(Source: ECI/ABP News/ABP Majha)
Gruhalakshmi Serial November 13th Today Episode: తులసితో మళ్లీ జీవితం పంచుకోవాలనుకుంటోన్న నందూ!
Gruhalakshmi Serial Today Episode: నందూ తులసితో మళ్లీ తన జీవితాన్ని పంచుకోవాలనుకుంటోన్న విషయాన్ని తులసి తల్లికి చెప్పాలనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Gruhalakshmi Serial Today Episode : హాల్‌లో తులసి అత్తయ్య, మామయ్య, హనీ కూర్చొని ఉంటారు. ఇంతలో తులసి అక్కడికి వచ్చి హనీ నీకు నేను ఏం చెప్పాను. నువ్వే ఏం చేస్తున్నావ్ తల్లీ.. ఈ రోజు దీపావళి పండుగ నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేయాలి కదా అంటుంది. హనీ వద్దు అంటే. ఇది రూల్ పెద్దవాళ్లకు పిల్లల్లకు ఇదే రూల్. పద నలుగుపెడతాను అంటుంది. అప్పుడు హనీ తాతయ్యకు ఎవరు నలుగు పెడతారని తులసిని అడిగితే వాళ్ల అత్తయ్య పెడుతుంది అంటుంది. మరి అంకుల్‌కి ఎవరు నలుగు పెడతారు అంటూ అక్కడికి వచ్చిన నందూని చూపిస్తుంది. అవన్నీ ఎందుకు కానీ పద అంటూ తులసి హనీని తీసుకెళ్తుంది. ఇక తులసి అత్త నలుగు పిండి పట్టుకొని వచ్చి తన భర్తను పరుగు పెట్టిస్తుంది.
మరోవైపు దివ్య దగ్గరకు అఖిల్ అనే అబ్బాయి వస్తాడు. ఏంటి అలా చూస్తున్నావ్ దివ్యా .. నీ చిన్నప్పటి ఫ్రెండ్ అఖిల్‌ని అని పరిచయం చేసుకుంటాడు. దివ్య గుర్తు రాలేదు అన్నా వినిపించుకోడు. కలిసి సినిమాలకు వెళ్లాం గుర్తులేదా అని అడుగుతాడు. తనకు అలాంటి అలవాటే లేదని దివ్య చెప్తుంది. మరో వైపు తన భర్త ఇదంతా చూస్తాడు. వాళ్లిద్దరూ నవ్వుతూ మాట్లాడుతుంటే.. దివ్య అంత క్లోజ్‌గా ఎందుకు మాట్లాడుతుందని అనుకుంటాడు. ఈ విషయాన్ని దివ్యను అడుగుతాడు.
ఇక తులసి హనీకి, అనసూయ వాళ్ల భర్తకు నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. తర్వాత తులసి నందుకు కూడా నలుగు పెట్టమని వాళ్ల అత్తయ్యకు చెప్తుంది. కాసేపు అయ్యాక తులసి వాళ్ల అమ్మ, దీపక్ ఇంటికి వస్తారు. ఇక నందు వాళ్ల అత్తయ్యకు పులిహోరా చేయమని చెప్తాడు. ఇక దీపావళి ఏర్పాట్లు చేస్తారు. నందూ వాళ్ల అత్తయ్య, దీపక్‌లకు కొత్త బట్టలు తీసుకొస్తాడు. వాటిని తులసికి ఇచ్చి వాళ్లకు ఇవ్వమని చెప్తాడు. అయితే తులసి వాళ్ల అమ్మ అందుకు అంగీకరించదు. చివరికి తులసి ఒప్పిస్తుంది.
నందు: మనసులో నాకు ఇంతకంటే మంచి అవకాశం రాదేమో. తులసి వాళ్ల అమ్మ చెప్పిన మాట వింటానని చెప్తోంది. నేను తులసితో మళ్లీ జీవితం పంచుకోవాలని అనుకుంటున్నట్లు అత్తయ్య గారికి చెప్పి తులసికి నచ్చచెప్పమని కోరుతాను. వాళ్ల అమ్మ మాట తులసి కాదు అనదు. వింటుంది.
దీపక్: అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏమైంది.
నందు: తులసి ఇక పూజ మొదలు పెడదామా
దివ్య దగ్గరకు అఖిల్ మళ్లీ వస్తాడు. దివ్య ఎంత గుర్తు రావడం లేదు అన్నా వినిపించుకోకుండా ఆమెను ఇరిటేట్ చేస్తూ మాట్లాడుతాడు. నవ్వితే వెళ్లిపోతానని అఖిల్ అనడంతో దివ్య చిరాకుగా నవ్వుతుంది. దాన్ని చూసిన తన భర్త మళ్లీ అపార్ధం చేసుకుంటాడు. ఎవడో తెలీదు అన్నాడు కదా మళ్లీ ఎందుకు వచ్చాడని అడుగుతాడు. వాడు నిన్ను ఏడిపిస్తున్నాఅని అడుగుతాడు. ఇక దివ్య పండగ కదా గుడికి వెళ్దాం అని తన భర్తను అడుగుతుంది. తన భర్త ఆమెకు పసుపు రంగు చీర కట్టుకోమంటాడు. దానికి దివ్య ఓకే చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎసిసోడ్ పూర్తవుతుంది.
తరువాయిభాగం: తులసి జీవితం ఇలా ఒంటరి కావడానికి తానే కారణం అని నందు తులసి వాళ్ల అమ్మకి చెప్తాడు. తులసితో మళ్లీ జీవితం పంచుకోవాలని ఆశ పడుతున్నట్లు చెప్తాడు. దీంతో తులసి వాళ్ల అమ్మ షాక్ అవుతుంది.