By: ABP Desam | Updated at : 28 Jul 2022 11:24 AM (IST)
image credit: Disney Plus Hotstar/ Star Maa
లాస్య కొడుకు లక్కీ తులసి దగ్గరకి వచ్చి మాట్లాడతాడు. అక్కడ సామ్రాట్ కూడా ఉంటాడు. అప్పుడే లాస్య, నందు వచ్చి లక్కీని తీసుకెళ్తారు. ఆ బాబు మీకు తెలుసా చాలా మీతో ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు ఆంటీ అని పిలుస్తున్నాడు.. నందు వాళ్ళ ఫ్యామిలీ మీకు ముందే తెలుసా అని సామ్రాట్ అడుగుతాడు. ఏం సమాధానం చెప్పాలో ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి హనీ వస్తుంది. దీంతో సమాధానం చెప్పకుండా తులసి తప్పించుకుంటుంది. ఇక లక్కీ తులసి దగ్గరకి ఎందుకు వెళ్ళావని లాస్య తిడుతుంది. తులసి ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళాను అని చెప్తాడు. నువ్వు కచ్చితంగా గెలవాలి గెలిచాక స్టేజ్ మీద నా గురించి గొప్పగా చెప్పాలి మా మమ్మీ వల్లే నేను గెలిచాను అని చెప్పాలి అది చూసి తులసి కుళ్ళుకోవాలి అని లాస్య లక్కీ తో అంటుంది. నువ్వేం చేశావని నేను చెప్పడానికి అని గాలి తీస్తాడు. నువ్వేమి నాకు సాయం చెయ్యలేదు అంకుల్ నన్ను రెడీ చేశారు కనీసం ఈ డ్రస్ కూడా నువ్వు కొనివ్వలేదు అని అంటాడు. అంత లేదు ఈ డ్రస్ కొనడానికి మీ అంకుల్ దగ్గర డబ్బు కూడా లేదు నేనే కొనిచ్చాను రూపాయి సంపాదన కూడా మీ అంకుల్ కి లేదని నందుని అవమానిస్తుంది లాస్య. నన్ను అవమానించకపోతే నీకు నిద్రపట్టదా అని నందు ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
Also Read: ఆదిత్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న రుక్మిణిని దేవి చూస్తుందా? తండ్రిపై ద్వేషంతో రగిలిపోతున్న దేవి
హనీతో కలిసి డాన్స్ చేసే టీచర్ కి ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ వస్తుంది. అది విని తులసి ఏమైంది అని అడుగుతుంది. ఎప్పుడో చాలారోజుల క్రితం అప్లై చేసిన జాబ్ వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ చేశారు అని చెప్తుంది. హనీ ఇబ్బంది పడుతుంది, ఇంటర్వ్యూ వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వండి నేను మాట్లాడతాను అని తులసి అంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదని టీచర్ అంటుంటే అప్పుడే హనీ తులసిని పిలవడంతో ఆమె వెళ్ళిపోతుంది. ఇక ఇదేమి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కాదు కదా వాళ్ళ తలనొప్పులేవో వాళ్ళు పడతారు నేను ఎవరికి కనపడకుండా వెళ్లిపోతాను అని ఆమె చిన్నగా అక్కడ నుంచి జారుకునేందుకు ట్రాయ్ చేస్తుంది. ఎవరికి కనిపించకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే సరిగ్గా సామ్రాట్ కంట పడుతుంది. ఆమె చూసి వెళ్ళి అపుతాడు. ఎక్కడికి వెళ్తున్నారని సామ్రాట్ టీచర్ ని అడుగుతాడు క్యాంటీన్ కి వెళ్తున్న అని అబద్ధం చెప్తుంది. నాకు చెప్తే నేను చూసుకుంటాను కదా మీరేందుకు వెళ్ళడం అని ఆమెని వెనక్కి తీసుకుని వెళ్తాడు. సామ్రాట్ తులసితో మాట్లాడుతున్న సమయంలో టీచర్ వెళ్ళిపోతుంది. హనికి తల్లి గురించి ఏమి తెలియదు అమ్మే ఉంటే అన్ని చూసుకునేది కానీ తనకి ఆ అదృష్టం లేదు మా హనీ దురదృష్టవంతురాలు అని బాధపడతాడు.
Also Read: పగిలిన మాళవిక బోనం, వేద కాలికి గుచ్చుకున్న గాజుపెంకు - అమ్మవారు ఎవరిని ఆశీర్వదించారు?
స్కూల్ లో ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది. మొబైల్ గురించి చిన్న పిల్లలు ప్రదర్శన ఇస్తారు. లక్కీ అల్లూరి సీతారామరాజు గెటప్ లో నాటకం ప్రదర్శిస్తాడు. అందులో లక్కీ నటన అద్భుతంగా ఉంటుంది. లక్కీ ప్రదర్శన చూసి హాలంతా చపట్లతో మార్మోగిపోతుంది. ఆంటీ మన టీచర్ ఎక్కడా అని హనీ తులసిని అడుగుతుంది. ఆమె కనిపించకపోయేసరికి తులసి టెన్షన్ గా వెతుకుతూ ఉంటుంది.
తరువాయి భాగంలో..
టీచర్ లేకపోవడంతో సామ్రాట్ టెన్షన్ పడతాడు. ఇక తులసి హనీతో కలిసి డాన్స్ చెయ్యడం చూసి ఆనందపడతాడు. అది చూసి నందు, లాస్య షాక్ అవుతారు. ఇక ఈ పోటీల్లో హనీ, లక్కీ ఎవరు గెలిచారంటే..
Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్
Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!
Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!
Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!
Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం