అన్వేషించండి

Krishna Mukunda Murari September 21st: రసవత్తరంగా మారిన కథనం- ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్న కృష్ణ, ముకుంద

మురారీ మనసులో ముకుంద లేదని కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Krishna Mukunda Murari September 21st: ఇంట్లో అందరి ముందు కృష్ణ తనని ఆట పట్టించినందుకు మురారీ లాఠీ పట్టుకుని తన వెంట పడతాడు. అలా ఇద్దరూ కాసేపు సరదాగా గడుపుతారు. మీ ప్రేమ ఎప్పుడు చెప్తారు అప్పటి వరకు ప్రేమని దాచుకోలేకపోతున్నానని కృష్ణ అనుకుంటుంది. కృష్ణని ఇంట్లో నుంచి పంపించాలంటే ఇంకేం చేయాలో అర్థం కావడం లేదని, ఇంట్లో అందరూ వాళ్ళకే సపోర్ట్ గా ఉంటున్నారని ముకుంద మనసులో బాధపడుతుంది. అప్పుడే గదిలో నుంచి మురారీ వాళ్ళు వస్తారు. తనని ఎలాగైనా దారిలో పెట్టేందుకు ప్లాన్ వేశానని అనుకుంటుంది. మళ్ళీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తినేందుకు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.

కృష్ణ: నేనొక నిర్ణయం తీసుకున్నా. హాస్పిటల్ కి లాంగ్ లీవ్ పెట్టాను. పేదలకి ఉచిత సేవ చేసేందుకు హాస్పిటల్ కట్టిస్తున్నారు కదా అప్పటి వరకు ఇంట్లోనే ఉంది ఆదర్శ్ వచ్చేలోపు ముకుందకి అన్నీ దగ్గరుండి పనులు నేర్పిస్తాను.

ముకుంద: ఈ తింగరిది నన్ను అడ్డం పెట్టుకుని ఏం ప్లాన్ వేస్తుంది. తను ఏం ప్లాన్ చేసినా దాన్ని రివర్స్ చేసి ఇంట్లో నుంచి మా జీవితాల్లో నుంచి వెళ్లిపోయేలా చేస్తానని మనసులో అనుకుంటుంది

రేవతి: దానికి నువ్వు లాంగ్ లీవ్ తీసుకోవడం ఎందుకు నేను నేర్పిస్తాను. నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు

ALso Read: రిషి కోసం రూమ్ సిద్ధం చేసిన వసు, కొత్త డ్రామా స్టార్ట్ చేసిన దేవయాని!

ముకుంద: కృష్ణకి అభ్యంతరం లేదంటే నాకు ఒకే. చిన్నత్తయ మీరు ఏమి అనుకోకండి మీరు మా అమ్మలాగా ప్రతి దానికి కోప్పడతారు. తన దగ్గర పనులు నేర్చుకోవడం చాలా సరదాగా ఉంటుంది

కృష్ణ: నాకు ఒకే పెద్దత్తయ్య మీరు ఊ అంటే ముకుందని నేను సెట్ చేస్తాను

భవానీ: ముకుంద గురించి ఇంత కేర్ తీసుకుంటే నేను ఎందుకు కాదంటాను. కృష్ణ నీకు పర్మిషన్ ఇస్తున్నా

కావాలని మురారీ పక్కనే నిలబడి ముకుంద వడ్డిస్తుంటే కృష్ణకి రగిలిపోతుంది. ఇక తల్లీ కొడుకులు ఇద్దరూ కృష్ణ గురించి మాట్లాడుకుంటారు.

రేవతి: కృష్ణ లాంగ్ లీవ్ ఎందుకు పెట్టింది. తను ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా? మీ విషయం చెప్పడానికి టైమ్ చూసుకుంటుంది.

మురారీ: నేను తనతో మాట్లాడతాను. నాకోసం కృష్ణని ఇంటికి తీసుకొచ్చావ్. తనని నేను ఎలా వదులుకుంటాను. ముకుంద విషయం నేను సెట్ చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు

ముకుందతో మాట్లాడేందుకు అలేఖ్య వస్తుంది. నాకు ఎందుకో కృష్ణకి మీ ప్రేమ విషయం తెలిసిపోయిందని అనిపిస్తుందని అలేఖ్య అంటుంది.

ముకుంద: నీకు ఎలా తెలుసు. అయినా మా ప్రేమ గురించి తెలిస్తే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అందుకే మా ప్రేమ విషయం తెలియాలని ఆరాటపడుతున్నా

అలేఖ్య: మురారీకి నీమీద ప్రేమ లేదని తెలిస్తే ఇక్కడే ఉండిపోతుంది కదా

Also Read: కృష్ణ-మురారి దొంగ పోలీస్ ఆట, తింగరిపిల్ల అల్లరి చూసి రగిలిపోతున్న ముకుంద!

ముకుంద: ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో తనకి తెలుసు. తను తింగరిది కావచ్చు కానీ ఆత్మాభిమానం లేనిదని అనుకోవడం లేదు. తాళిని చూపించి రేవతి కోడలిగా ఈ ఇంట్లో ఉండాలని అనుకుంటే నేను ఉండనివ్వను. కృష్ణ వెళ్లిపోతే ఆదర్శ్ తిరిగి ఎప్పటికీ రాకపోతే అటు మురారీ, ఇటు నేను ఒంటరిగా ఉండిపోతాం. మురారీ ఆదర్శ్ కోసం ఆలోచిస్తున్నాడు కానీ నామీద ప్రేమ లేక కాదు. ఆదర్శ్ ని రాకుండా చేసి మురారీని నా సొంతం చేసుకుంటాను. కృష్ణ ఎలాగూ నాకు పనులు నేర్పిస్తానని అన్నది కదా దానితోనే తన గొయ్యి తవ్విస్తాను

మురారీ మధుతో సీరియస్ గా మాట్లాడావ్ కదా దేని గురించని కృష్ణని మురారీ అడుగుతాడు. ఏదో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ చెప్పాడని అబద్ధం చెప్పి కవర్ చేసేస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget