అన్వేషించండి

Dinesh Phadnis : CID సీరియల్ నటుడు ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూసిన ‘ప్రణీత్’

Dinesh Phadnis : బాలీవుడ్ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిస్ డిసెంబర్ 4న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.

Bollywwod Serial Actor Dinesh Phadnis Death : ప్రముఖ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నెస్ (Dinesh Phadins) కన్నుమూశారు. ఫేమస్ సీరియల్ సీఐడీ(CID) లో ఫెడ్రిక్స్ అలియాస్ ప్రణీత్ అనే పాత్రలో సుమారు 20 ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన ఈయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరిన దినేష్ ఫడ్నిస్ శనివారం నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నారు. మొదట్లో అతనికి హార్ట్ ఎటాక్ (Heart Attack) రావడం వల్ల హాస్పిటల్లో చేరారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అది నిజం కాదని దినేష్  సహనటుడు దయానంద్ శెట్టి (Dayanand Shetty) చెప్పారు.

దినేష్ ఫడ్నిస్ హాస్పిటల్ లో చేరాడని, పెంటిలేటర్ పైనే ఉన్నాడని, డాక్టర్లు అతన్ని పరిశీలిస్తున్నారని, అతనికి హార్ట్ ఎటాక్ రాలేదని, వేరే చికిత్స నడుస్తోందంటూ శనివారం రోజు  వెల్లడించారు. పాపులర్ క్రైమ్ సీరియల్ సీఐడీ(CID) లో సీనియర్ ఇన్స్పెక్టర్ దయా పాత్రలో దయానంద్ శెట్టి నటించారు. 1998 నుంచి 2018 వరకు 20 ఏళ్ల పాటు సీఐడీ(CID) సీరియల్ టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సీరియల్ ఎంతో ఆసక్తితో వీక్షించేవారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో డిఫరెంట్ కేసుని సాల్వ్ చేస్తూ ప్రేక్షకులను ఈ షో ఎంతగానో అలరించింది. టీవీ సీరియల్ లో ఫెడ్రిక్స్ పాత్రలో దినేష్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని నవ్వించారు.

ఇండియన్ టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం సాగిన టీవీ షోలలో సీఐడీ(CID) కూడా ఒకటి. ఇందులో దినేష్ పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. సీఐడీ(CID) సీరియల్ లో నటించడంతో పాటు ఇందులో కొన్ని ఎపిసోడ్లకు దినేష్ రచయితగాను వ్యవహరించడం విశేషం. అంతేకాకుండా బాలీవుడ్ మరో టీవీ షో 'తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా' లోను అతిధి పాత్రలో కనిపించారు దినేష్. అలాగే సర్ఫరోష్, సూపర్ 30 లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఓ మరాఠి సినిమాకు రచయితగా కూడా పనిచేశారు. అలాంటి ఈయన అనారోగ్య కారణాలతో కన్నుమూయడం బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ ప్రముఖులు దినేష్ మరణం జీర్ణించుకోలేకపోతున్నారు.

సీఐడీ(CID) సీరియల్ ముగిసిన తర్వాత దినేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉన్నారు. చాలా రోజులుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న దినేష్ ఆకస్మిక మరణం అభిమానులను ఎంతగానో బాధిస్తుంది. ఆయన మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కేవలం 57 ఏళ్ల వయసులోనే దినేష్ మరణించడం కుటుంబ సభ్యులను ఎంతగానో కలచివేస్తోంది. కాగా మంగళవారం బోరివలి తూర్పులోని దౌలత్ నగర్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

Also Read :'మిగ్‌జాం' తుఫాన్, మీలా మేం సేఫ్ కాదు - అధికారులు, ఎమ్మెల్యేలూ బయటకు రండి, ప్రజలకు సాయం చెయ్యండి : కోలీవుడ్ హీరో విశాల్ ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
Vanilla Flavoring : వెనిల్లా ఫ్లేవర్​ను జంతువుల షిట్​తో చేస్తారట.. దీని గురించి షాకింగ్, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
వెనిల్లా ఫ్లేవర్​ను జంతువుల షిట్​తో చేస్తారట.. దీని గురించి షాకింగ్, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
Embed widget