అన్వేషించండి

Ennallo Vechina Hrudayam Serial Today March 29th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!

Ennallo Vechina Hrudayam Today Episode బాల మీద విరుగుడు విష ప్రయోగం జరుగుతుందని త్రిపుర ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల ఆకలి అని గోల చేయడంతో యశోద యాపిల్ ఇస్తుంది. బాల తినబోతే యాపిల్ మీద ఓ పెద్ద మచ్చ చూసి త్రిపుర ఆ యాపిల్ తీసుకుంటుంది. ఈ యాపిల్ బాలేదని చెప్పి మరో యాపిల్ తీసుకొస్తానని ఇంకొకటి తీసుకొస్తుంది. ఫణి, వాసుకి, నాగభూషణం వాళ్ల ప్లాన్ వేస్ట్ అయిపోయిందని ఢీలా పడిపోతారు. 

ఇక రాత్రి త్రిపుర రాక కోసం ఊర్వశి, రమాదేవిలు వెయిట్ చేస్తుంటారు. అనంత్‌తో మాట్లాడుంటుందా లేదా అని ఊర్వశి అడుగుతుంది. ఇంతలో త్రిపుర రావడంతో పెళ్లి విషయం మాట్లాడావా అక్క అంటే మాట్లాడాను అనంత్ వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారని చెప్తుంది. ఊర్వశి సంతోషంతో థ్యాంక్స్ అక్క అని అంటుంది. రమాదేవి త్రిపురతో మాట నిలబెట్టుకున్నావమ్మా అని అంటుంది. ఊర్వశి పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటా అని త్రిపుర అంటుంది. అనంత్ ప్రేమిస్తుంది గాయత్రీని అని తెలిస్తే త్రిపుర ఒప్పుకుంటుందా.. అనంత్ ఒప్పుకుంటాడా అని ఊర్వశి అంటే అప్పుడు ఏదో ఒక ప్లాన్ చేద్దామని రమాదేవి అంటుంది. అనంత్ నాతో పెళ్లికి ఒప్పుకున్నాడంటే ఏదో కన్ఫ్యూజ్ అయ్యింటారని అనుకుంటారు. 

గాయత్రీ రావడంతో త్రిపుర ఊర్వశికి పెళ్లి కుదిరిందని చెప్తుంది. ఎవరో చెప్పబోతే నాకు అవసరం లేదని గాయత్రీ చెప్పేసి వెళ్లిపోతుంది. శ్రీరామనవమి రోజు నిశ్చితార్థం అని త్రిపుర చెప్తుంది. గాయత్రీ లేకుండా అనంత్, ఊర్వశిల నిశ్చితార్థం జరిపించాలని రమాదేవి అనుకుంటుంది. యశోద బాలకు పాలు ఇస్తుంది. పాలు తాగిన బాల నాకు ఎంతో బలం వచ్చేసిందని గెంతులేస్తాడు. అందరూ నవ్వుకుంటారు. ఫణి అందరితో ఓ విషయం చెప్పాలి అంటాడు. ఏంటి అని అడిగితే మన కంపెనీలకు చాలా రోజుల నుంచి సీఈఓ లేరు అన్నయ్యకి నయం అయింది అనుకుంటే మళ్లీ ఇలా జరిగింది.. అనంత్ తీసుకుంటాడా అంటే అన్నయ్యదే ఆ స్థానం అంటున్నాడు.. సీఈఓ లేకపోవడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని అందరూ సీఈఓ ఉండాలి అంటున్నారు.. ఆ సీఈఓ పోస్ట్ నాకు ఇవ్వండి అని అడుగుతాడు. కంపెనీ భవిష్యత్ బాగుండాలి అంటే ఆ స్థానంలో నా కన్నయ్య కూర్చొవాలని వేరే ఎవరో ఆ స్థానానికి అర్హులు కారని బామ్మ చెప్తుంది. ఇంతలో త్రిపుర వస్తే బాల సుందరి అని ఆడుకోవడానికి త్రిపురని కూర్చొపెడతాడు.

నాగభూషణం, వాసుకిలు ఫణికి ఓ అవకాశం ఇవ్వమని అంటారు. ఫణి కష్టపడుతున్నాడని కానీ వాడి బలం సరిపోదని వాసుదేవ్ అంటాడు. కొత్త ప్రాజెక్ట్‌లు కావాలి అంటే అన్నయ్య సంతకం పెట్టాలి ఈ టైంలో అన్నయ్య పెట్టలేడు కదా అని ఫణి అంటే దానికి బామ్మ నీ ప్రాబ్లమ్ సంతకం అయితే ఒక్క నిమిషం ఆగు అని వీలునామా తీసుకొస్తుంది. అందులో బాల మామూలు మనిషి అవ్వకపోతే అతని భార్యకే అన్ని అర్హతలు వస్తాయని వీలునామా రాయించినట్లు చెప్తుంది. త్రిపుర అన్నీ వింటుంది. దానికి నాగభూషణం, వాసుకిలు అంతా బాలకి వాడి పెళ్లానికి ఇచ్చేస్తే మేం అడుక్కొని తినాలా అని అడుగుతారు. ఇదంతా బాల ఆస్తి అని మీ వాటా ఇందులో ఏం లేదు రాదు.. ఉన్నన్నినాళ్లు వాడి దయ మీద ఉండండి లేదంటే మీ ఇష్టం అని బామ్మ తేల్చేస్తుంది. 

బాలకి యశోద జ్యూస్ ఇస్తుంది. త్రిపుర తీసుకొని నాకు ఈ జ్యూస్ మీద అనుమానంగా ఉందని అంటుంది. మా వదిననే అనుమానిస్తావా అని నాగభూషణం అడిగితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా బాల గారికి విరుగుడు ఇస్తున్నారని అంటుంది. ఇంట్లో ఎవరు అలా చేస్తారని అందరూ ప్రశ్నిస్తే త్రిపుర ఒక్క నిమిషం అని చెప్పి ఇంజెక్షన్, యాపిల్, మందు కలిపినన్నీ తీసుకొచ్చి అందరి ముందు పెడుతుంది. బాల మీద వీటితో ఎవరో విరుగుడు మందు పెట్టారని అంటుంది. ఫణీ వాళ్లు చాలా కంగారు పడతారు. తర్వాత త్రిపుర జ్యూస్‌లో మందు వేసి అందులో ఓ ఆకు ముంచుతుంది. ఆ ఆకు నీలం రంగులో మారుతుంది. అందరూ షాక్ అయిపోతారు. విరుగుడు మందు ప్రభావం వల్ల ఆకు ఇలా అయిందని చెప్తుంది. విరుగుడు మందు స్టోర్‌ రూంలో దొరికిందని చెప్తుంది. యాపిల్ కూడా కట్ చేసి చూపిస్తే నీలం రంగులో ఉంటుంది. అందరూ బిత్తరపోతారు. ఎవరు ఇలా చేశారని బామ్మ, యశోద ఏడుస్తారు. ఇక నుంచి బాల గారికి ఏం కావాలి అన్నా నేనే చూసుకుంటా అని త్రిపుర చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget