Dhee Latest Promo: అమ్రీష్ పూరి మాంత్రికుడి గెటప్‌లో 'హైపర్' ఆది - కంట తడి పెట్టిన పూర్ణ
ప్రతి బుధవారం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ‘ఢీ ప్రీమియర్ లీగ్’ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. మాత్రికుడి గెటప్‌లో ఆది కామెడీ పండించగా, పూర్ణ ఎమోషనల్ తో కంటతడి పెట్టుకుంది.
డ్యాన్స్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే టీవీ షో ‘ఢీ ప్రీమియర్ లీగ్’. ప్రతి బుధవారం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజా ఎంపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో హైపర్ ఆది మాంత్రికుడి గెటప్ ఆకట్టుకుంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో అమ్రీష్ పురి తరహాలో ఆయన గెటప్ వేశారు. డ్యాన్సర్లంతా అదిరిపోయే పెర్ఫామెన్స్‌లతో దుమ్మురేపారు. సెప్టెంబర్ 20న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మాంత్రికుడిగా కామెడీ పంచిన హైపర్ ఆది
ప్రోమో మొదలు కాగానే హైపర్ ఆది విలన్ అమ్రీష్ పురి గెటప్ లో కనిపించాడు. భంకరమైన మాంత్రికుడిగా దర్శనం ఇచ్చాడు. ఎర్ర పంచెలో అచ్చం అమ్రీష్ పురి మాదిరిగానే వెరైటీ గుండు, మెడకు పూసల దండలు, కుడి చేతిలో నిమ్మకాయ, ఎడమచేతిలో మంత్ర దండం పట్టుకుని కనిపించాడు. “నిన్ను సీసాలో బంధించి, మల్లెపూలలో మంత్రించి, నా వశం చేసుకుంటాను. ఏదో శక్తి నాకు అడ్డు పడుతుంది” అంటూ శేఖర్ మాస్టర్ వైపు చూపిస్తాడు. ఆ శక్తి శేఖర్ మాస్టరేనని భావించి అందరూ నవ్వుతారు.
ఫర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన డ్యాన్సర్లు
ఇక ఆ తర్వాత డ్యాన్సర్లంతా అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ తో దుమ్మురేపారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అద్భుతంగా అలరించారు. కొత్త స్టెప్పులతో ఢీ షో స్టేజిని షేక్ చేశారు. గణపతి పాటకు డ్యాన్సర్లు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తీన్మార్ దరువుకు షో న్యాయ నిర్ణేతలు పూర్ణ, శేఖర్ మాస్టర్, యాంకర్ ప్రదీప్ సహా అందరూ కలిసి స్టేజి మీద వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి. లేటెస్ట్ ప్రోమోలో వీరి డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఇక ఫుడ్ లేక ఇబ్బంది పడేవారు, ఫుడ్ ను వేస్ట్ చేసే వారిని కంపార్ చేస్తూ డ్యాన్సర్లు చూపించిన ప్రదర్శన వారెవ్వా అనిపించింది.
Read Also: బుల్లెట్ భాస్కర్‌ను అన్నయ్యా అని పిలిచిన హీరోయిన్ - అసలు విషయం తెలిసి షాకైన వేణు!
కంటతడి పెట్టిన పూర్ణ
ఇక ఒకప్పుడు బిక్షగాడిగా ఉంటూ, చెత్తకుప్పలో మిగిలిపోయిన ఎంగిలి మెతులకులను తింటూ దుర్భర జీవితాన్ని గడిపిన ఓ వ్యక్తిని ఢీ షో స్టేజి మీదికి తీసుకొచ్చారు. కొందరు యువతీ యువకులు అతడిని దత్తత తీసుకుని చక్కటి జీవితాన్ని గడిపేలా చేస్తున్నారు. వారి గొప్పమనసుకు ఢీ షో అభినందనలు చెప్పింది. ఓ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరినీ స్టేజి మీద పరిచయం చేయడం ప్రోమోలో హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా జడ్జి పూర్ణ ఎమోషనల్ అయ్యింది. పిల్లలు తమ తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకోవాలని చెప్పింది. మనకు జీవితాన్ని ఇచ్చిందే వాళ్లని గుర్తుపెట్టుకోవాలన్నది. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లగొట్టకూడదని చెప్పింది. ఇప్పటి వరకు ఎవరైనా అలా చేసినా, మళ్లీ వారిని వెనక్కి తీసుకొచ్చుకోవాలని చెప్పింది. ఈ సందర్భంగా పూర్ణ కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial