Gruhalakshmi July 19th: 'గృహలక్ష్మి' సీరియల్: హ్యాపీగా గడిపిన కొత్త జంట - దివ్య మాట వింటూ తల్లికి ఝలక్ ఇచ్చిన విక్రమ్
దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్ జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
లాస్య ఏర్పాటు చేసిన కారు డ్రైవర్ నందు, తులసిని రాజ్యలక్ష్మి ఇంటికి తీసుకురావడంతో షాక్ అవుతారు. నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటని లాస్య అతని మీద సీరియస్ అవుతుంది. తలకి అ కట్టు ఏంటి అసలు ఏం జరిగిందని నిలదీస్తుంది. కేఫ్ దగ్గర వాళ్ళకి యాక్సిడెంట్ చేసేందుకు కాపు కాశానని విషయం చెప్తాడు. తులసి వాళ్ళని ఢీ కొట్టబోయి కారు అదుపు తప్పి అతని తలకి దెబ్బ తగులుతుంది. వెంటనే నందు వాళ్ళు అతని తలకి కట్టు కట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ప్రాణాలు కాపాడినందుకు థాంక్స్ చెప్పి వాళ్ళని డ్రాప్ చేసిన విషయం చెప్తాడు.
లాస్య: యాక్సిడెంట్ చేయడం కూడా చేతకాదా? సిగ్గులేదా.. నీ వల్ల మా ప్లాన్ అంతా వేస్ట్ చేశావ్
డ్రైవర్: అంత మంచి వాళ్ళకి యాక్సిడెంట్ చేయించడానికి మీరు సిగ్గు పడాలి
Also Read: రాజ్‌కి దొరక్కుండా తెలివిగా తప్పించుకున్న కావ్య - స్వప్నకి గడ్డి పెట్టిన దుగ్గిరాల కుటుంబం
దివ్య పెళ్లి చేసిన తర్వాత పుట్టింటితో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టేనా ని బాధగా అడుగుతుంది. తులసి తన జీవితాన్ని చూసి పాఠాలు నేర్చుకోమని సలహా ఇవ్వడంతో దివ్య కన్వీన్స్ అవుతుంది. అందుకే నా ఫస్ట్ నైట్ నేనే ఏర్పాటు చేసుకున్నానని సంతోషంగా చెప్తుంది. ఇక పద అయ్యిందేదో అయింది రెడీ చేస్తాను పద అని కూతుర్ని తీసుకుని వెళ్తుంది. ఇక విక్రమ్ ఎక్కడ ఫస్ట్ నైట్ కానీ మొగుడిగా మిగిలిపోతాడేమోనని భయపడ్డానని విక్రమ్ తాతయ్య కాసేపు ఆట పట్టిస్తారు. అదంతా చూసి రాజ్యలక్ష్మి రగిలిపోతుంది.
దివ్య పెళ్లి కూతురిలాగా రెడీ అయి వస్తుంది. తనని చూసి విక్రమ్ మైమరిచిపోతాడు. ఎలాగైనా ఈ ఫస్ట్ నైట్ ఆగిపోయేలా చేయాలని రాజ్యలక్ష్మి లాస్యని అడుగుతుంది. ఆపడానికి ఇదేమైన నడిచే బస్సునా అంటుంది. ఇక విక్రమ్, దివ్యతో బంతులాట ఆడిద్దామని తులసి చెప్తుంది. ఇది ఆచారమని భార్యాభర్తల మధ్య బంధం బలపడటం కోసం సరదాగా చేసే ఆచారమని అంటుంది. ఇక ఇద్దరూ సరదాగా ఆడతారు. ఈ ఆటలో వదిన గెలిచ్చిందని సంజయ్ చెప్తాడు.
లాస్య: ఇక్కడే భర్తని గెలవనివ్వలేదు ఇక జీవితంలో ఏం గెలవనిస్తుంది
Also Read: ఇంటికి తిరిగొచ్చిన ఆదిత్య, వేదకి ఖుషి సపోర్ట్ - అభితో మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్న నీలాంబరి
ఇక రెండో ఆట మొదలుపెడతారు. విక్రమ్ చేతులు వెనక్కి కట్టుకుని దివ్య నోటిలో ఉన్న స్వీట్ అందుకోవాలని చెప్తారు. దివ్య స్వీట్ అందకుండా విక్రమ్ ని ఆడిస్తుంది. ఆ తర్వాత విక్రమ్ ఆడిస్తాడు. ఈ గేమ్ లో ఇద్దరూ గెలిచారని సంజయ్ చెప్తాడు. అంటే జీవితంలో ఇద్దరూ సమానంగా ఉంటారని అర్థమని తులసి అంటుంది. ఇక మగవాళ్ళు విక్రమ్ ని, ఆడవాళ్ళు దివ్యని శోభనం గదిలోకి పంపిద్దామని తులసి అంటే లాస్య ఆగమంటుంది.
నందు: ఎందుకు ఆగమన్నావ్ ఏమైంది
లాస్య: ఎవరికి వాళ్ళు వాళ్ళని లోపలికి పంపించాలని అనుకుంటున్నారు కానీ ముహూర్తం గురించి ఆలోచించడం లేదు