అన్వేషించండి

Janaki Kalaganaledu December 9th: జానకి అంటే పోలీస్ డ్రెస్ వేసుకున్న కిరణ్ బేడీ, బీ కేర్ ఫుల్- కన్నాబాబుని అరెస్ట్ చెయ్యడానికి వచ్చిన పోలీసులు

మాధురి కేసు గురించి జానకి ఇన్వెస్టిగేషన్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తన దొంగ కడుపు డ్రామా ఎక్కడ బయటపడిపోతుందో అని మల్లిక కాలు జారి కిందపడినట్టు నటిస్తుంది. హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అక్కడి డాక్టర్ తో నీలావతి మల్లికకి అబార్షన్ అయినట్టు చెప్పిస్తుంది. అలా జరిగినందుకు ఇంట్లో అందరూ చాలా బాధపడతారు. విష్ణు చాలా ఎమోషనల్ అయిపోతాడు. పాప పుడితే అమ్మ పేరు పెట్టుకోవాలని అనుకున్నా తన దిష్టే తగిలింది ఏమో అని కన్నీరుమున్నీరు అవుతాడు. జ్ఞానంబ మల్లిక ఎంత కుమిలిపోతుందో అని బాధపడుతుంది. దీనంతటికి కారణం మల్లిక అందరినీ ఏడిపిస్తుందని జానకి కోపంగా తన దగ్గరకి వెళ్తుంది. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు మల్లిక డాన్స్ వేస్తూ ఉంటుంది. ఎవరో రావడం గమనించిన మల్లిక మళ్ళీ యాక్టింగ్ మొదలెడుతుంది.

ఎందుకు ఇలా అందరూ బాధపడేలా చేశావని జానకి మల్లికని తిడుతుంది. నిజం చెప్పమంటే ఇలా చేస్తావా అని నిలదీస్తుంది. చెప్దామని అనుకున్నా కానీ అత్తయ్యగారు తనని తరిమేస్తారని ఇలా చేశానని కవర్ చేసుకుంటుంది. జానకి తిడుతున్నా కూడా మల్లిక అవేమీ పట్టించుకోదు. గదిలో రామా విష్ణు మాటలు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడతాడు. అప్పుడే జానకి వస్తుంది. మల్లిక కడుపు పోయిందని అమ్మ, విష్ణు కుమిలిపోతుంటే తట్టుకోలేకపోతున్నా అని బాధపడతాడు. పుట్టబోయే బిడ్డ గురించి చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ దేవుడు అన్యాయం చేశారని అంటాడు. మల్లిక గురించి తనకేమి బాధలేదని జానకి అంటుంది.

Also Read: ఊహించని ట్విస్ట్, సులోచన యాక్సిడెంట్ కేసులో కొడుకుని అరెస్ట్ చేయించిన యష్- కక్ష కట్టిన మాళవిక

జానకి: అసలు మల్లిక కడుపుతో ఉంటేనే కదా అది పోయిందని బాధపడటానికి

రామా: మల్లిక గర్భవతి కాకపోవడం ఏంటి

జానకి: నేను అందరిలాగానే నమ్మాను కానీ తన ప్రవర్తన మీద అనుమానం కలిగి ఫాలో చేశాను అప్పుడే తెలిసింది మల్లిక కూడా చెప్పేసింది నాకు, చివరికి దీన్ని ఎలా మాయ చెయ్యాలో అర్థం కాక ఇలా చేసింది

రామా: మల్లిక ఇంత మోసం చేసిందా అమ్మని, తమ్ముడిని ఇంతగా బాధపెడుతుందా? తనని వదిలేది లేదని ఆవేశంగా వెళ్లబోతుంటే జానకి ఆపుతుంది. ఈ విషయం తెలిస్తే మల్లిక కాపురం చెడిపోయే ప్రమాదం ఉందని నచ్చజెప్తుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్తుంది. మాధురి కేసు విచారణ ఎంత వరకి వచ్చిందని అడుగుతాడు. తన మీద హత్యాప్రయత్నం చేసింది ఎవరో తెలిసిందా అని అడిగితే తెలిసిందని త్వరలోనే చెప్తానని జానకి అంటుంది.

కన్నబాబుని అరెస్ట్ చెయ్యడానికి సునంద ఇంటికి ఇన్ స్పెక్టర్ వస్తాడు. ఆ విషయం తెలిసి సునంద షాక్ అవుతుంది. మాధురి మీద హత్యప్రయత్నం చేసినట్టు తన పేరెంట్స్ తో జానకి కేసు పెట్టించిందని తనని అరెస్ట్ చెయ్యడానికి వచ్చినట్టు చెప్తాడు. తను కేసు పెడితే అరెస్ట్ చెయ్యడానికి వచ్చేస్తారా అని నిలదీస్తుంది. కన్నబాబే మర్డర్ చేసేందుకు ట్రై చేసినట్టు క్రైమ్ స్పాట్ లో ఎవిడెన్స్ దొరికిందని ఎస్సై ఉంగరం చూపిస్తాడు. దీంతో పాటు మర్డర్ ఏటెంప్ట్ జరగడానికి ముందే కన్నబాబు మాధురితో ఫోన్లో మాట్లాడినట్లు కాల్ లిస్ట్ లో ఉందని చెప్పడంతో సునంద ఆగ్రహంతో ఊగిపోతుంది. ఈ ఎవిడెన్స్ తో తప్పక అరెస్ట్ చెయ్యడానికి వచ్చినట్టు చెప్తాడు.

Also read: తులసి మాట విని భార్యకి సోరి చెప్పిన నందు- కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి లాస్య స్కెచ్

కన్నాబాబు కి బదులు తన కారు డ్రైవర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లమని సునంద పోలీసులకి చెప్తుంది. కన్నబాబు ఫోన్, ఉంగరం డ్రైవర్ దొంగిలించినట్టు దాని మీద కేసు కూడా పెట్టినట్టు క్రియేట్ చేసి తనని తీసుకెళ్లమని అనేసరికి పోలీసులు అతన్ని తీసుకెళ్లిపోతారు. అప్పుడే ఇంటికి వచ్చిన కన్నబాబు ఏమైందని అడిగేసరికి సునంద లాగిపెట్టి కొడుతుంది. జానకి ఇంట్లో వాళ్ళకి కన్నబాబే దాడి చేసినట్టు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. విషయం తెలిసి అఖిల్ ఈ కేసు నుంచి బయటపడినందుకు సంతోషిస్తారు.

తరువాయి భాగంలో..

జానకి సునంద ఇంటికి వెళ్ళి తనకి వార్నింగ్ ఇస్తుంది. కొడుకుని కాపాడటానికి ట్రై చేయొద్దని హెచ్చరిస్తుంది. ‘జానకి అంటే ఇంట్లో కూరగాయలు కట్ చేసుకునేది మాత్రమే కాదు పోలీస్ డ్రెస్ వేసుకున్న కిరణ్ బేడీ కూడా. ఒంటి మీద పోలీస్ డ్రెస్ లేకపోయినా ఇంత చేశాను ఆఫీసర్ అయితే అందరి లెక్కలు సరిచేస్తా’నని వార్నింగ్ ఇస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Embed widget