Ennallo Vechina Hrudayam Serial Today May 2nd: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: వాసుకి ప్లాన్ సక్సెస్.. గాయత్రీని మెడ పట్టుకొని ఇంటి నుంచి గెంటేసిన అనంత్!
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీ బాల కోసం తప్పుగా మాట్లాడినట్లు వాసుకి వీడియో పంపడంతో అనంత్ గాయత్రీని గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలకి పెళ్లి చేయాలని పెళ్లి వాళ్లతో ఇంట్లో అందరూ మాట్లాడుతారు. పంతులు ఇరు కుటుంబాలకు పరిచయం చేస్తారు. ఆస్తి పాస్తులు, కట్నకానుకలు ఏం వద్దని కేవలం తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అని అంటారు. పెళ్లి వాళ్లు ఒకే అవుతారు. వాసుకి చాటుగా వెళ్లి పెళ్లి వాళ్లకి ఫోన్ చేసి మీకో వీడియో పంపాను చూసుకోండి అని చెప్తుంది.
పెళ్లి కూతురి తండ్రి వీడియో చూస్తాడు. బామ్మ, యశోదలు బాలని పొడుగుతారు. బాల మంచి తనం చెప్తారు. ఇలాంటి గొప్ప సంబంధం దొరకడం మీ అదృష్టం అని పంతులు అంటే గొప్ప సంబంధం అండీ అని పెళ్లి కూతురి తండ్రి అంటాడు. మీ మనవడికి పరిస్థితి బాలేకపోయినా మంచి ఫ్యామిలీ అని ఒప్పుకున్నాం కానీ మీ చిన్న కోడలు మీ బాల కోసం బయట ఏం చెప్తుందో తెలుసా అని అంటాడు. బాలకి మానసిక పరిస్థితి బాలేదని అందరికీ చెప్తుందని అంటాడు. అనంత్ పెళ్లికూతురి తండ్రి కాలర్ పట్టుకుంటాడు. నా కాలర్ పట్టుకోవడం కాదు నీ భార్య ఏమందో ముందు తెలుసుకో అంటాడు. గాయత్రీ వచ్చి నేనేం అన్నాను అంటుంది.
పెళ్లి కూతురి తండ్రి అందరికీ వీడియో చూపిస్తారు. అందులో గాయత్రీ బాల గురించి పాజిటివ్‌గా మాట్లాడిన మాటలు అన్నీ వాసుకి నెగిటివ్‌గా మార్చేస్తుంది. మా బావగారి మైండ్ పని చేయడం లేదు ఆయన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఆయన కోసం మేం ఎందుకు ఆగుతాం. అలాంటి ఆయన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఎవరు ముందుకు రారు అని వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూసి అందరూ షాక్ అయిపోతారు. బాలని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి రాదు అని పెళ్లివాళ్లు అంటారు. పంతులు అందర్నీ తీసుకెళ్లిపోతాడు. గాయత్రీ అనంత్‌తో నేను అలా అనలేదు అంటుంది.
అనంత్ ఆవేశంగా గాయత్రీ చెంప పగలగొడతాడు. గాయత్రీ మంచిది కొట్టొద్దు అని బాల అంటాడు. వాసుకి మాత్రం గాయత్రీ చెడ్డది అని చెప్తుంది. త్రిపుర తన చెల్లి అలా అనదు అంటుంది. నా కొడుకు కోసం అలా అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది అని గాయత్రీని యశోద తిడుతుంది. గాయత్రీని వాసుకి, నాగభూషణం తిడతారు. గాయత్రీ అందరితో అది ఎవరో కావాలని చేసిన పని అని అంటుంది. అంత స్పష్టంగా వీడియో ఉన్న అలా ఎలా మాట్లాడుతావని బామ్మ అంటుంది. మీరు ఇది నమ్ముతున్నారా అని గాయత్రీ అడుగుతుంది. అనంత్ బ్యాగ్ తీసుకొచ్చి విసిరేసి నా కళ్ల ముందు నుంచి వెళ్లిపో అని గెంటేస్తాడు. ఒక్క మాట మాట్లాడకుండా వెళ్లిపో అని గెంటేస్తాడు. ఎవరూ ఏం మాట్లాడకుండా ఉంటారు.
త్రిపుర గాయత్రీ దగ్గరకు వెళ్లి అనంత్‌తో మాట్లాడుతా అంటే గాయత్రీ వద్దని నేనేం తప్పు చేయలేదు అని అంటుంది. గాయత్రీ బ్యాగ్‌తో ఇంటికి రావడం చూసి తాతగారు ఏమైందని అడుగుతారు. గాయత్రీ తాతతో నేను ఇకపై ఆ ఇంటికి వెళ్లను అని చెప్తుంది. తాతయ్య షాక్ అయిపోతారు. త్రిపుర జరిగింది చెప్తుంది. అనంత్ గాయత్రీతో తన ఫొటోస్ చూసుకొని వీడియో గురించి గుర్తు చేసుకుంటాడు. అందరూ అనంత్‌ని తినడానికి పిలిస్తే రాడు. అందరూ గాయత్రీ గురించి తప్పుగా మాట్లాడుతారు. అనవసరంగా పెళ్లి చేశామని అనుకుంటారు. బాల వచ్చి గాయత్రీ మంచిదిరా అదంతా అబద్ధంరా అని అంటాడు. అవన్నీ నమ్మకు అని చెప్తాడు.
వాసుకి వాళ్లు గాయత్రీని తిడతారు. నా మాట వింటావా వినవా అని బాల అంటాడు. అనంత్ నీ మాట వింటాను కానీ ఆ గాయత్రీని నమ్మను అంటాడు. కోపంతో బాల బొమ్మలు విసిరేస్తాడు. దాంతో అక్కడే ఉన్న టాక్ టామ్ నుంచి గాయత్రీ బాల గురించి చెప్పిన పాజిటివ్ మాటలు వస్తాయి. మా బావగారు మంచి వారు ఆయన లాంటి వారిని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి అయినా అదృష్టం ఆయనకు కచ్చితంగా పెళ్లి అవుతుంది అని గాయత్రీ చెప్పిన మాటలు వస్తాయి. అందరూ షాక్ అయిపోతారు. అనంత్ తాను పొరపాటు చేశానని షాక్ అవుతాడు. గాయత్రీ నన్ను ఏం అనలేదు అని బాల అంటాడు. తప్పు చేశామని అందరూ అనుకుంటారు. అసలు ఇదంతా ఎవరు చేసుకుంటారని అనుకుంటారు. గాయత్రీకి పడని వాళ్లు వాళ్ల పిన్ని రమాప్రభ, ఊర్వశి చేసుకుంటారని వాసుకి, నాగభూషణం ప్లేట్ తిప్పేస్తారు. ఎవరు ఇది చేశారో జాగ్రత్తగా తెలుసుకోవాలి అనుకుంటారు.
అనంత్‌తో చెప్పి గాయత్రీని తీసుకురమ్మని అంటారు. బాల, అనంత్ త్రిపుర ఇంటికి వెళ్తారు. అనంత్ లోపలికి వెళ్తాడు. బాల సారీ చెప్పమని అంటాడు. గాయత్రీ తనకు ఎవరీ సారీ అవసరం లేదని అనేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!





















