Ennallo Vechina Hrudayam Serial Today March 17th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: నడిరోడ్డు మీద మాజీ లవర్స్ గొడవ.. కుట్రతో ఇంద్రభవనంలో దూరిన ఊర్వశి!
Ennallo Vechina Hrudayam Today Episode గిరి బెయిల్ మీద బయటకు వచ్చి త్రిపుర దగ్గరకు వెళ్తానని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode ఊర్వశి, రమాదేవిలు బామ్మకి సపర్యలు చేసి ఆమెతో పాటు ఇంటికి వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. త్రిపుర ఇంటి దగ్గర ఉన్న నాటకాల వాళ్లు స్కూల్ దగ్గర యశోద శ్రీకృష్ణుల నాటకం వేయాలని ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్‌లో చేయాల్సిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని మాట్లాడుకుంటారు. త్రిపుర వచ్చి ఏమైందని అడిగితే విషయం చెప్పి ఆమెకు 45వేలు డబ్బు ఇస్తామని చెప్తామని ఇప్పుడు తను రాకపోతే స్కూల్ వాళ్లు కొడతారని చెప్తారు.
త్రిపుర వెంటనే వాళ్లతో అన్న ఆ యశోద వేషం నేను వేస్తాను నాకు డబ్బు ఇవ్వండి అంటుంది. నీకు నటన వచ్చా డైలాగ్స్ చెప్పడం వచ్చా అని ఒక డైలాగ్ చెప్పమంటారు. దాంతో త్రిపుర గద భుజాన వేసుకొని "ఏమంటివి ఏమంటివి అంటూ దానవీరశూరకర్ణ" అంటూ ఫేమస్ డైలాగ్ చెప్తుంది. అందరూ చప్పట్లు కొట్టి అడ్వాన్స్ 5 వేలు ఇస్తారు. మరోవైపు గిరి బెయిల్ మీద రిలీజ్ అవుతాడు. నేరుగా త్రిపుర ఇంటికే వెళ్తానని అనుకుంటాడు. మరోవైపు బామ్మని తీసుకొని ఊర్వశి, రమాదేవి అనంత్ వాళ్ల ఇంటికి వస్తారు. ఇళ్లు ఇంద్ర భవనం అనుకొని తుక్కలేస్తారు. అందరూ వచ్చి ఏమైందని అడిగితే ఊర్వశి వాళ్లు విషయం చెప్పి ఊర్వశి సపర్యలు చేస్తుంది. అలా ఎలా అవుతుంది ఎవరో కావాలి అనే చేసుంటారని నాగభూషణం అంటే రమాదేవి షాక్ అవుతుంది. ఇక బాల వస్తే బామ్మ విషయం చెప్తుంది.
బాలని చూసిన రమాదేవి ఈ అమ్మాయిని రామగిరిలో చూశాం అని అంటే మేం అక్కడికి ప్రకృతి వైద్య శాలకు వచ్చామని బామ్మ చెప్తుంది. మీరు సిటీకి ఎందుకు వచ్చారు అని అంటే మా అమ్మాయి పై చదువుల కోసం అని మా బావగారి కూతుళ్లు ఉన్నారు వారినీ మేమే చూసుకోవాలని వాళ్లకి పద్ధతి ఏం లేదని త్రిపుర, గాయత్రీల కోసం చెడుగా చెప్తుంది. అందరూ చూస్తుండగా ఊర్వశి బామ్మ గారు బామ్మ గారు అని కాలు పట్టుకొని ఓవర్ చేస్తుంది. బామ్మ ఊర్వశి మంచిది అనుకుంటుంది. రాజమార్గంలో ఇంటికి వెళ్లి ఫుల్ మార్కులు కొట్టేశామని అనంత్‌ని నీ వైపు తిప్పుకోవడమే ఉందని అనుకుంటారు. గాయత్రీ రోడ్డు మీద ఆయిల్ పడటంతో ఇసుక వేస్తుంది. సరిగ్గా అప్పుడే గాయత్రీ ఎదురుగా అనంత్ కారు ఆపి తన కోసం నిల్చొంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చీట్ చేసుకున్నారని కోపంగా చూసుకుంటారు.
