Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 26th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: తల్లిదండ్రుల్ని ఒకటి చేయడానికి ఏ ఛాన్స్ వదలని పిల్లలు.. మండిపోతున్న మనీషా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మిత్రలను ఒకటి చేయాలని పిల్లలు స్వీట్స్ తినిపించుకోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode నువ్వు చేసిన మంచే నీకు మంచి చేసిందని అర్జున్ లక్ష్మీతో అంటాడు. వివేక్ కూడా కరెక్టే అంటే ఇద్దరూ కలిసి నన్ను మునగ చెట్టు ఎక్కించొద్దని లక్ష్మీ అంటుంది. కంపెనీని మళ్లీ నిలబెట్టినందుకు అర్జున్‌కి థ్యాంగ్స్ చెప్తుంది. ఇక కాఫీ తాగుదామని అంటే అర్జున్ ఇప్పుడు టైం లేదు తర్వాత తాగుతా అని చెప్పి వెళ్లిపోతాడు. ఇక వివేక్ అర్జున్ గారు, జేఎమ్మార్ గారు నీ వెనక నిల్చొడానికి నీ గొప్పతనమే కారణం వదినా అంటాడు. లక్ష్మీ ఇది తన విజయం కాదని మిత్ర విజయం అంటుంది.
దేవయాని: అనుకున్నది ఒకటి అయింది ఒకటి నువ్వేదో చేయాలి అనుకుంటే ఆ లక్ష్మీ ఇంకేదో చేసింది.
మనీషా: ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు ఆంటీ మన షేర్స్‌లో అర్జున్‌గారి షేర్లు జేఎమ్మార్ గారి షేర్లు కలుస్తాయని నేను అస్సలు ఊహించలేదు.
దేవయాని: నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు మనీషా.
మనీషా: లక్ష్మీకి అందరూ సాయం చేస్తున్నారు ఆంటీ నా పెళ్లి విషయంలో పిల్లలు ఇప్పుడు అర్జున్ గారు జేఎమ్మార్ గారు నేనేం చేయాలి ఆంటీ.
దేవయాని: ముందు సరయుని అనలా ఇదంతా లక్ష్మీ చేకచక్యం కాదు ముందు ఆ సరయుని తిట్టి నీ కోపం తగ్గించుకో తర్వాత అయినా సరిగ్గా పని చేస్తుంది.
సరయు దగ్గరకు ఆమె పీఏ వచ్చి మీ నాన్న గారు ఎంతో ఆలోచించి చేసేవారు కానీ మీరు మాత్రం ఆ మనీషా చెప్పిందని లక్ష్మీ గారికి ఎదురెల్లారు అని అంటాడు. ఇంతలో మనీషా కాల్ చేస్తే ఇప్పటి వరకు నీతో అనిపించుకున్నాను ఇప్పుడు ఈ మనీషాతో అనిపించుకోవాలి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. జరిగింది మనీషాకు చెప్తుంది. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశానని సరయు చెప్తుంది. అయినా మనీషా తిడుతుంది. ఇంత దారుణంగా ఫైయిల్ అవుతామని అనుకోలేదని అంటుంది. అందరి ముందు లక్ష్మీ హీరో అయిపోయిందని అంటుంది. ఇక సరయు దీన్ని ఇంతటిలో వదలను నా ఫ్రెండ్ మనీషాకు మిత్రని కానుకగా ఇస్తానని చెప్తుంది.
లక్ష్మీ, వివేక్ ఇంటికి వస్తారు. జున్ను, లక్కీలు పరుగున వచ్చి టీవీలో చూశానమ్మా చాలా బాగున్నావని అంటారు. ఇక జయదేవ్, అరవిందలు లక్ష్మీని పొగుడుతారు. ఆంజనేయ స్వామి అమ్మవారికి హెల్ప్ చేశారని పిల్లలు అంటారు. ఇక జాను హారతి తీసుకొని వస్తే అరవింద ఆపి తానే లక్ష్మీకి దిష్టి తీస్తుంది. దూరం నుంచి మనీషా, దేవయాని చూసి మరీ ఓవర్ చేస్తున్నారని అంటుంది. ఇక పిల్లలు మిత్రని తీసుకొచ్చి లక్ష్మీకి థ్యాంక్స్ చెప్పాలి అంటారు. దేవయాని, మనీషాలు లక్ష్మీ పొగడ్తలు విని తిట్టుకుంటారు. ఇక లక్ష్మీని ఇంట్లోకి తీసుకెళ్లి అందరికీ స్వీట్స్ ఇవ్వమని జాను తీసుకొస్తుంది. లక్ష్మీ అందరికీ స్వీట్స్ ఇస్తుంది. మిత్రకి కూడా ఇస్తుంది. మిత్ర కూడా స్వీట్ తీసుకుంటాడు. మీరు అమ్మ స్వీట్ షేర్ చేసుకోండని పిల్లలు అంటారు. మనీషా రగిలిపోతుంది. అవసరమా అని మనీషా అంటుంది. దానికి అరవింద భార్యభర్తలు చెరి సగం పంచుకుంటే తప్పేంటి అని అంటుంది. ఇక లక్కీ తండ్రికి సగం స్వీట్ తిని లక్ష్మీకి సగం ఇవ్వమని అంటుంది. మిత్ర తిని లక్ష్మీకి ఇస్తాడు. మనీషా షాక్ అయిపోతుంది. లక్ష్మీ భర్త ఇచ్చిన స్వీట్‌ని తీసుకోబోతే లక్కీ అమ్మకి తినిపించమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్ ప్రోమో: దమ్ముంటే ఆ విషయంలో చిన్నాని ఆపు: సత్యతో మహదేవయ్య ఛాలెంజ్





















