Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 3rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: డీఎన్ఏ టెస్ట్ కోసం లక్ష్మీ, జున్నులను తీసుకెళ్లిన మనీషా, చూస్తూ ఉండిపోయిన మిత్ర!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జున్నుకి డీఎన్‌ఏ పరీక్ష చేయడానికి మనీషా తీసుకెళ్లడం మిత్ర చూసి కూడా ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను జరిగినదంతా తలచుకొని బాధపడుతూ ఉంటుంది. జానుని వివేక్ చూసి అక్కడికి వెళ్తాడు. వివేక్ జానుకి సారీ చెప్తాడు. ఆ తల్లికి కొడుకుగా పుట్టడమే నేను చేసిన తప్పు అని ఇదంతా మా అమ్మే చేసిందని జానుతో చెప్తాడు. నువ్వు లాక్ అయిన హోటల్ బయట మా అమ్మని చూశానని వివేక్ చెప్తాడు. జాను షాక్ అయిపోతాడు. మరోవైపు జాను వివేక్‌ల మాటలు దేవయాని చాటుగా ఉంటుంది.
జాను: అంత తప్పు నేనేం చేశాను వివేక్.
వివేక్: నన్ను ప్రేమించడమే ఆవిడ దృష్టిలో నువ్వు చేసిన తప్పు. నీ మంచితనం ఓర్పే ఇంత వరకు తీసుకొచ్చింది. అందుకే బాగా ఆలోచించి నేను ఓ నిర్ణయం తీసుకున్నా.
జాను: దేని గురించి
వివేక్: మన పెళ్లి గురించి. నీకు మీ అమ్మకి సెట్ అవ్వడం లేదు నేను మా అమ్మతో గొడవ పడలేను. ఇప్పటి వరకు జరిగింది మొత్తం వదిలేద్దాం అనుకుంటున్నా.
దేవయాని: అంటే ఏంటి వీడి ఉద్దేశం.
జాను: మనసులో వివేక్ నన్ను వదిలేయాలి అనుకుంటున్నావా.
వివేక్: నా పెళ్లి విషయంలో నేను ఓ నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయం నీకు మా అమ్మకి ఇష్టం లేకపోయినా సరే నేను నా నిర్ణయం తీసుకున్నా. మనసులో నేను జానుని పెళ్లి చేసుకుంటా కానీ పెళ్లి చేసుకునే వరకు జానుకి ఈ విషయం చెప్పను.
జాను: నీ ఇష్టం వివేక్ నేను నీకు ఎదురు చెప్పను.
దేవయాని: వీడేం చేయబోతున్నాడు.
మనీషా, దేవయానిలు లక్ష్మీ దగ్గరకు వచ్చి నిన్ను సవాలు చేశావ్ ఈ రోజు పక్కకు తప్పుకున్నావ్ అని అడుగుతుంది. లక్ష్మీ ప్రాణం పోయినా మాట తప్పదని అంటుంది. దాంతో మనీషా డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకున్నా వెళ్దామా అని అడుగుతుంది. లక్ష్మీ రెడీ అని అంటుంది. జున్ను కూడా వచ్చి అమ్మ ఎక్కడికో వెళ్దామని అన్నావ్ నేను రెడీ అంటాడు. నా కొడుకు వారసత్వం, రక్తాన్ని అనుమానించారని మీకు తగిన బుద్ధి చెప్తానని లక్ష్మీ అంటుంది. ఇక మనీషా ఇంకా రెచ్చిపోయి నిన్ను ఇంటి నుంచి గెంటే వరకు వదలను నీ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తా అంటుంది. దీంతో లక్ష్మీ మనీషా చెంప పగలగొడుతుంది. ఇక అందరూ కలిసి జున్నుకి డీఎన్ఏ టెస్ట్ చేయడానికి హాస్పిటల్‌కి బయల్దేరుతారు. మిత్ర అదంతా చూసి కూడా మౌనంగా ఉంటాడు. లక్ష్మీ మిత్ర ఒకర్ని ఒకరు చూసుకుంటారు. లక్ష్మీ మనసులో ఇప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నారేంటి అండీ అనుకుంటుంది.
