Ennallo Vechina Hrudayam Serial Today March 26th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి కేర్‌టేకర్‌గా త్రిపుర.. గాయత్రీ వెంట పడుతున్న అనంత్!
Ennallo Vechina Hrudayam Today Episode పోలీస్ స్టేషన్‌లో ఉన్న త్రిపురని బాల ఫ్యామిలీ కాపాడటం త్రిపుర బాల కేర్ టేకర్‌గా ఒప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న త్రిపుర ఓ కంపెనీలో ఇంటర్వూకి వెళ్తుంది. అయితే వాళ్లంతా పిల్లల్ని అమ్మే బ్యాచ్. పైకి మాత్రం స్వచ్ఛంద సంస్థ అని రోజు 5, 6 అనాథ పిల్లల్ని చేర్చాలి అని చెప్పి త్రిపురకు ఉద్యోగం ఇస్తారు. మరోవైపు త్రిపురని బాలకి కేర్ టేకర్‌గా ఉండమని అడగటానికి బాలని తీసుకొని బాల తల్లి, బామ్మ త్రిపుర ఇంటికి వెళ్తారు.
త్రిపురకి ఉద్యోగం ఇచ్చిన ఆ దొంగ అధికారులు బాండ్ పేపర్ల మీద త్రిపుర సంతకం పెట్టించుకోవాలని చెప్తారు. త్రిపుర సంతకం పెట్టేస్తుంది. బామ్మ ఇంట్లో వాళ్లతో త్రిపుర వల్ల బాల మామూలు మనిషి అవుతాడని త్రిపుర కేర్ టేకర్‌గా పంపమని అడుగుతారు. ఆడపిల్ల మగపిల్లాడికి కేర్ టేకర్‌గా వెళ్లడం ఎంత వరకు బాగుంటుందో ఆలోచించండి అని పెద్దాయన వాళ్లతో చెప్తారు. ఇక మేడ మీదకు వెళ్లిన బాల నాటకాల వాళ్ల దగ్గరకు వెళ్లి చేతి కర్ర భుజం మీద వేసుకొని వాళ్లు చెప్తున్న డైలాగ్ చెప్తాడు. పాంచాలి.. పంచ భద్రుక అని ఎవరికి పడితే వాళ్లకి అనకూడదు అని అంటారు. ఇక బాల సుందరి కోసం డైలాగ్ చెప్పాలి అనుకుంటాడు.
మరోవైపు పోలీసులు వచ్చి వాళ్లంతా బోగస్ కంపెనీ అని చెప్పి అరెస్ట్ చేస్తారు. త్రిపురని కూడా వాళ్ల కంపెనీ అని అనుకొని త్రిపురని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. త్రిపుర తనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్లు చిన్న పిల్లల అవయవాల వ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని తిడుతుంది. ఇక బాల వాళ్లకి ఊర్వశి కాఫీ ఇస్తుంది. గాయత్రీ కూడా ఇంటికి వస్తుంది. పోలీసులు ధర్మయ్యకి కాల్ చేసి త్రిపురని అరెస్ట్ చేశారని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. యశోద వాళ్లు కూడా వస్తామని ఎలా అయినా త్రిపురని కాపాడుకుందామని వెళ్తారు. అందరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. త్రిపురని చూసిన గాయత్రీ, బాల, తాతయ్య అందరూ కంగారు పడతారు. త్రిపుర జరిగింది అంతా చెప్తుంది. నేను మాట్లాడుతానని బాల వెళ్లి నా సుందరిని వదిలేయండి అంటాడు. యశోద, బామ్మ అందరూ పోలీసుల్ని నిలదీస్తారు. సుందరిని వదిలేయండి అని బాల ఏడుస్తాడు. ఎస్ఐ ఎంతకీ వినకపోవడంతో బామ్మ పెద్ద కొడుకు వాసుదేవ్‌కి కాల్ చేసి కమీషనర్‌కి చెప్పమని అంటుంది. కమీషనర్ నుంచి కాల్ రావడంతో పోలీసులు త్రిపురని వదిలేస్తారు.
త్రిపుర బామ్మ వాళ్లకి థ్యాంక్స్ చెప్తుంది. మా అక్కని కాపాడినందుకు థ్యాంక్స్ అని ఊర్వశి అంటే గాయత్రీ ఓవర్ చేసుకుంటుంది అని అనుకుంటుంది. ఇక యశోద త్రిపురతో ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో తిరిగే బదులు మేమే నీకు ఉద్యోగం ఇస్తాం. మంచి జీతం ఇస్తాం. కానీ అది మా ఇంట్లో.. మా బాలకి నువ్వు కేర్ టేకర్‌గా ఉండాలి అంటుంది. బాల కూడా త్రిపురతో సుందరి నువ్వు మా ఇంటికి వస్తావా ప్లీజ్ అంటాడు. త్రిపురని కాదనొద్దని యశోద వాళ్లు చెప్తారు. తాతయ్య కూడా ఒకే అంటారు. దాంతో త్రిపుర ఒప్పుకుంటుంది. సుందరి మా ఇంటికి వస్తుంది అని బాల గెంతులేస్తాడు. గాయత్రీ మనసులో టీచర్‌గా చేసిన నువ్వు కేర్ టేకర్‌గా వెళ్లడం నాకు ఇష్టం లేదు అక్క కానీ నీకు బాల గారు చాలా సాయం చేశారు కాబట్టి ఒప్పుకుంటున్నా అనుకుంటుంది.
మరోవైపు అనంత్ గాయత్రీ కోసం వెళ్లి గాయత్రీతో మాట్లాడాలి అని గాయత్రీని అడ్డుకుంటే గాయత్రీ మాట్లాడటానికి ఒప్పుకోదు అనంత్ మీద కోప్పడుతుంది. మాట్లాడే ఛాన్స్ ఇవ్వమని అనంత్ వేడుకుంటాడు. మన మధ్య వచ్చిన ఈ గ్యాప్‌లో పొరపాటు అంతా నాదే అని అనంత్ అంటే గాయత్రీ క్లాప్స్ కొట్టి సిటీలో ఇంకెవరూ దొరలేదని నా వెనక వచ్చావ్ అంటుంది. మీ ఇంటికి మా అక్క కేర్ టేకర్‌గా వస్తుందని నువ్వు నా వెంట పడుతున్నావా.. నువ్వేం చేసినా నేను నిన్ను నమ్మను నా వెంట పడకు.. ఇలా చేస్తే మా అక్క మీ ఇంటికి రాదు అని చెప్పి వెళ్లిపోతుంది. ఉదయం త్రిపుర బాల ఇంటికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?





















