Ennallo Vechina Hrudayam Serial Today February 5th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ ప్రేమలో పడ్డాడని గోల చేసిన బాల.. త్రిపుర దగ్గర రమాదేవి నాటకం!
Ennallo Vechina Hrudayam Today Episode ఊర్వశి పోగొట్టిన ల్యాప్‌టాప్ గాయత్రీ వల్లే అని రమాదేవి నింద వేయడం ప్రసాద్ నిజం చెప్పడంతో తల్లీకూతుళ్ల బండారం బయట పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode ఊర్వశి వర్షంలో ల్యాప్‌టాప్ వదిలేసిన పాడు చేస్తుంది. దాంతో రమాప్రభ గాయత్రీ మీద నింద వేస్తుంది. త్రిపుర ఎదుట గాయత్రీని తిడుతుంది. వర్షంలో ల్యాప్‌టాప్ వదిలేసింది గాయత్రీనే అని బుకాయించేస్తుంది. త్రిపుర, తాతగారు గాయత్రీ అలాంటిది కాదని చెప్తారు. ఇంతలో రమాప్రభ కొడుకు వచ్చి ఊర్వశి మేడ మీద ల్యాప్ టాప్ చూస్తుంటే నువ్వు పిలిచావ్ కదా అమ్మ అని అంటాడు. అన్నయ్య చూడకపోయి ఉంటే నా మీద నింద వేసేసే వారని గాయత్రీ కోపంగా వెళ్లిపోతుంది. పెద్దాయన కూడా మీరు మారరు అని తిట్టి వెళ్లిపోతాడు.
ఊర్వశి తల్లితో నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు కొత్త ల్యాప్‌టాప్ కావాలని అంటుంది. ఇక బాల తల్లి ఒడిలో పడుకొని ఉంటాడు. బామ్మ పని వాళ్లని బాలని సరిగా చూసుకోలేదని తిడుతుంది. అనంత్‌కి కూడా రెండు అవుతాయి. తర్వాత కన్నయ్యా అని బాలని లేపుతుంది. చెప్పకుండా ఎక్కడికి వెళ్లావని అందరూ బాలని అడుగుతారు. సుందరి తనని కాపాడిందని బాల ఇంట్లో వాళ్లతో చెప్తాడు. సుందరి చాలా గ్రేట్ అని త్రిపుర గురించి చెప్తాడు. సుందరి ఎవరు అని అందరూ ఆలోచిస్తుంటారు. బాల పిన్నీ బాబాయ్ ఇంటికి వస్తుంటే బాల బైక్ డ్రైవింగ్ అంటూ స్పీడ్‌గా వెళ్లి గుద్దేస్తాడు. ఇద్దరూ నొప్పితో అరుస్తారు. మీరు ఎందుకు వచ్చారని బామ్మ వాళ్లని ప్రశ్నిస్తుంది. బాల కోసమే వచ్చామని చెప్తారు.
త్రిపుర దగ్గరకు రమాదేవి వెళ్తుంది. త్రిపుర మీద అతి ప్రేమ చూపించి ఊర్వశికి ల్యాప్‌టాప్ కావాలని అడుగుతుంది. నా జీతం తెలిసి కూడా ఇప్పుడు మళ్లీ ల్యాప్‌టాప్ అంటే ఎలా అని త్రిపుర అంటే రమాదేవి ఏడుస్తూ నాటకం మొదలు పెడుతుంది. గాయత్రీలా ఊర్వశికి పెద్ద చదువు చదివిద్దామనుకున్నా అని కానీ ల్యాప్‌టాప్ కూడా కొనివ్వలేను చదువు ఆపేయమని చెప్తా అని దొంగ ఏడుపు అందుకుంటుంది. త్రిపుర ల్యాప్‌టాప్ కొనిస్తాను అని చెప్పే టైంకి త్రిపుర తాతగారు వచ్చి అడ్డుకుంటారు. మాట ఇచ్చే ముందు నీకు ఉన్న బాధలు తీర్చాల్సిన అప్పులు గురించి ఆలోచించు అని అంటాడు. దాంతో రమాదేవి నేనే కొంటాను అని కూతుర్ని తీసుకొని వెళ్లిపోతుంది.
గాయత్రీ అనంత్ ఇచ్చిన కీ చైన్ చూస్తూ ఉంటుంది. అనంత్ కూడా గాయత్రీని గుర్తు చేసుకుంటాడు. బాల అనంత్ దగ్గరకు వచ్చి అమ్మాయి బాగుందా.. నీకు నచ్చిందా.. అంటే అనంత్ ఊ ఊ అంటాడు. దానికి బాల నువ్వు లవ్‌లో పడ్డావని బాల అంటాడు. ఎవరికీ చెప్పొద్దని అనంత్ బాలని బతిమాలుతాడు. అనంత్ లవ్‌లో పడ్డాడని బాల అరుస్తూ వెళ్తాడు. ఇక గాయత్రీ దగ్గరకు త్రిపుర వస్తుంద. త్రిపుర చేతి గాయం చూసిన గాయత్రీ మందు తీసుకొస్తానని వెళ్తుంది. త్రిపుర బాలని గుర్తు చేసుకుంటుంది. ఇక అనంత్ తండ్రితో ల్యాండ్ గురించి చెప్తే మాకు చెప్పడం లేదని అనంత్ పిన్ని బాబాయ్ అంటారు. ఆస్తులు మీకు అవమానాలు మాకా అని ప్రశ్నిస్తారు. అన్నీ మీరే చేసుకుంటే మాకు హక్కేముంది. నా ఫ్యామిలీ మీ దగ్గర పనోళ్లమా అని నాగభూషణం ప్రశ్నిస్తాడు. దాంతో తల్లి వచ్చి చిన్న కొడుకు మీద కోప్పడుతుంది. పెద్దోడికే సమర్ధత ఉందని అంటుంది. అంతా బాగున్న రోజుల్లో కొంచెం ఆస్తిని పదింతలు చేసింది బాల అని మనం అనుభవిస్తుంది వీడి కష్టాన్ని అని బాలని చూపిస్తుంది బామ్మ. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!





















