By: ABP Desam | Updated at : 10 Dec 2022 07:48 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
హనీ డల్ గా ఉండటం చూసి ఏమైందని సామ్రాట్ అడుగుతాడు. తనకి ఫస్ట్ ర్యాంక్ కావాలని తీసుకొచ్చి ఇవ్వమని అడుగుతుంది. తులసి ఆంటీ చెప్పింది మనస్పూర్తిగా కోరుకుంటే దేవుడు కోరిక తీరుస్తాడని చెప్పింది, నువ్వు నా తరఫు కోరిక కోరుకుని తీర్చేలా చెయ్యమని చెప్తుంది. ఒక వేళ ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఇక చదవనని చెప్పేసి వెళ్ళిపోతుంది. సరే ఎలాగోకలా తీసుకొస్తానులే అని సామ్రాట్ మాట ఇచ్చేసరికి సంతోషంగా వెళ్ళిపోతాడు. చదవకుండా ఫస్ట్ ర్యాంక్ ఎలా తీసుకొస్తాడో చూడాలి.
తులసి తన తల్లికి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. కూతురికి ప్రేమగా తినిపిస్తుంది. తులసి తల్లి ఒడిలో పడుకుని తన బాధ చెప్పుకుంటుంది. తన చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని అక్కడ తిరగాలని అది తీరని కోరికగా మిగిలిపోయిందని తులసి అంటుంది. ఆ ఇల్లు కేసు లిటిగేషన్ లో ఉందని అది రావడం కాస్త కష్టమని తల్లి చెప్తుంది. సామ్రాట్ తులసి కోసం ఇంటికి వస్తాడు. ఇద్దరూ కారులో ఆఫీసుకి వెళ్తు ఉంటే సామ్రాట్ డల్ గా ఉండటం చూసి పాటలు పెడుతుంది. సాంగ్ పెట్టినా కూడా పట్టించుకోకుండా పరధాన్యంగా ఉంటాడు. సామ్రాట్ అలా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది. హనీ తనకి ఫస్ట్ ర్యాంక్ తీసుకురమ్మని అడిగిన విషయం తులసితో చెప్తాడు.
ఎప్పుడు ఎగ్జామ్స్ రాసినా హనీకి సెకండ్ ర్యాంక్ వస్తుంది. అందుకని మూతి ముడుచుకుని కూర్చుంది. వెళ్ళి పలకరించి ఫస్ట్ ర్యాంక్ వస్తుందిలే దేవుడు చూసుకుంటాడని నోరు జారి చెప్పాను దాన్ని ఎలా తీసుకొస్తానని అంటాడు. హనీ సమస్యని ఎలా తీర్చాలి అని సామ్రాట్ తలమునకలైపోతాడు. దేవుడి మీద భారం వేయండి ఆయనే చూసుకుంటాడని తులసి కూడా అంటుంది. శ్రుతి వంట చేస్తూ ఉండగా లాస్య వచ్చి ఎవరికి వండుతున్నావ్ అని అడుగుతుంది. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ప్రేమ్ అడిగాడు అందుకే చేస్తున్నా అని చెప్తుంది. అది విని లాస్య కోపంగా స్టవ్ కట్టేస్తుంది. ఇది ఇల్లా రెస్టారెంట్ అందరికీ నచ్చినవి చెయ్యడానికి అని అవమానకరంగా మాట్లాడుతుంది.
ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదని లాస్య అంటుంది. తులసి ఆంటీ ఎప్పుడు ఇలా చేయలేదని శ్రుతి అంటుంది. కానీ ఇది నా ఇల్లు నాకు నచ్చినట్టు చేస్తాను నేను చెప్పినట్టు మాట వినాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ తన మాటే వినాలని లాస్య శ్రుతికి వార్నింగ్ ఇస్తుంది. ఫ్రిజ్ కి లాక్ వేసి ఏం కావాలన్నా తనని అడిగి, కారణం చెప్పి తీసుకోవాలని లాస్య అంటుంది. ప్రేమ్ అడిగింది చేయలేకపోతున్నా అని శ్రుతి చాలా బాధపడుతుంది. సామ్రాట్ తులసిని తీసుకుని గుడికి వస్తాడు. హనీ కోరిక తీర్చమని ముడుపు కడతాడు.
Also Read: ఊహించని ట్విస్ట్, సులోచన యాక్సిడెంట్ కేసులో కొడుకుని అరెస్ట్ చేయించిన యష్- కక్ష కట్టిన మాళవిక
Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!
Janaki Kalaganaledu February 6th: మలయాళం వంటలు తినలేకపారిపోయిన విష్ణు - మల్లికకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన జానకి
Brahmamudi Serial February 6th: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య
Guppedanta Manasu February 6th: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్
Ennenno Janmalabandham February 6th: చిత్రమీద కన్నేసిన అభిమన్యు, మాళవిక గతి ఇక అథోగతి- విన్నీ పార్టీకి వెళ్తున్న వేద
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్లో ఐదుగురు!