Ennallo Vechina Hrudayam Serial Today May 9th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: వాసుకి తిక్క కుదుర్చిన బాల..త్రిపురకు అదిరిపోయే ఐడియా ఇచ్చిన డిటెక్టివ్ బాల
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీ తప్పు లేదని నిరూపించడానికి బాల లాయర్ నోటీస్ తీసుకొని త్రిపుర దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode గాయత్రీ, అనంత్‌లకు సాయం చేయొద్దని బలవంతంగా బామ్మ బాలని తీసుకెళ్లిపోతుంది. వాసుకిని చూసి గాయత్రీ కోపంగా వెళ్లిపోతుంది. వాసుకి తనలో తాను మీ ఇద్దరికీ ఏదీ అందకుండా చేస్తా ఇద్దరినీ ఇంటి నుంచి తరిమేసే వరకు నా ప్రయత్నాలు ఆపను అని అనుకుంటుంది. మరోవైపు త్రిపుర ఏడుస్తుంటుంది. తాతయ్య బాధపడొద్దు అని చెప్తారు.
గాయత్రీ ఎలాంటిదో మనకు తెలుసు కదా తాతయ్య.. తనమీద అలాంటి నిందలు నా కడుపు తరుక్కుపోతుందని అంటుంది. గాయత్రీని అనంత్ నమ్ముతున్నారు కదా అని పెద్దాయన అంటారు. అతను ఒక్కరే కాదు తాతయ్య అందరూ నమ్మాలి నా చెల్లి ఏం తప్పు చేయలేదని నిరూపిస్తానని అంటుంది. ఊర్వశి, రమాప్రభ వచ్చి మనం దాని కోపం భరిస్తా అందరూ అలా ఉండరు కదా అడిగే వాళ్లు లేక ఆస్తి కోసం అలాంటి పనులు చేస్తుందా అని అంటారు. అలా అంటారు ఏంటి మీకు గాయత్రీ ఎలాంటిదో తెలీదా అని త్రిపుర అడుగుతుంది. తెలుసమ్మా నా కూతురిని కాదని అనంత్‌ని పెళ్లి చేసుకుంది. బాల అడ్డు తొలగించుకోవాలి అనుకుంటుంది. అమ్మో అమ్మో పెళ్లి జరిగి పదహారు రోజుల పండగ కూడా అవ్వలేదు అప్పుడే ఆస్తి మీద కన్నేసిందా అని అంటుంది. పెద్దాయన చిన్న కోడలు ఊర్వశిని తిడతారు. మీ లాంటి బుద్ధి అందరికీ ఉంటుంది అనుకున్నారా అంటారు.
గాయత్రీని అవుట్ హౌస్ నుంచి రోడ్డు మీద పడేసే వరకు ఊరుకోనని రమాప్రభ తనలో తాను అనుకొని వెళ్లిపోతుంది. గాయత్రీ ఏం తప్పు చేయలేదు అని తెలుసుకున్న వాళ్లే హారతి ఇచ్చి గాయత్రీని లోపలికి ఆహ్వానిస్తారని తాత అంటారు. మరోవైపు బాల దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. వాసుకి బట్టలు లాక్కోవడం లాయర్ నోటీస్ అన్నీ గుర్తు చేసుకుంటాడు. వాసుకి గదిలోకి వెళ్లి పడుకుంటుంది. అది చూసిన బాల డిటెక్టివ్ గెటప్ వేసుకొని వాసుకి వాళ్ల గదికి వెళ్తాడు. బూతద్ధంలో బాబాయ్‌ని చూసి దెయ్యంగా కనిపిస్తున్నాడు పిన్ని తొండం లేని ఏనుగులా కనిపిస్తున్నారని అనుకుంటాడు.
అనంత్, గాయత్రీని ఇంటికి తీసుకురావడమే డిటెక్టివ్ బాల లక్ష్యమని గది మొత్తం సాక్ష్యం కోసం వెతుకుతాడు. మొత్తం వెతికి లాయర్ నోటీస్ తీసుకుంటాడు. తర్వాత మా తమ్ముడికి గాయత్రీకి బట్టలు లేకుండా చేశావ్ కదా ఈ కన్నయ్య లీలలు ఏంటో నీకు చూపిస్తా అని చీర తీసుకొని పిన్ని బాబాయ్ కాళ్లు చేతులను కట్టేస్తాడు. తర్వాత నోటీస్ తీసుకొని వెళ్లిపోతాడు. ఇక కొద్ది సేపటికి వాసుకి లేచి కాళ్లు చేతులు కట్టేయడం వల్ల నాగభూషణం మీద పడిపోతుంది. చచ్చాన్రా బాబోయ్ అని నాగభూషణం అరుస్తాడు. ఇద్దరూ చీరతో తమని కట్టేయడం చూసి షాక్ అయిపోతారు. ఇద్దరూ కట్లు బలవంతంగా కట్లు విప్పుకోవాలని చూపి విఫలం అవడంతో ఫణి విప్పుతాడు. ఇదంతా బాల పనే అని వాసుకి అంటుంది.
బాల సంగతి చెప్దామని బయల్దేరుతారు. బాల ఎవరూ చూడకుండా లాయర్ నోటీస్ బ్యాగ్‌లో పెట్టుకొని బయటకు వెళ్తారు. బాలని చూసి వాసుకి వీడికి గతం పోయింది కానీ తెలివి తేటలు అలాగే ఉన్నాయని అంటుంది. ఇక త్రిపుర తన చెల్లి తప్పు లేదని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కావాలని అంటుంది. బాల త్రిపుర దగ్గరకు వచ్చి మనకు అవసరం అయిన ఒకటి తీసుకొచ్చా అంటాడు. ఏంటి అని త్రిపుర అడిగితే లాయర్ నోటీస్ చూపిస్తాడు. గాయత్రీ పేరు మీద వచ్చిన నోటీస్ పేపర్ అని త్రిపురకు ఇస్తాడు. లాయర్‌ని గాయత్రీ కలిసింది అతను ఏదో చెప్పాడు అన్నారు కదా అందుకే అందులో ఉన్న అడ్రస్‌కి వెళ్తే మనకు ఏమైనా క్లూ దొరుకుతుందని అంటాడు. త్రిపుర మంచి ఐడియా అంటుంది. ఈ ఆధారంతో తన చెల్లి నిర్దోషి అని నిరూపిస్తా అని త్రిపుర అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















