అన్వేషించండి

Ennallo Vechina Hrudayam Serial Today March 6th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: గాయత్రీని అపార్థం చేసుకున్న అనంత్.. త్రిపుర పెళ్లిలో బాల చిందులు

Ennallo Vechina Hrudayam Today Episode గల్ఫ్‌లో చిక్కుకున్న అమ్మ కోసమే త్రిపుర పెళ్లి చేసుకుంటుందని గాయత్రీ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode గాయత్రీకి మరోవ్యక్తితో పెళ్లి అని అనంత్ నమ్మేలా ఊర్వశి ప్లాన్ చేస్తుంది. అనంత్ గాయత్రీకి ఫోన్ చేస్తే ఆఫోన్‌ని ఊర్వశి తల్లితో పన్నిన పథకం ప్రకారం ఫోన్ దాచేస్తారు. ఇక ఇంటికెళ్లి తేల్చుకుంటా అని అనంత్ అని బయల్దేరుతాడు. రమాదేవి త్రిపురని పెళ్లి కూతురిలా రెడీ చేస్తుంటుంది. ఇంతలో ఊర్వశి రమాదేవికి కాల్ చేసి అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనంత్ వస్తున్నాడు చూసుకో అని చెప్తుంది.

అనంత్ ఇంటికి వచ్చే సరికి అనంత్‌ని చూసిన రమాదేవి ప్లాన్ ప్రకారం అనంత్ చూసేలా గాయత్రీని తీసుకొచ్చి కూర్చొపెట్టి నగలు చూడు చీర చూడు నీ కోసమే అని బిల్డప్ ఇస్తుంది. అది చూసిన అనంత్ అక్క పెళ్లి అన చెప్పి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా అని అనుకుంటాడు. ఇంతలో రమాదేవి అనంత్ దగ్గరకు వచ్చి గాయత్రీతో మాట్లాడాలి అంటే కాసేపట్లో పెళ్లి మా మేనల్లుడినే పెళ్లి చేసుకుంటుంది. ఎప్పటినుంచోఅనుకుంటుంన్న సంబంధం మీకు చెప్పలేదా మీలాగే నలుగురు ఐదుగురు వచ్చారని చెప్తుంది. నన్ను ఇంత మోసం చేస్తావా.. నువ్వు అబద్ధం నీ ప్రేమ అబద్ధం అని అనుకుంటాడు. ఇక ఊర్వశి వచ్చి పలకరించి ఇంట్లోకి రమ్మని అంటే అనంత్ వెళ్లిపోతాడు. అనంత్ గాయత్రీ విడిపోయారని తల్లీకూతుళ్లు సంతోష పడతారు. తర్వాత గాయత్రీ బయటకు వచ్చి అనంత్‌కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అనంత్ కట్ చేస్తూనే ఉంటాడు. బిజీగా ఉన్నాడేమో అని అనుకుంటుంది.

ఇంతలో గాయత్రీ దగ్గరకు ఏజెంట్ వచ్చి మీ అమ్మ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అక్కడి వాళ్లు మీ అక్కతో ఫోన్‌లో మాట్లాడి ఏం చేయాలో చెప్పారు కదా అది చేస్తున్నారా అని మాట్లాడుతారు. గాయత్రీకి విషయం తెలీక ఏంటి అంకుల్ అని అడిగితే గాయత్రీకి విషయం తెలీదని అర్థమైన అతను కవర్ చేసి వెళ్లిపోతాడు. గాయత్రీకి అనుమానం వచ్చి అక్క ఫోన్ నుంచి దుబాయి షేట్‌తో మాట్లాడితే తెలుస్తుందని అనుకొని ఇంటికి వెళ్తుంది. మరోవైపు రమాదేవి పెళ్లి హడావుడి చేస్తుంటుంది. ప్రసాద్, అతని భార్య పెళ్లికి రామని చెప్పి వెళ్లి హర్ట్ అయిపోతారు. ఇక గాయత్రీ అక్క ఫోన్ నుంచి షేటుకి కాల్ చేస్తుంది. షేట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే 15 లక్షలు ఏర్పాటు చేశారా అవి ఇస్తేనే మీ అమ్మని పంపిస్తామని అంటారు. గాయత్రీ షాక్ అయిపోతుంది. అన్నా వదినల దగ్గరకు వెళ్లి త్రిపుర ఎందుకు పెళ్లికి ఒప్పుకుందో చెప్తుంది. ఈ పెళ్లిని ఇప్పుడు ఆపలేమని ప్రశాద్ అంటాడు. అక్క మాట వినదు అని ఏదో ఒక విధంగా పెళ్లి ఆపాలి అని గాయత్రీ అంటుంది. 

త్రిపుర పెళ్లి మండపానికి బయల్దేరుతూ తండ్రి ఫోటో దగ్గరకు వెళ్లి నాన్న అమ్మని కాపాడుకోవడానికి ఈ పెళ్లి చేసుకోక తప్పడం లేదని ఏడుస్తుంది. మరోవైపు రత్నమాల సేటుని పిలిచి త్రిపుర దగ్గర గిరి దొంగతనం చేసిన డబ్బు అమ్మడానికి ఇస్తుంది. ఇంతలో గాయత్రీ వచ్చి మీరు మనుషులేనా మా అమ్మని అడ్డు పెట్టుకొని మా అక్కని పెళ్లి చేసుకుంటారా అని కోప్పడుతుంది. బంగారం తీసుకొని ఈ బంగారం మాది మా అక్క బంగారం అని నిజం చెప్పి పెళ్లి ఆపుతానని బయల్దేరితే గిరి గాయత్రీని చంపేస్తానని గొంతు పట్టుకుంటాడు. రత్నమాల నగల బ్యాగ్ తీసుకుంటుంది. దాన్ని చంపేస్తే పెళ్లి జరగదు అని పెళ్లి వరకు ఓపిక పట్టమని కొడుకుని బతిమాలుతుంది. దాంతో గిరి గాయత్రీ కాళ్లు చేతులు కట్టేయమని రౌడీలతో చెప్పి కారు డిక్కీలో పడేస్తారు. ఇక గిరి వాళ్లు పెళ్లి ఊరేగింపుగా వెళ్తుంటారు. త్రిపురని కూడా ఎక్కించుకొని అందరూ డ్యాన్స్‌లు చేస్తూ వెళ్తారు. బాల కూడా అటుగా వచ్చి డ్యాన్స్ చేస్తాడు. అప్పుడే గిరిని చూసి దొంగ దొంగ అని అరుస్తాడు. గిరి రౌడీలతో చెప్పి బాల అంతు చూడమంటాడు. రౌడీలు బాలని తీసుకెళ్తుంటే  ప్రసాద్ చూసి బాలని వదిలేయమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget