Gruhalakshmi July 10th: తులసి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్న విక్రమ్- విషం ఇస్తే తాగి చస్తానన్న దివ్య
రాజ్యలక్ష్మి ఇంట్లో లాస్య పాగా వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి వాళ్ళని రెచ్చగోట్టేందుకు లాస్య ఇంటికి వస్తుంది. మా మధ్య ఇంకా బంధం తెగిపోలేదు భరణం అనే బంధం ఉంది. ఇష్టం ఉన్నా లేకపోయినా మేం తలుచుకోవాల్సిందేనని చెప్తుంది. తనకి రావలసిన భరణం ఇస్తే వెళ్లిపోతానని అంటుంది. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడ నుంచి వస్తాయని నందు చెప్తాడు. మరి అలాంటప్పుడు విడాకులు ఎందుకు తీసుకున్నావ్ ఇదే మాట కోర్టులో కూడా చెప్పమని చెప్తుంది. లాస్యకి ఇవ్వాల్సిన యాభై వేలు వెంటనే ఇచ్చేసి పంపించమని తులసి చెప్తుంది. కేఫ్ కోసం ఉంచిన డబ్బులు కదా అంటే పర్లేదు ఇచ్చేయమని అంటుంది. దీంతో నందు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తాడు. నెల నెలా డబ్బులు కరెక్ట్ గా కొట్టమని చెప్పేసి వెళ్ళిపోతుంది.
దివ్య బాధపడుతుంటే విక్రమ్ వస్తాడు. తనని ఓదార్చాలసిన అవసరం లేదని, కన్నీళ్ళు అలవాటు అయిపోయాయని బాధపడుతుంది. నిజంగా భార్య తప్పు చేసినా అందరిలో రచ్చ చేయడు కాపాడతాడు. అది భార్యాభర్తల ప్రేమ అనుబంధం అంటే. కానీ నువ్వు చేసింది ఏంటి ఏ తప్పు చేయకపోయినా భార్యని దోషిని చేశావ్. నువ్వు నీ భార్య మనసుని ముక్కలు ముక్కలు చేశావు. ఇంట్లో పని వాళ్ళు కూడా విలువ ఇవ్వరని కుమిలిపోతుంది.
Also Read: రంగంలోకి దిగిన భవానీ దేవి, ముకుంద ప్రేమ గురించి తెలుసుకుంటుందా?
దివ్య: నిజాయితీగా చెప్పాను నేను మా పుట్టింటి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కానీ నువ్వు నమ్మలేదు అది నా విలువ
విక్రమ్: నువ్వు మీ నాన్న చేతిలో డబ్బులు పెట్టడం నేను చూశాను. కానీ నేనేమీ అనలేదు వాళ్ళకి ఏదైనా సమస్య అయితే నేను చూసుకుంటాను. నీ డబ్బు నా డబ్బు అని వేరు కాదు
దివ్య: నీ డబ్బు నీకు చెప్పకుండా ఒక్క రూపాయి కూడా తీసుకొను
విక్రమ్: సరే నువ్వు డబ్బు తీసుకోలేదు సోరి చెప్తున్నా ఇక ఆ విషయం మర్చిపోదాం
దివ్య: నా ఏడుపు ఎందుకని సోరి చెప్తున్నావా? అవసరం లేదు నలుగురిలో మాటలు అని నాలుగు గోడల మధ్య సోరి చెప్తే ఎలా ఒప్పుకుంటాను. అయినా చెప్పాల్సింది నువ్వు కాదు నా మీద నిందలు వేసిన ఇంట్లో వాళ్ళతో చెప్పించు. నీ ప్లేస్ లో నేను ఉంటే మీ మావయ్య చెంప పగలగొట్టేదాన్ని.
విక్రమ్: గొడవ సద్దుమణగాలని చూస్తుంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్
నందు డబ్బులు లేవని బాధపడుతుంటే అప్పుడే విక్రమ్ వస్తాడు. డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకు ఇక్కడ పెట్టావని అడుగుతారు.
విక్రమ్: నేను అల్లుడిని మాత్రమే కాదు కొడుకుని కూడ. మీరు డబ్బుల అవసరంలో ఉన్నారు కదా తీసుకోండి
తులసి: మేము డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని ఎవరు చెప్పారు
Also Read: పెళ్ళాం చేతికి డబ్బులివ్వలేక రాజ్ అగచాట్లు- అప్పు ప్రేమలో పడిపోయిన కళ్యాణ్!
విక్రమ్: నేను అల్లుడిని కాబట్టి మీరు చెప్పరు నేనే తెలుసుకున్నా. అందుకే కేఫ్ నడపడం కోసం వీటిని వాడుకోండి. మీరు డబ్బు కోసం మీరు మా ఇంటికి వచ్చిన సంగతి తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నా వాళ్ళకి సాయం చేయడానికి. ఇది సరిపోకపోతే ఒక ఫోన్ చేయండి తెచ్చి ఇస్తాను. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి.. నన్ను మాత్రమే అడగండి దివ్యని కాదు. అలా అడగటం తప్పు కాదు కానీ దివ్యకి ఇలాంటివి ఎలా మ్యానేజ్ చేయాలో తెలియదు. తను ఇబ్బంది పడి నన్ను ఇబ్బందుల్లోకి లాగుతుంది.
తులసి: డబ్బులు విక్రమ్ చేతిలో పెట్టి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మేము దివ్యని డబ్బులు అడగలేదు. ఆడపిల్లకి అప్పు చేసి అయినా కొనిపెడతాం కానీ తన దగ్గర డబ్బు తీసుకునే సంస్కారం కాదు మాది
విక్రమ్: దివ్య చేసిన తప్పే మీరు చేస్తున్నారు. తను మీ చేతికి డబ్బు ఇవ్వడం నేను కళ్ళారా చూశాను.
తులసి: ఏదో చూసి ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నారని విషయం చెప్పబోతుంటే వినకుండా మాట్లాడేసి వెళ్ళిపోతాడు.
దివ్య బాధపడుతుంటే రాజ్యలక్ష్మి వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఎలా ఉంది నా దెబ్బ చుక్కలు కనిపించాయా అంటుంది. తులసి దివ్యకి ఫోన్ చేసి పుట్టింటి పరువు తీయడానికి డిసైడ్ అయ్యావా అని సీరియస్ గా మాట్లాడుతుంది.