అనంత్: సిటీలో కూడా ఈ మట్టి నాటకాలు ఎందుకు జనాల జీవితాలతో ఆడుకొని బాగానే సెటిల్ అయిపోయావు కదా.
గాయత్రీ: నీలాంటి మోసగాలు ఇక్కడ ఉంటారు అని తెలీదు. నమ్మించి మోసం చేయడం నీకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు.
అనంత్: మాట భలే తిప్పేస్తున్నావ్ కదా అంతేలే మాయ చేయడంలో ఆరితేరిపోయావ్. మాట తప్పడంలో ఆరితేరిపోయావ్ కదా.
గాయత్రీ: నేను మాట తప్పడం కాదు నువ్వే మాట మీద నిలబడలేదు. నీలాంటి డైలాగ్స్ నేను చెప్పను నాకు అవసరం కూడా లేదు.
ఇద్దరూ గొడవ పడతారు. ఒకర్ని ఒకరు తిట్టుకొని నువ్వు నాకు కనిపించకు అంటే నువ్వు నాకు కనిపించకు అని తిట్టుకుంటారు. గాయత్రీ తన చేతికి ఉన్న రింగ్ బలవంతంగా తీసి అనంత్ ముఖం మీద విసిరేస్తుంది. అనంత్ అది తీసుకొని కోపంగా నీలాంటి విలువ లేనివాళ్ల దగ్గర విలువైనవి ఉండకూడదు. అందుకే నీకు ఉద్యోగం ఇవ్వకుండా పంపేశాను అంటాడు. అది నీ ఆఫీస్ అని తెలిస్తే నా నీడ కూడా నీ ఆఫీస్ వైపు చూడదు అని గాయత్రీ వెళ్లిపోతుంది. త్రిపుర లాయర్ ఫీజ్ ఇచ్చేస్తుంది. ఇక అటుగా వస్తుంటే స్కూల్ దగ్గర కొందరు వ్యక్తుల ఓ పాప మెడలో చైన్ చూసి అది దొంగతనం చేస్తుండగా త్రిపుర పట్టుకుంటుంది. ఇద్దరు దొంగలతో త్రిపురకు గొడవ అవుతుంది. అటుగా వెళ్తున్న బాల చూసి కారు ఆపి వాళ్లకి ఎదురెళ్లి ఇద్దరినీ లాగిపెట్టి కొట్టి చైన్ తీసుకుంటాడు. ఇద్దరికీ చితక్కొట్టడంతో సారీ చెప్పి వెళ్లిపోతారు. బాల చైన్ తీసుకొని ఆ అమ్మాయికి ఇస్తాడు. త్రిపుర ధైర్యానికి బాల మెచ్చుకుంటాడు. ఇక త్రిపుర బాల గారు అని అనడంతో నా పేరు మీకు ఎలా తెలుసు అని బాల అడుగుతాడు. త్రిపుర ఏం చెప్పకుండా వెళ్లిపోతుంది.
ఫణి కొందరు రౌడీలతో మాట్లాడి టైం బాంబ్ తీసుకుంటాడు. బాలని చంపేయాలి అని వాళ్లతో చెప్తాడు. రాత్రి ఫణి బాల్యానీలో సిగరెట్ తాగుతూ ఉంటే బాల అటుగా వస్తాడు. ఫణి ఎందుకు పడుకోలేదు అన్నయ్య అంటే కళ్లు మూస్తే తాతయ్య గుర్తొస్తున్నారని తాతయ్యని చంపిన వాళ్ల ఆధారాలు ఉన్నాయని వెతికి పట్టుకోవాలని అంటాడు. తాతయ్య విషయంలో సపోర్ట్ చేయమని బాల ఫణితో చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