జున్ను: నాన్న నేను అమ్మ మనీషా ఆంటీ బయటకు వెళ్తున్నాం మీరు వస్తారా.
మనీషా: మిత్ర అలాంటి చోటుకి రాడులే.
జున్ను: అలాంటి చోటు అంటే. మిత్ర రావాల్సిన అవసరం లేదు తనకు రిజల్టే ముఖ్యం కారెక్కు లక్ష్మీ.
లక్ష్మీ: పద జున్ను.
అరవింద: ఏంటి మిత్ర లక్ష్మీని ఆపలేకపోయానని బాధ పడుతున్నావా లేక మనీషాని సమర్దిస్తున్నావా. మనీషా మీ బంధాన్ని అనుమానిస్తుంది. నీ రక్తాన్ని అవమానిస్తుంది. నీ వారసత్వాన్ని పరీక్షిస్తుంది. నీకు చీమ కుట్టినట్టు అయినా లేదా నీ మనసు చలించడం లేదా.
మిత్ర: తప్పు చేసిన తనని వదిలేసి నన్ను అంటావేంటి అమ్మ.
అరవింద: తప్పు తప్పు తనేం తప్పు చేసిందిరా. నీ కోసమే ఉంటున్న లక్ష్మీ ఏం తప్పు చేసిందిరా ఏం నేరం చేసిందిరా. సీతమ్మ అగ్ని పరీక్ష విన్నాం కానీ ఇప్పుడు లక్ష్మీ శీల పరీక్షను చూస్తున్నాం. నందన్ కోడలు వారసుడు నిందతో బయటకు వెళ్లారండి. మిత్ర వాళ్ల మీద పడ్డ నింద నిజం కాదని నీకు తెలుసు కానీ మౌనంగా ఉన్నావ్. తను ఎదుర్కోబోయే పరీక్ష కన్నా నీ మౌనమే లక్ష్మీని అంత బాధ పెడుతుందని నీకు తెలుసా. మిత్ర జీవితంలో మగాడికి భార్యని మించిన ఆస్తి లేదు సంతానానికి మించిన సంతోషం లేదు. ఆ రెండింటిని నిర్లక్ష్యం చేస్తే సంతోషంగా ఉండలేదు. తప్పు చేస్తున్నావ్ మిత్ర కట్టుకున్న భార్యని కన్న కొడుకుని బాధ పెడుతూ తప్పు చేస్తున్నావ్. దీని వల్ల నువ్వు చాలా కోల్పోతావ్.
మిత్ర: మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు నాన్న ఏదో ఒకటి చెప్పండి అమ్మ నన్ను తిట్టి వెళ్లిపోయింది. లక్ష్మీ చేసిన తప్పులు మాత్రమే నాకు కనిపిస్తుంది.
జయదేవ్: మిత్ర నువ్వు లక్ష్మీ తప్పు చేసిందని విన్నావ్. కళ్లతో నిజాన్ని చూడలేదు అందులో అర్థం నువ్వే వెతుక్కో.
మనీషా, లక్ష్మీలు జున్నుని తీసుకొని హాస్పిటల్‌కి వస్తారు. జున్ను హాస్పిటల్‌కి ఎందుకొచ్చామని అడిగితే లక్ష్మీ ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. లక్ష్మీ ఫార్మ్ నింపుతూ ఏడుస్తుంది. జున్నుకి తల్లిగా తన పేరు రాసి తండ్రి పేరు రాయడానికి చాలా బాధపడుతుంది. మరోవైపు దేవయాని కూతురు సంజన ఇంటికి వస్తుంది. అన్నయ్య ఏదో విషయం మాట్లాడాలి రమ్మన్నాడు అని దేవయానితో చెప్తుంది. సంజన వివేక్ దగ్గరకు వెళ్తుంది. సంజన వచ్చి అమ్మ నిన్ను ఓదార్చమంది ఏమైందని అడుగుతుంది. దాంతో వివేక్ జానుకి జరిగిన అవమానం గురించి సంజనతో చెప్తాడు. సంజన షాక్ అయిపోతుంది. ఇదంతా అమ్మ చేయించిందా అని సంజన షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది..