News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Gruhalakshmi September 21st: లాస్య రీ ఎంట్రీ - సామ్రాట్ కంపెనీ సీఈఓగా తులసి బాధ్యతలు తీసుకుంటుందా!

Gruhalakshmi Serial September 21st Episode : రత్నప్రభ దంపతుల ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

Gruhalakshmi Serial September 21st Episode :నందు దగ్గరకి వచ్చిన పరంధామయ్య వాళ్ళు హనీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందని అడుగుతారు. నిర్లక్ష్యంగా ఉంటే తులసికి ప్రమాదం జరుగుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు తులసి మీద అనుమానపడుతున్నారు. ఆస్తి కోసం హనీకి దగ్గర అవుతుందని డిసైడ్ అయ్యారు. తనని ఆ ఇంటి వైపు రాకుండా చూసుకోమని బెదిరించారని చెప్తాడు. ఈ విషయం తులసికి చెప్పాలి కదా అంటే చెప్తే గొడవ పడి హనీని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు గొడవ మరీ పెద్దది అవుతుందని నందు అంటాడు. ఏదో ఒక కారణం చెప్పి ముందు తనని ఆ ఇంటికి వెళ్ళకుండా ఆపాలని అంటాడు. దివ్య ఒంటరిగా కూర్చుని విక్రమ్ జానూ మీద సీరియస్ అయి తన తలకి కట్టు కట్టిన విషయం తలుచుకుని మురిసిపోతుంది. భర్త మనసులో తానే ఉన్నానని సంతోషపడుతుంది. అప్పుడే విక్రమ్ వస్తే ముద్దులతో అభిషేకం చేసి రుణం తీర్చుకోవాలని అనుకుంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకోమని ఇస్తాడు.

విక్రమ్: నీలా మనసులో ఒకటి పెట్టుకుని మరొకటి చూపించడం నాకు రాదు

దివ్య: దెబ్బ తగిలినప్పుడు చూపించిన ప్రేమ నిజమే కదా

విక్రమ్: అనుమానమే లేదు. గతాన్ని తలుచుకుని పాఠాలు నేర్చుకున్నా

Also Read: తండ్రిని చూసి విలవిల్లాడిపోయిన కావ్య - దొంగల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన రాజ్!

దివ్య: నా మీద నీకు ప్రేమ ఉంది. నీకు తెలియకుండానే అది బయటకి వచ్చింది ఒప్పుకో

విక్రమ్: విలువ లేని చోట ప్రేమ ఉండి ఏం లాభం మర్చిపో

ఇద్దరూ కాసేపు ప్రేమ గురించి వాదించుకుంటారు. తన మీద మాత్రం నమ్మకం లేదని విక్రమ్ తెగేసి చెప్పేస్తాడు. సామ్రాట్ ఇంటికి మేనేజర్ వస్తాడు. ఏంటి పని అని అడుగుతాడు. రత్నప్రభ వచ్చి మేనేజర్ ని పిలిపించింది తనేనని అంటుంది.

రత్నప్రభ: ఈరోజు నుంచి ధనుంజయ్ కంపెనీ సీఈఓ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్డర్ రెడీ చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి

పెద్దాయన: అందుకు తొందర ఏముంది

ధనుంజయ్: మీ మనసులో ఏముందో చెప్పండి

రత్నప్రభ: ఒక కంపెనీ సీఈఓ లేకుండా ఎన్ని రోజులు ఉంటుంది. సామ్రాట్ ఏమైనా బతికి వస్తాడా? వెంటనే ఆర్డర్ రెడీ చేయండి. మీరు ఏ హక్కుతో ధనుంజయ్ సీఈఓ కాకుండా అడ్డుపడాలని అనుకుంటున్నారు. బుద్ధిగా మేం చెప్పినట్టు నడుచుకుంటే మీకు మాకు మంచిది. కాదు కూడదు అంటే కోర్టుకి వెళ్ళి లీగల్ గా ఆస్తి దక్కించుకుంటాం. హనీ అడ్డం లేకపోతే ఈ ఆస్తి మొత్తం మాకు వస్తుంది. ఇప్పుడు హనీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని బెదిరిస్తారు.

తులసి హనీ గురించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంది. హనీ విషయంలో ఇంకెప్పుడు నందు మాట విననని అంటుంది. ఒక్క పూట హనీకి ఫోన్ చేయకపోతే ఏమౌతుందని అనసూయ అంటుంది. కానీ తన మనసు మాత్రం హనీ చుట్టూనే ఉంటుందని తులసి చెప్తుంది. తండ్రి పోవడంతో హనీ ఒంటరిది అవ్వచ్చు కానీ చూసుకోవడానికి తన వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కువగా దిగులు పడాల్సిన పని లేదని అనసూయ తులసికి నచ్చజెప్పడానికి చూస్తుంది. కానీ తులసి మాత్రం హనీ పాట పాడుతూనే ఉంటుంది. కేఫ్ కి వెళ్తూ హనీకి టిఫిన్ ఇచ్చేసి వెళ్దామని అంటుంది. నందు వాళ్ళు ఎన్ని చెప్పిన కూడా తులసి మాత్రం వినిపించుకోదు. తులసికి నిజం చెప్పేయాల్సిందేనని  పరంధామయ్య అంటాడు. లాస్య తలనొప్పి వదిలిందని అనుకుంటే వీళ్ళు తగులుకున్నారు ఏంటా అని అనసూయ అంటుంది.

అప్పుడే చాలా రోజుల తర్వాత లాస్య కనిపిస్తుంది. చీకటి గదిలో కూర్చుని ఉంటే భాగ్య వస్తుంది.

Also Read: రసవత్తరంగా మారిన కథనం- ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్న కృష్ణ, ముకుంద

భాగ్య: నిన్ను మోసం చేసింది నీ చుట్టు ఉన్న పరిస్థితులు. దొరికిన దానితో సంతోషపడకుండా అతి ఆశకి పోయావ్. ఇప్పుడు మా ఇంట్లో తలదాచుకుంటున్నావ్

లాస్య: వెళ్లిపొమ్మని అంటావా?

భాగ్య: నువ్వు చేయాల్సిన యుద్దం నా మీద కాదు

లాస్య: త్వరలోనే తులసిని దెబ్బ కొడతాను

కాసేపు భాగ్య లాస్యని నాలుగు దెప్పిపొడుపు మాటలు మాట్లాడి వెళ్ళిపోతుంది. జానూ బ్యాగ్ సర్దుకుని వచ్చేసరికి రాజ్యలక్ష్మి కంగారుగా ఎక్కడకని అంటుంది. ఎందుకు వెళ్లడమని అంటుంది. తను వెళ్లిపోతుంటే విక్రమ్ అడ్డుపడతాడు. అప్పుడే దివ్య వస్తుంది.

జానూ: నన్ను ఏమైనా అనాల్సినవి మిగిలిపోయాయా? ఏమైనా ఉంటే అనేసేయ్.. నిన్న నువ్వు అన్న మాటలతో చచ్చిపోయింది

విక్రమ్: సోరి, ఆ క్షణంలో నువ్వు చేసింది తప్పని అనిపించింది అందుకే అరిచాను  

దివ్య: తప్పు చేశాడు కాబట్టి అరిచాడు అందులో తప్పేముంది

విక్రమ్: ఇది మా ఇద్దరి మధ్య వ్యవహారం

తరువాయి భాగంలో..

సామ్రాట్ బాబాయ్ తులసి దగ్గరకి వస్తుంటే తనని కలవనివ్వకుండా నందు పక్కకి తీసుకెళ్తాడు. ధనుంజయ్ సామ్రాట్ కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నాడని తులసికి చెప్పాలని అంటాడు. కానీ నందు మాత్రం ఈ విషయంలో తులసిని లాగొద్దని చెప్తాడు. ఆ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తులసి ప్రాణాలు తీస్తానని బెదిరించారని నందు నిజం చెప్పేస్తాడు. వాళ్ళ మాటలు తులసి వినేస్తుంది.

Published at : 21 Sep 2023 11:12 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial September 21st Update

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
×