Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 28th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో పిల్లల రామాయణం.. భాస్కర్ గురించి తెలుసుకున్న లక్ష్మీకి మనీషాపై డౌట్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode అర్జున్ భాస్కర్‌కే యాక్సిడెంట్ అయిందని లక్ష్మీతో చెప్పడం లక్ష్మీ మనీషానే చేయించుంటుందని ఏదో నిజం ఉందని ఆలోచించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ అర్జున్‌తో మాట్లాడుతుంది. డీఎన్ఏ టెస్ట్‌కి ఎందుకు ఒప్పుకున్నావని అండుగుతాడు. దాంతో లక్ష్మీ అర్జున్‌తో తనని మనీషా వాళ్లు ఎలా అయినా పంపించేయాలి అని చూస్తున్నారని, జున్ను కోసం జాను,వివేక్‌ల పెళ్లి కోసం అత్తయ్య గారి కోసం తాను ఇక్కడ ఉండక తప్పదని లక్ష్మీ అంటుంది. అందుకే వాళ్లు ఎన్ని మాటలు అన్నా పడతాను అని ఎన్ని అవమానాలు ఎదురైనా పడతానని లక్ష్మీ అంటుంది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మంచి స్నేహితుడిగా తోడు ఉన్నందుకు అర్జున్‌కి థ్యాంక్స్ చెప్తుంది.
ఉదయం అరవింద దేవుడి దగ్గర లక్ష్మీకి ఇన్ని కష్టాలు ఎందుకని సీతమ్మలా అగ్ని పరీక్ష పెడుతున్నారెందుకని బాధపడుతుంది. ఇంతలో జున్ను, లక్కీలు రామాయణంలోని లవకుశుల్లా తయారై దేవుల్లే మెచ్చింది మీ ముందే జరిగింది అని పాటకు డ్యాన్స్ చేస్తారు. అందరూ వారి గెటప్‌లు చూసి చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ఎందుకు ఇలా రెడీ అయ్యారని అడిగితే స్కూల్లో కాంపిటేషన్ ఉందని పిన్ని, బాబాయ్‌లు ఇలా రెడీ చేశారని అంటారు.
అరవింద: నీకు లవకుశుల గురించి ఎలా తెలుసు జున్ను.
జున్ను: నేను అమ్మ బాబా వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు బాబా వాళ్ల అమ్మ రోజూ నాకు రామాయణం చదివి వినిపించేది. సీత రాముల కథ చెప్పేది. రాముడు ప్రజల మాట విని సీతమ్మని అడవులకు పంపాడు. అక్కడే సీతమ్మకి లవకుశలు పుట్టారు. ఆ విషయం రాముడికి తెలీదు. (జున్ను మాటలకు మిత్ర, లక్ష్మీ పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటాయి)
లక్కీ: రాముడు ఎందుకు నాన్న సీతమ్మని అనుమానించాలి అడవులకు ఎందుకు పంపాలి. పాపం సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది.
దేవయాని: మనీషాతో ఏంటి రామాయణం ఈ ఇంట్లో జరుగుతుంది. మిత్ర రాముడు. లక్ష్మీ సీత జున్ను, లక్కీలు లవకుశలు. నువ్వు సూర్ఫణకు అన్నట్లు చెప్తున్నారు.
అరవింద: మన ఇంట్లో కూడా రామాయణం జరుగుతుంది. ఆ లవకుశల్లా మీరు కూడా ఓ జంటని కలపాలి. ఆ నాటి రామాయణం మళ్లీ మన ఇంట్లో పునరావృతం అవ్వాలి.
లక్ష్మీ కిచెన్‌లో ఉంటే మనీషా వచ్చి పిల్లల పేరుతో మంచి ప్లానే చేశావని నువ్వు పెద్ద సెలెంట్ కిల్లర్ అని అంటుంది. తానేం చేయలేదని లక్ష్మీ అంటుంది. నీ బతుకు అంతా ఇంతేనా అని అందరినీ చీట్ చేస్తుంటావా అని మనీషా అడుగుతుంది. దానికి లక్ష్మీ ఏంటి ఎవరు చీట్ చేసింది నిన్న నువ్వు అన్న మాటలకు నిన్న కొట్టాల్సింది కానీ నా సంస్కారం ఆపిందని అంటుంది. నువ్వు తప్పులు చేసిన ప్రతీ సారి నిన్ను కొట్టుండాల్సిందని అంటుంది.
మరోవైపు జాను, వివేక్‌లు పిల్లల్ని పట్టుకొని ఇంట్లో పరిస్థితులకు మీ గెటప్‌లు చాలా బాగా కుదరియని అంటారు. తమని అలా రెడీ చేసినందుకు మాకు ఏం గిఫ్ట్ ఇవ్వరా అని వివేక్ అడుగుతాడు. దానికి ఏం కావాలని జున్ను అడిగితే చిన్న ముద్దు ఇవ్వండని అడుగుతారు. లక్కీ జానుకి, జున్ను వివేక్‌కి ముద్దు పెట్టడానికి వెళ్తారు. ఈ లోపు లక్ష్మీ పిల్లల్ని పిలవడంతో సరిగ్గా అప్పుడే వాళ్లు జరగానే జాను, వివేక్ అనుకోకుండా లిప్ కిస్ పెట్టుకుంటారు.
మరోవైపు భాస్కర్ తన ఇంటికి వెళ్లి తన భార్య సుధతో మరో ప్రాంతానికి వెళ్లిపోదాం మనీషా నన్ను వదిలి పెట్టడని అంటాడు. మిత్ర, లక్ష్మీలు కలిసిపోయారని మీరు అంటున్నారు అయినా మిమల్ని మనీషా వెంటాడుతుందంటే వాళ్లకి తెలియాల్సిన నిజం ఏదో ఉందని అంటుంది. ఇక అర్జున్ యాక్సిడెంట్ అయిన పర్సన్ ఎవరూ అని ఆలోచిస్తాడు. చివరకు తను గతంలో లక్ష్మీ గురించి ఆరా తీసిన విషయం గుర్తు చేసుకుంటాడు. వెంటనే లక్ష్మీకి కాల్ చేసి అతను నాకు ముందే తెలుసని ఒక రోజు స్కూల్‌లో మీ గురించి అడిగిన వ్యక్తి అని చెప్తాడు. దాంతో లక్ష్మీ అతను భాస్కర్ అని అనుకుంటుంది. తన కోసమే వచ్చుంటాడని అంటుంది. నీ కోసం వచ్చిన వ్యక్తిని ఎవరో బంధించారని అంటాడు. దాంతో లక్ష్మీ మనీషానే చేయించుంటుందని ఆయన ఏదో నిజం నాకు చెప్పకుండా ఆపుతుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్ కథలో ఒక్కో సీన్ క్లైమాక్సే.. ఇంటిళ్లపాది ఏడుపులు.. అయ్యో అనాల్సిందే!