By: ABP Desam | Updated at : 11 Sep 2023 12:01 PM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
పెద్దాయన్ని నమ్మించడానికి రత్నప్రభ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ముందు హనీకి దగ్గరమని తన మనసులో చోటు సంపాదించమని ఆ తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందామని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ మాటకి రత్నప్రభకి కోపం వస్తుంది. ఆవేశపడొద్దని ఓపికగా డీల్ చేయాలని ధనుంజయ్ నచ్చజెపుతాడు. ఇక్కడ ఉండొద్దు వెళ్లిపోదామని స్వీటీ అంటుంది. హనీ ఏమన్నా పట్టించుకోకుండా తనకి దగ్గర అవమని తండ్రి చెప్పేసరికి ఆస్తి కోసమా అని తింగరిగా అడుగుతుంది. ఆ మాటకి ఇద్దరూ కూతుర్ని తిడతారు. హనీ ఫోన్లో సామ్రాట్ ఫోటో చూసుకుంటూ ఏడుస్తుంటే రత్నప్రభ వాళ్ళు వెళ్ళి మాట్లాడేందుకు చూస్తారు. తనని తులసి ఆంటీ దగ్గరకి తీసుకెళ్లమని లేదంటే తన దగ్గరకి రావొద్దని మాట్లాడొద్దని హనీ తేల్చి చెప్తుంది. దీంతో రత్నప్రభ తులసి దగ్గరకి తీసుకెళ్తామని అనేసరికి హనీ వాళ్ళతో వెళ్తుంది.
రత్నప్రభ వాళ్ళు హనీని తీసుకుని తులసి ఇంటికి వస్తారు. తనని చూడగానే హనీ సంతోషంగా వెళ్ళి కౌగలించుకుంటుంది. ఎందుకు తన దగ్గరకి రాలేదని హనీ అడుగుతుంది. ఈ ఆంటీ అంకుల్ ఉన్నారు కదా అందుకే రాలేదని తులసి చెప్తుంది. డాడీ లేకపోతే నువ్వే కావాలని తులసితో అంటుంది. దగ్గర అవడానికి మేం ట్రై చేసినా కూడా వినిపించుకోవడం లేదని ధనుంజయ్ చెప్తాడు. కాసేపు తులసి, హనీ సంతోషంగా మాట్లాడుకుని ఆడుకుంటారు. ధనుంజయ్ నందుని అవమానించేలా మాట్లాడతారు. హనీ తులసితో ఆడుకోవడం చూసి రత్నప్రభ వంకరగా మాట్లాడుతుంది. ఆస్తుల గురించి అడుగుతూ దెప్పి పొడుస్తుంది. ఆ మాటలకి మనసులో ఏముందో సూటిగా చెప్పమని నందు చిరాకు పడతాడు. సామ్రాట్ బాబాయ్ రాగానే సైలెంట్ అయిపోతారు. హనీ వాళ్ళు కిందకి వచ్చి మళ్ళీ రేపు వస్తానని అంటే తులసి వద్దని చెప్పి పంపిస్తుంది. తులసికి ఎందుకో అనుమానం వస్తుంది.
Also Read: కృష్ణని ఇంట్లో నుంచి పంపించేస్తానని ముకుంద ఛాలెంజ్- మురారీతో బైక్ మీద షికార్లు
దివ్యకి సవతి పోరు మొదలవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర జాహ్నవి విక్రమ్ తో క్లోజ్ గా ఉండటం చూసి దివ్య బాధపడుతుంది.
జాహ్నవి: చూడక్కా నేను ఇక్కడున్నన్ని రోజులు నువ్వు బావ మీద ఆశలు వదులుకో. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు బావా హాస్పిటల్ కి రాడు నువ్వే మేనేజ్ చేసుకో
విక్రమ్: అలా ఎలా కుదురుతుంది
జాహ్నవి: కుదుర్చుకో ఇక్కడ ఉంది మరదలు
విక్రమ్: కావాలంటే ఈవినింగ్ త్వరగా వస్తానులే
జాహ్నవి: కుదరదంటే నీతో పాటు హాస్పిటల్ వచ్చి నీ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటా
విక్రమ్: ఎందుకమ్మా ఈ మొండిదాన్ని పిలిచావ్
జాహ్నవి: ఇంకా నయం నీ పెళ్ళాన్ని కాలేదని అనేసరికి దివ్య షాక్ అవుతుంది. విక్రమ్ తో చేసిన చిలిపి పనుల గురించి మొత్తం చెప్తుంటే విక్రమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. బసవయ్య కావాలని బావ నువ్వు ఒకే మంచం మీద పడుకుని కబుర్లు కూడా చెప్పేదానివి కదా ఆ విషయాలు కూడ దివ్యకి చెప్పమని రెచ్చగొడతాడు. విక్రమ్ చేత్తో అన్నం తినిపించుకుంటుంది. రత్నప్రభ గురించి తులసితో చెప్పడానికి పరంధామయ్య ట్రై చేస్తాడు.
తులసి: హనీ మనల్ని వాళ్ళ ఇంటికి వచ్చేయమని చెప్తుంది కదా వెళ్దామా. సామ్రాట్ ఖజిన్ ఆయన భార్య నాకు బాగా నచ్చారు. హనీ నాకోసం దిగులు పెట్టుకుందని తెలిసి ఇక్కడికి తీసుకొచ్చారు.
అనసూయ: పైకి కనిపించేది అంతా నిజం కాదు. దివ్య అత్త అందుకు ఉదాహరణ. పైకి ఎంత తియ్యగా మాట్లాడుతుందో లోపల అంత విషం ఉంది
పరంధామయ్య: వాళ్ళు మాట్లాడే పద్ధతి అంతగా బాగోలేదు ఎందుకైనా మంచిది వాళ్ళకి దూరంగా ఉండు తులసి
అనసూయ: అవును ఇంకోసారి వాళ్ళు ఇక్కడికి రాకూడదు
తులసి: ఎందుకు అలా అంటున్నారు వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడారా?
Also Read: నిజం చెప్పేయమన్న జగతి- ఏంజెల్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ రిషి
నందు: వంకరగా అనుమానించేలా మాట్లాడారు. ఆస్తుల గురించి డబ్బు గురించి మాట్లాడారు
పరంధామయ్య: కావాలని నువ్వు హనీకి దగ్గర అవాలని అనుకుంటున్నారు. నువ్వు ఏదో ఆశించి అలా చేస్తున్నావని అనుమానిస్తున్నారు.
తులసి: వాళ్ళ మాట తీరు అంతేనేమో. నిన్న గాక మొన్న వచ్చిన వాళ్ళు నాగురించి వాళ్ళకేం తెలుసని అనుకుంటాను. మీరు ఎప్పుడు నా మీద నిందలు వేయలేదా? ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఫీల్ అవలేదా
అనసూయ: ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఒకటేనా
తులసి: నా కడుపున పుట్టిన బిడ్డలు తండ్రి ప్రేమకి దూరమైతే నేనే వాళ్ళని ఓదార్చాను. ఇప్పుడు హనీ కూడా అదే పొజిషన్ లో ఉంది. నా పిల్లలకి తండ్రి బతికి ఉండి దూరంగా ఉంటే హనీకి తండ్రి శాశ్వతంగా దూరమయ్యాడు అంతే తేడా
Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
బీఆర్ఎస్కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
/body>