రొమాంటిక్ డాన్స్- నిశ్చితార్థం చేసుకోనన్న వసంత్- మాళవిక, అభికి ఘోర అవమానం
తులసి కుటుంబం దగ్గరకి సామ్రాట్ వాళ్ళు వెళతారు. మీకు ఒక గుడ్ న్యూస్ చెబుతాను అని సామ్రాట్ వాళ్ళతో అంటాడు. మన కొత్త మేనేజర్ గా తులసిగారిని అపాయింట్ చేస్తున్నా అని సామ్రాట్ చెప్పేసరికి లాస్య, నందు ముఖాలు మాడిపోతాయి. అందరూ సంతోషిస్తారు. ఆయన ఏదో సరదాగా చెప్తుంటే మీరేంటి అని తులసి అంటుంది. గడ్డి పోచని కావాలని ఎవరైనా సింహాసనం మీద కూర్చోబెడతారా అని తులసి అంటే నిజం మాట్లాడవ్ తులసి హ్యాట్సాప్ అని లాస్య అంటుంది. కానీ దానికి మాత్రం సామ్రాట్ ఒప్పుకోడు. అపాయింట్ మెంట్ ఆర్డర్ రెడీ చెయ్యమని చెప్తాడు. నాకు అర్హత లేదని తులసి అంటే నేను మొత్తుకునేది అదే కదా మామ్ కనీసం క్లర్క్ గా కూడా పనికిరాని నిన్ను జనరల్ మేనేజర్ గా ఎందుకు కూర్చోబెడుతున్నారో అడుగు అని అభి కూడా అవమానించేలా మాట్లాడతాడు.
చదువు, అర్హత ఉన్న నందగోపాల్ మీద మీకు నమ్మకం లేదా అని అభి అడుగుతాడు. మా డాడ్ కంటే ఎక్కువగా మామ్ కి అవకాశం ఇస్తున్నారు అని అంటాడు. ఏదైనా సాధించాలి అనుకోవాలి ఆ రోజు వైజాగ్ లో ఎవరు లేకపోయినా ప్రాజెక్ట్ ఎక్స్ ప్లేన్ చేశారు ఏమైంది అని అడుగుతాడు. మీ వేలు పట్టుకుని నడిపించడానికి నేను ఉన్నాను ఇంతకన్నా ఏమి కావాలి. నందు గురించి నాకు ఎక్కువ తెలియలేదు, తెలిసిన విషయాలు కూడా నాకు సంతృప్తిగా అనిపించలేదు. అందుకే మిమ్మల్ని తీసుకున్నా కష్టం అనిపించిన రోజు నాకు చెప్పండి నేను చూసుకుంటాను అని సామ్రాట్ చెప్తాడు. తను మీ ఆఫర్ ఒప్పుకున్నట్టే అని తులసి ఫ్యామిలీ మొత్తం చెప్తుంది. అందరూ కలిసి తులసిని ఒప్పిస్తారు. తులసి కింద నేను పని చేయలేను ఉద్యోగానికి రిజైన్ చేస్తాను అని నందు లాస్యతో అంటాడు. తప్పదు తులసి కింద గులాం గిరి చేయాలిసిందే అని లాస్య చిరాకుగా అంటుంది.
తరువాయి భాగంలో..
సామ్రాట్, తులసితో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాడు. మీ ఇద్దరి గురించి బయట చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అనుకుంటున్నారు అని మీడియా వాళ్ళు అడుగుతారు. మీ భార్య గురించి ఎప్పుడు చెప్పలేదు తను ఎక్కడ ఉంటున్నారు విడాకులు ఇచ్చారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు.