ennallo vechina hrudayam serial february 28th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: గాయత్రీ మెడలో అనంత్ తాళి కట్టేస్తాడా.. గాయత్రీ బ్యాగ్‌లో నగ వేసేసిన ఊర్వశి!
ennallo vechina hrudayam today episode గాయత్రీ అనంత్ ప్రేమలో ఉన్నారని తెలుసుకున్న ఊర్వశి అక్కని దొంగ చేయడానికి నగ గాయత్రీ బ్యాగ్‌లో పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

ennallo vechina hrudayam serial today episode అనంత్, గాయత్రీ సైగలు చేసుకోవడం సీక్రెట్‌గా మాట్లాడుకోవడం ఊర్వశి చూస్తుంది. ఏంటి అందరూ గుడికి వచ్చారని అనంత్ అడిగితే మా అక్కకి పెళ్లి అంటుంది. మరి నాతో చెప్పలేదు అంటే నాకు పెళ్లి ఇష్టం లేదు మా అక్కకి ఇష్టం లేదని నాకు కచ్చితంగా తెలుసు అని కానీ ఎవరి బలవంతం వల్లో ఒప్పుకుంటుందని అందుకే పెళ్లి జరగకూడదని మొక్కుతున్నా అని చెప్తుంది. దానికి అనంత్ నేను కూడా మొక్కుకుంటున్నా అంటాడు.
గాయత్రీ: ఏమని..
అనంత్: నీ పెళ్లి త్వరగా అవ్వాలని. అదే మన పెళ్లి త్వరగా అవ్వాలని.
గాయత్రీ: నాకు ఎందుకో భయం వేస్తుంది.
అనంత్: ఎందుకు. (ఊర్వశి తల్లిని పిలిచి వాళ్ల మాటలు వినిపిస్తుంది.)
గాయత్రీ: సిటీ వాళ్లని నమ్మకూడదు ప్రేమించి వదిలేస్తారు. పెళ్లి అంటే వెనకడుగు వేస్తారని చెప్పింది. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోతే.
అనంత్: నా ప్రాణాలు అయినా వదిలేస్తా కానీ నిన్ను వదలను. నా మీద నమ్మకం లేదా.
గాయత్రీ: నమ్మకం కంటే భయం ఎక్కువ ఉంది.
అనంత్: ఉండు ఒక్క నిమిషం అని వెళ్లి చెట్టు దగ్గర ఉన్న తాళి తీసుకొచ్చి గాయత్రీకి కట్టడానికి రెడీ అయిపోతాడు. నమ్మకం లేదన్నావు కదా నిరూపించుకుంటా. ఆగండి నమ్మాను అని గాయత్రీ అంటుంది. నమ్మాను నమ్మాను అని బతిమాలుతుంది.
రమాదేవి: అది పార్ట్ టైం జాబ్ అని చెప్పి చేసేది ఇదా.
ఊర్వశి: నాకు నచ్చిన కోటీశ్వరుడిని అది ఎగరేసుకుపోతుందేమో అమ్మ.
రమాదేవి: అది ముచ్చట పడి తెచ్చుకున్న ఏమైనా నువ్వే తీసుకుంటావ్ కదా ఇతన్నీ నువ్వే దక్కించుకో.
బాల వాళ్లు దండలు గుచ్చుటుంటారు. అమ్మవారి ఊరేగింపు చూసిన బాల పరుగులు పెడతాడు. అందరూ బాల వెనక పడి పరుగులు తీస్తారు. అమ్మవారిని దండం పెట్టుకుంటారు. ఇక ఊర్వశి బాల వాళ్లు లేకపోవడంతో అక్కడికి వెళ్లి వాళ్ల నెక్లెస్ తీసి దాన్ని తల్లికి చూపిస్తూ అమ్మవారికి సమర్పించడానికి తెచ్చినట్లు ఉన్నారు. ఇది గాయత్రీ బ్యాగ్‌లో పడేస్తే దాన్ని అందరి ముందు దొంగని చేసి నేను ఆ కోటీశ్వరుల ఇంటికి కోడలు అయిపోవచ్చని అనుకుంటుంది. అక్కాచెల్లెళ్లు నిల్చొని ఉంటే సీక్రెట్‌గా ఆ నగని ఊర్వశి గాయత్రీ బ్యాగ్‌లో వేస్తుంది.
బాల ఫ్యామిలీ మళ్లీ వచ్చి నగ లేకపోవడం గుర్తిస్తారు. అందరూ షాక్ అయిపోతారు. మొత్తం వెతుకుతారు. ఊర్వశి, రమాదేవి వాళ్లు వెళ్లి కావాలనే మాట్లాడుతారు. బాల పిన్ని బాబాయ్‌తో మీరే తీశారా వచ్చినప్పటి నుంచి మీరు అదోలా చూస్తున్నారని అంటాడు. అందరూ అనొద్దని బామ్మ చెప్తుంది. రమాదేవి అనంత్ వాళ్ల ఫ్యామిలీతో కచ్చితంగా దొంగలు అయింటారని చెప్పి కూతురితో పోలీసులకు ఫోన్ చేయిస్తుంది. పోలీసులు వచ్చి అందరినీ వెతుకుతారు. త్రిపుర గాయత్రీ బొట్టు తుడిచి బ్యాగ్‌లో నగ చూస్తుంది. ఏంటి ఇది అని గాయత్రీని అడుగుతుంది. గాయత్రీ షాక్ అయిపోతుంది. అక్కా మన బ్యాగ్‌లో ఇది ఉందేంటి పోలీసులు వెతుకుతున్నది ఇదే అంటుంది. మన వెనక ఏదో జరుగుతుందని గాయత్రీతో త్రిపుర అంటుంది. దానికి గాయత్రీ అక్క ఏం తప్పు చేయకున్నా మనం దొరికిపోయేలా ఉన్నాం అంటుంది.
గాయత్రీ దగ్గరకు పోలీసులు వచ్చి బ్యాగ్ చెక్ చేస్తారు. గాయత్రీ దొరికిపోయిందని ఊర్వశి అనుకుంటుంది. కానీ పోలీసులు బ్యాగ్ చెక్ చేసి తిరిగి ఇచ్చేయడంతో షాక్ అవుతారు. ఫ్యాష్ బ్యాగ్‌లో గాయత్రీ బ్యాగ్‌లో త్రిపుర తీసి తన చీరలో దాచేస్తుంది. తర్వాత ఆ నగని అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే అక్కడికి వెళ్లి అమ్మవారి మెడలో వేస్తుంది. బాల తండ్రి ఫ్యామిలీతో అమ్మవారి నగ ఎక్కడికీ పోదు అమ్మవారే కాపాడుకుంటుందని అంటారు. ఇక బాల దండ గుచ్చేస్తాడు. నీ చేతులతో అమ్మవారికి వేయాలి అంటే నేనే వేస్తా నా వెంట ఎవరూ రావొద్దని బాల వెళ్తాడు. అమ్మవారి మెడలో వేస్తానని వెళ్తూ ఊరేగింపులో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్లి దండం పెడతాడు. దాంతో ఆ దండకు నగ అతుక్కుంటుంది. తర్వాత త్రిపుర నగ లేకపోవడం చూసి షాక్ అయి మొత్తం వెతుకుతుంది. దేవా అమ్మవారి మెడలో దండ వేస్తాడు. అందులో నగ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!





















