Ennallo Vechina Hrudayam Serial Today March 15th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ ఇంట్లో చేరడానికి తల్లీకూతుళ్ల ఆయిల్ ప్లాన్.. బెడిసికొట్టిన ఫణీ ప్రొటీన్!
Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర పాలప్యాకెట్లు వేయడం చూసిన బాల త్రిపురని మోటివేట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర కనిపించడం లేదని ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. మొత్తం వెతుకుతారు. ఇంతలో త్రిపుర ఇంటికి వస్తుంది. జరిగింది అంతా చెప్తుంది. తాళి కట్టించుకొని ఉంటే బాగుండేదే వాళ్లని పంచాయితీకి పిలిచి డబ్బు, ఇళ్లు రాయించుకునే వాళ్లం అంటుంది. దాంతో గాయత్రీ, ప్రకాశ్, ఆయన భార్య రమాదేవి మీద కోప్పడతారు.
త్రిపుర ఏడుస్తూ మనకి మంచి ఉద్యోగాలు లేవు డబ్బు లేదు అందుకే ఆశతో వెళ్లానని అంటుంది. అందరూ త్రిపురకి ధైర్యం చెప్తారు. తల్లిని ఎలా విడిపించుకుందామని గాయత్రీ చెప్తుంది. రమాదేవికి రత్నామాల కాల్ చేస్తుంది. రమాదేవి కాల్ కట్ చేస్తుంది. కొంచెం కూడా మనకు అది సాయం చేయలేదు దాంతో మనకు పని లేదు అని ఊర్వశితో చెప్తుంది. ఉదయం ఫణి లేచి బాటిల్‌లో ప్రోటీన్ పట్టుకుంటాడు. తల్లిదండ్రులు వచ్చి ఇదేంట్రా అంటే బాలా గాడికి ప్రొటీన్ అని ఇది వాడు తాగితే వాడు పిచ్చోడు అయిపోతాడని అందులో మందు కలిపానని చెప్తాడు. బాలా జాగింక్‌కి బయల్దేరుతాడు. బాల అనంత్ రాను అంటే బలవంతంగా తీసుకెళ్తాడు. ఫణిని రమ్మని అంటే ఫణి కాలు బెనికిందని రాను అంటాడు. ఇక బాల చిన్నాన్నతో నువ్వురా అని అంటే నా వల్ల కాదు అంటాడు. ఇక బాలకి ఫణి ప్రొటీన్ అందిస్తాడు.
ఊర్వశి అనంత్ గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తుంది. అనంత్ డిటైల్స్ తెలియక తలపట్టుకుంటే రమాదేవి వచ్చి అల్లుడి అడ్రస్ అని చెప్తుంది. మన ఊరి గెస్ట్‌హస్‌లో అడిగితే ఇచ్చారని చెప్తుంది. ఇక మన పని మొదలు పెట్టాలని ఇద్దరూ అనుకుంటారు. బాల, అనంత్ జాగింగ్ చేస్తారు. సగం పరుగెట్టి అనంత్ నా వల్ల కాదు అంటాడు. అన్నయ్యని పంపి తాను కాసేపు రెస్ట్ తీసుకుంటా అంటాడు. ఇక అక్కడే గాయత్రీ పేపర్ వేస్తుంటుంది. గాయత్రీ అనంత్‌ని చూస్తుంది. తనని మోసం చేసినందుకు అనంత్‌కి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. పేపర్ వేసిన తర్వాత చూస్తే అనంత్ ఉండదు. ఏదో ఒక రోజు దొరకుతావ్ అప్పుడు చెప్తా అనుకుంటుంది. ఇక త్రిపుర పాల ప్యాకెట్లు వేస్తుంటుంది. బాల జాగింగ్ చేసి ప్రొటీన్ తాగడానికి రెడీ అయినప్పుడు త్రిపుర వచ్చి స్కూటీతో గుద్దేస్తుంది. ప్రొటీన్ కింద పడిపోతుంది. పాల ప్యాకెట్లు వేయడం చూసిన బాల గుడ్ అని అంటాడు. లైఫ్‌లో పోరాడటానికి ఏం పని చేసినా తప్పులేదని ఇది మొదటి మెట్టు అని ఇంకా కష్టపడండి అని మీరు అనుకున్నది సాధిస్తారని మోటివేట్ చేస్తాడు.
ఊర్వశి, రమాదేవిలు అనంత్ అడ్రస్‌కి వచ్చి అనంత్ వాళ్లు ఇళ్లు చూసి నోరెళ్లబెడతారు. ఇంటికి ఎలా వెళ్లాలి అమ్మా అంటే ఏదో ఒకటి చేసి ఇంటికి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని అంటుంది. వాసుకి, నాగభూషణం, ఫణిలు బాల పిచ్చోడై వస్తాడని చందులు వేస్తుంటే బాల ఎప్పటిలా రావడం చూసి నోరెళ్ల బెడతారు. ఫణి ప్రొటీన్ బాటిల్ ఏది అంటే చిన్న డ్యామేజ్ వల్ల పోయింది వదిలేశా అంటాడు. రమాదేవి, ఊర్వశిలు అనంత్‌ని చూస్తారు. మాఅల్లుడు సూపర్ అని రమాదేవి అంటుంది. బామ్మ గుడికి వెళ్లడం చూస్తారు. బామ్మని ఫాలో అవ్వాలి అనుకుంటారు. ఇక గాయత్రీ అనంత్‌ని తలచుకొని బాధ పడుతుంటే త్రిపుర వచ్చి ఏమైందని అలా ఉన్నావ్ అంటుంది. త్రిపురకి లాయర్ ఫోన్ చేస్తారు.
త్రిపుర స్పీకర్ పెడుతుంది. గల్ఫ్‌లో లాయర్ మీ అమ్మ కేసు తీసుకోవడానికి రెడీ అయ్యాడని డబ్బు సెట్ చేయమని చెప్తారు. బామ్మని ఫాలో అయిన తల్లికూతుళ్లు అనంత్ ఇంటికి ఆమె ద్వారా వెళ్లాలి అనుకుంటారు. అందుకు రమాదేవి గుడి దగ్గర దీపం ఆర్పేసి బామ్మ వస్తుండగా దారిలో నూనె పోసేస్తుంది. బామ్మ ఆ నూనె మీద కాలు వేసి జారి పడిపోతుంది. ఇద్దరూ తల్లీకూతుళ్లు ఏం తెలీనట్లు వెళ్లి పడిపోకుండా పట్టుకుంటారు. బామ్మకి సపర్యలు చేస్తారు. ఊర్వశి బామ్మ కాలికి మర్దన చేస్తుంది. ఊర్వశి చాలా మంచిది అని బామ్మ అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!





















