Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 12th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: దివాలాకు రెడీగా ఉన్న మిత్ర కంపెనీ.. లక్ష్మీతో చేతులు కలపక తప్పదన్న జయదేవ్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర కంపెనీ నష్టాల్లో ఉండటంతో జేఎమ్మార్ ప్రాజెక్ట్ లక్ష్మీ, అర్జున్లతో కలిసి చేయమని మిత్రకు జయదేవ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 12th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: దివాలాకు రెడీగా ఉన్న మిత్ర కంపెనీ.. లక్ష్మీతో చేతులు కలపక తప్పదన్న జయదేవ్! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today september 12th episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 12th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: దివాలాకు రెడీగా ఉన్న మిత్ర కంపెనీ.. లక్ష్మీతో చేతులు కలపక తప్పదన్న జయదేవ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/12/7ccc28ef2f14560ef82a05905c8283931726105119134882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర వారసుడిగా జున్నుకి కూడా గండం రాబోతుందని దీక్షితులు గారు లక్ష్మీ, అరవిందలతో చెప్తారు. భర్తని కాపాడుకున్నట్లు కొడుకుని కూడా కాపాడుకోవాలని చెప్తారు. మిత్ర, లక్ష్మీ, జున్నులు కలిసి పూజ చేయాలని దీక్షితులు గారు చెప్తారు. లక్ష్మీ ఏడుస్తుంది.
లక్ష్మీ: నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. అప్పుడు ఆయన ఇప్పుడు జున్ను.
దీక్షితులు: నీ ఓర్పుని దేవుడు పరీక్షిస్తున్నాడు.
అరవింద: ఇన్నాళ్లు భర్తని కాపాడుకొని మంచి భార్యవి అయ్యావు. ఇప్పుడు కొడుకుని కాపాడుకొని గొప్ప తల్లి అవ్వాలి. వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కొవాలి.
జయదేవ్ ఫైల్స్ చూసి మేనేజర్లని తిడతాడు. కంపెనీ పేమెంట్స్ సరిగా లేవని తిడతాడు. దాంతో మేనేజర్లు మిత్ర ఆఫీస్‌కు రావడం లేదని అందుకే ఇంటికి వచ్చామని అంటారు. ఇక అక్కడున్న వివేక్‌ని కూడా జయదేవ్ తిడతాడు. నీకు మీ అన్నయ్యకి కంపెనీ అప్పగిస్తే ఇలా చేస్తారా అని తిడతాడు. ఇంతలో మిత్ర వస్తే జయదేవ్ మిత్రని కూడా తిడతాడు. మిత్రకి ఫైల్స్ చూపించి కంపెనీ దివాలా తీయడానికి రెడీగా ఉందని జయదేవ్ తిడతాడు. ఏదో ఒకటి చేస్తాను టెన్షన్ అవ్వొద్దని మిత్ర తండ్రికి చెప్తాడు.
జయదేవ్: దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది. జేఎమ్మార్ ప్రాజెక్ట్‌ని నువ్వు టేక్ అప్ చేయడం. రేయ్ ఏంటి అలా చూస్తున్నావ్ నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా.
మిత్ర: లేదు డాడ్ కానీ ఇది వద్దు.
జయదేవ్: ఏ అర్జున్ లక్ష్మీలతో కలిసి పని చేయాల్సి వస్తుందనా.
మిత్ర: అది నాకు ఇష్టం లేదు.
జయదేవ్: నీ ఇగోతో కంపెనీ నష్టం పూడ్చలేవు కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుంది. రేయ్ కన్నతండ్రిగా నీ మంచి కోరి నువ్వు ఆ ప్రాజెక్ట్ తీసుకోవాల్సిందే వేరే దారి లేదు.
మిత్ర కోపంగా వెళ్లిపోతాడు. ఇక మేనేజర్లకు మనం ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాం అని అంటాడు. ఇక మిత్ర ప్రాజెక్ట్ చేస్తాడని లక్ష్మీ, మిత్రలు కలవకుండా నువ్వు చేయాలని దేవయాని మనీషాతో చెప్తుంది. లక్ష్మీ దీక్షితులు గారి మాటలు తలచుకొని ఏడుస్తుంది. మరోవైపు మిత్ర ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడు. ప్రాజెక్ట్ చేయనని లక్ష్మీ, అర్జున్లతో చెప్పాను ఇప్పుడు మళ్లీ ఎలా వాళ్ల ప్రాజెక్ట్‌లో చేరాలి అని మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మీ జున్ను కోసమైనా మిత్రని పూజలో కూర్చొమని ఒప్పించాలని అనుకుంటుంది. కంపెనీ కోసం వాళ్లతో కలిసి పని చేయడం తప్పదని కంపెనీని నిలబెట్టాలని మిత్ర అనుకుంటాడు. మిత్ర దగ్గరకు మనీషా వస్తుంది.
మనీషా: ఏంటి మిత్ర అంకుల్ నీకు సలహాలు ఇస్తున్నారు. ఆయనకు ఏం తెలుసని నీకు చెప్తున్నారు.
మిత్ర: ఆయనకంటే నీకు ఎక్కువ తెలుసా మనీషా. కంపెనీ గురించి నీకు ఏం తెలుసు చెప్పు. మా నాన్నకి అంతా తెలుసు. కంపెనీ మూడు నెలల నుంచి లాస్‌లో ఉందని తెలుసు. కంపెనీ నిలబెట్టాలని ఆయన నాకు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాకూడదని జేఎమ్మార్ ప్రాజెక్ట్‌కి వెళ్లాను.
మనీషా: ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తీసుకుంటావా లక్ష్మీ దగ్గరకు వెళ్తావా అర్జున్తో చేతులు కలుపుతావా.
మిత్ర: కంపెనీ కోసం తప్పదు. జేఎమ్మార్‌తో కలుస్తా. నీ దగ్గర వేరే ఆప్షన్ ఉంటే చెప్పు. నీ దారిలో నడుస్తా.
మనీషా: సరే మిత్ర ఆలోచించి చెప్తా.
మిత్ర: ఏదైనా త్వరగా చెప్పు.
మనీషా: ఈలోపు నువ్వు తొందర పడి రాంగ్ నిర్ణయం తీసుకోకు
మిత్ర: సరే.
లక్ష్మీ, అరవింద ఇంటికి వస్తారు. జాను ప్రాజెక్ట్ గురించి జేఎమ్మార్ కాల్ చేశారని చెప్తే లక్ష్మీ వాటి గురించి ఆలోచించే పరిస్థితిలో లేదని అరవింద చెప్తుంది. లక్ష్మీని చూసి జానుతో పాటు వివేక్, జయదేవ్‌లు విషయం అడిగితే గండం గురించి అరవింద చెప్తుంది. దీక్షితులు గారు చెప్పింది మొత్తం వాళ్లకి చెప్తుంది. మిత్ర వ్యాపారమే కలిసి చేయను అన్నాడని పూజ ఎలా చేస్తాడని అంటాడు. కంపెనీ కొడుకు ఒకటి కాదని కన్న కొడుకు కోసం మిత్ర పూజలో కూర్చొలేడా అని అరవింద అంటుంది. అందరూ కలిసి మిత్రని ఒప్పించాలి అని అనుకుంటారు. ఇక జయదేవ్ కంపెనీ గురించి లక్ష్మీకి చెప్తుంది. కంపెనీ మూత పడనివ్వనని జున్నుని కాపాడుతాను అని అందుకు మిత్రతో మాట్లాడుతాను అని లక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనక మహాలక్ష్మిని పని మనిషి అంటూ అవమానించిన అంబిక, పద్మాక్షి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)