Devatha September 23rd Update: షాక్! తల్లిని చంపేసిన మాధవ్-రాధని పెళ్లి చేసుకోవడానికి దారుణం
రాధని ఎలాగైనా సొంతం చేసుకోవాలని మాధవ్ అడ్డు వచ్చిన తల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఎందుకమ్మా ఇన్ని రోజులు అన్నీ బాధలు భరించావ్ మా కోసమా వద్దమ్మా ఇక చాలు. తెలిసో తెలియకో ఆయన నేను నీతో ఇబ్బందిగా ప్రవర్తించి ఉంటే మమ్మల్ని క్షమించమ్మా అని జానకి రాధని అడుగుతుంది. నీ పట్ల మాధవ్ ప్రవర్తించిన తీరుకి సిగ్గు పడుతున్నా.. మా గురించి నువ్వు ఆలోచించొద్దు చివరకి చిన్మయి గురించి కూడా వద్దు చిన్న పిల్ల దాన్ని నేను చూసుకుంటాను. రేపు ఉదయాన్నే చీకటితో వెళ్లిపో నీకు ఎవరు అడ్డు రాకుండా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. దేవిని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట ఆనందంగా ఉండు’ అని అంటుంది. మీరు చెప్పినట్టే పోతా గాని ఈ నగలు నాకు వద్దని రాధ చెప్తుంది. చేతిలో డబ్బు లేకుండా ఎలా అని జానకి అడుగుతుంది. తల్లి లెక్క ఇన్నాళ్ళూ చూశారు మీ బిడ్డ కంటే నా గురించే ఆలోచించారు అది చాలు కష్టం తెలిసిన దాన్ని నా బిడ్డ కోసం సంపాదించుకోగలను అని రాధ చెప్తుంది.
దేవి నా కొడుకే కన్న తండ్రి అనుకుంటుంది మరి తనకి ఏం చెప్తావో అర్థం కావడం లేదని జానకి అంటుంది. ఆ బాధ లేదు నేను మీ నాయన కాదు అని దేవమ్మకి మాధవ్ సారె చెప్పాడు అని రాధ జరిగింది అంతా చెప్తుంది. ఇప్పుడు నా బిడ్డకి మీ కొడుకే దారి చూపించాడు. మీ కొడుకు దారి తప్పాడు అని తెలిసి నాకు అండగా నిలిచారు. రేపు పొద్దునే ఇల్లు విడిచి వెళ్లిపోతాను. చిన్మయిని, పెద్ద పటేల్ ని మంచిగా చూసుకోండి’ అని రాధ ఎమోషనల్ గా చెప్తుంది. ‘నా బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు సరిదిద్దడానికి నేను తప్పు చేసిన తప్పు లేదు వాడు ఇంతగా మారిపోయినా రాధ ఇక్కడ ఉండటం క్షేమం కాదు. అందుకే వాడి కంట పడకుండా రాధ, దేవిని ఇక్కడి నుంచి తప్పిస్తే చాలు. రాధ ఆఫీసర్ భార్య అని తెలిసి కూడా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో చేయబోతున్నాడు. మా కోసం ఇంట కష్టపడిన రాధని గౌరవంగా ఇల్లు దాటించాలి’ అని జానకి పాలల్లో ఏవో మాత్రలు కలిపి మాధవ్ కి ఇస్తుంది.
Also Read: యష్, వేద రొమాంటిక్ డాన్స్- నిశ్చితార్థం చేసుకోనన్న వసంత్- మాళవిక, అభికి ఘోర అవమానం
నువ్వు తీసుకొచ్చావ్ ఏంటి అని మాధవ్ అడుగుతాడు. నా బిడ్డ కోసం తీసుకొచ్చాను తప్పేంటి అని అడుగుతుంది. తాగి ప్రశాంతంగా పడుకో అని జానకి అనేసరికి మాధవ్ డౌట్ గా చూస్తాడు. అక్కడ పెట్టు తర్వాత తాగుతాలే అని అంటాడు. మాధవ్ మాత్రం ఆ పాలు తాగకుండా ఉంటాడు. ఏంటమ్మా నా కోసం ప్రేమగా ఇందులో నిద్ర మాత్రలు కలిపి తీసుకొచ్చావా, నా మీద నీకు అనుమానం వచ్చిందని నాకు తెలుసు. ఇలాంటి పని ఏదో చేస్తావ్ అని నాకు తెలుసు నీ కొడుకు మరి అంత అమాయకుడి అనుకుంటున్నావా. రాధని ఎలాగైనా శ్రీశైలం తీసుకెళ్తాను తాళి కడతాను ఎవడు అడ్డు వస్తాడో చూస్తాను అని మాధవ్ అనుకుంటాడు.
పాలు తాగి ఉంటాడు నిద్రపోతున్నాడో లేదో ఒకసారి చూసి దేవిని రాధని ఇంట్లో నుంచి పంపించేయాలి అని జానకి అనుకుంటుంది. గదిలోకి వెళ్ళి చూసేసరికి మాధవ్ పాలు తాగలేదని చూస్తుంది. రాధ బట్టలు సర్దుతూ ఉంటుంది. జానకి మాధవ్ బట్టలు తీసి కబోర్డ్ లో పెడుతుంటే తాళిబొట్టు, లగ్నపత్రిక కిందపడుతుంది. అది చూసి జానకి షాక్ అవుతుంది. మాధవ్ బయటకి వచ్చి తల్లిని చూసి కంగారు పడతాడు. ఏంటమ్మా ఇలా వచ్చావ్ అని అడుగుతాడు. ఏం చేశావ్ రా ఏమి తెలియని అమాయకుడిలా కనిపించే నీలో ఇంకో మనిషి కూడా ఉన్నాడా అని జానకి అడుగుతుంది. ఉన్నట్టుండి శ్రీశైలం ప్రయాణం ఎందుకని అడుగుతుంది. చెప్పాను కదా నాగదోషం పూజ నివారణ అని అంటాడు. నోరు ముయ్ అని జానకి కోపంగా అరిచి తాళిబొట్టు చూపించి ఏంటి ఇది అని అడుగుతుంది. బలవంతంగా రాధ మెడలో తాళి కడదామనా అని అడుగుతుంది. నా ఆలోచన నేను చెప్పకుండానే అర్థం అయ్యింది కదా అందరి ముందు దీని గురించి పంచాయతీ పెట్టకు అని తల్లికి వార్నింగ్ ఇస్తాడు.
Also Read: రుక్మిణిని ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్న జానకి- రాధని పెళ్లి చేసుకోవడానికి మాధవ్ ఏర్పాట్లు
ఇది నా కల నాకు అడ్డు రావద్దు అని అంటాడు. ఇంకా నీ మాట వింటాను అని ఎలా అనుకుంటున్నావ్ అని జానకి అంటుంది. అమ్మా ప్లీజ్ వద్దు అలా చేయకు అని బతిమలాడతాడు కానీ జానకి మాధవ్ చెయ్యి విడిపించుకుని వెళ్లబోతుంటే ఇప్పుడు నాన్నకి తెలిస్తే అమ్మో అని తన వెనకాలే వెళతాడు. మెట్ల మీద జానకికి అడ్డు పడి నా గురించి ఆలోచించు నా మాట కూడా కాదని అడ్డు పడితే తల్లివి అని కూడా చూడను అని బెదిరిస్తాడు. చంపేస్తావా అని జానకి కోపంగా అరుస్తుంది. ఏవండీ అని జానకి అరుస్తుంటే మాధవ్ తన నోరు మూస్తాడు. తల్లిని మాధవ్ మెట్ల మీదకి తోసేస్తాడు.