Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 11th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జానుని కోడలిగా ఒప్పుకోని దేవయాని.. వివేక్ వాటా తీసుకొని వేరే కాపురం పెట్టుకుంటాడా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జానుని కోడలిగా ఒప్పుకోనని దేవయాని గుమ్మం ముందు ఆపడం వేరే కాపురం పెట్టుకుంటారని సంజన తల్లితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జానుని కోడలిగా ఒప్పుకోను అని తను ఇంట్లో అడుగు పెడితే పెట్రోల్ పోసుకొని చనిపోతా అని వార్నింగ్ ఇచ్చి దేవయాని గుడి దగ్గర నుంచి వెళ్లిపోతుంది. ఆ మాట అందరికీ చెప్పుకొని లక్ష్మీ ఏడుస్తుంది. అరవింద, జయదేవ్‌లు మేమంతా ఉన్నాం అలా ఏం కాకుండా చూసుకుంటామని లక్ష్మీకి ధైర్యం చెప్తారు. దేవయానికి సర్ది చెప్తామని అంటారు.
మిత్ర: పెళ్లి అయిపోయింది ఇక ఎవరూ ఏం చేయలేం. అనవసరంగా ఎవరూ టెన్షన్ పడొద్దు.
లక్ష్మీ: ఇప్పుడు జాను పెళ్లి అయిపోయింది. తను ప్రతీ క్షణం పరిస్థితులతో పోరాడాల్సి ఉంటుంది.
మిత్ర: నువ్వు జాను గురించి ఆలోచించకు లక్ష్మీ తన మీద ఈగ కూడా వాలనివ్వం.
వివేక్: వదిన నేను నీకు మాట ఇస్తున్నా ఇన్నాళ్లు జానుకి అండగా మీరు ఉన్నారు. ఇక నుంచి జాను బాధ్యత భర్తగా నేను తీసుకుంటా నన్ను నమ్ము వదినా.
అరవింద: ఇది సంతోషించాల్సిన విషయం లక్ష్మీ నీ చేతుల మీదగా జాను పెళ్లి జరగకపోయినా నీ కళ్ల ముందు జరిగింది. నీకున్న బాధ్యతల్లో ఒకటి తీరిపోయింది.
జయదేవ్: జానుని వివేక్ పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడమ్మా నవ్వేం ఆలోచించకు. దేవయానికి సర్దిచెప్తాం.
లక్ష్మీ: జాను చేయి ఇలా ఇవ్వు. వివేక్ ఇప్పటి వరకు తను నా చెల్లి ఇప్పుడు నీ భార్య ఎలా అయినా మీ అమ్మని ఒప్పించు తనని కష్టపెట్టే పని చేయకు.
వివేక్: అలాగే వదిన మీరు సంతోషపడేలా చేస్తాను.
పంతులు వచ్చి అందరి దీవెనలు తీసుకోమని అంటాడు. మిత్ర, జానులు అరవింద, జయదేవ్, లక్ష్మీ, మిత్రల ఆశీర్వాదం తీసుకుంటారు. మరోవైపు మనీషా, దేవయానిలు ఇంటికి వెళ్లిపోతారు. జరిగిన పెళ్లి తలచుకొని దేవయాని రగిలిపోతుంది. మనీషా అక్కడికి వచ్చి దేవయాని చాలా కోపంగా ఉందని ఈ పరిస్థితిని సరిగ్గా వాడుకోవాలని జాను కూడా ఇబ్బంది పడాలని అప్పుడే లక్ష్మీ పని అయిపోతుందని అంటుంది. కావాలనే దేవయానితో మీ కోడలు కాసేపట్లో వస్తుంది హారతి ఇచ్చి స్వాగతం పలుకుతారా అని అంటుంది. దానికి దేవయాని అది ఎప్పటికీ నా కోడలు కాదని అంటుంది. అందరూ ఒక్కటై పోయారు ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండని అంటుంది.
మనీషా: ఇన్నాళ్లు అరవింద ఆంటీ ఈ ఇంటికి పెద్ద కోడలు అయి పెత్తనం చేసింది ఇప్పుడు లక్ష్మీ పెద్ద కోడలు అయి తన చెల్లిని చిన్నకోడల్ని చేసింది. మీ బతుకు ఇంకా హీనంగా మారిపోతుందేమో.
దేవయాని: ఆ పరిస్థితి ఎందుకు రానిస్తాను అసలు దాన్ని ఈ ఇంట్లోకే రానివ్వను. దాన్ని అటు నుంచి అటే పంపిస్తాను.
మనీషా: ఇద్దరం కలిసి ఆ అక్కా చెల్లెల్ని ఒక ఆట ఆడుకుందాం.
జాను, వివేక్‌లను తీసుకొని అందరూ ఇంటికి వస్తారు. రావడం రావడమే సంజన ఆట పట్టిస్తుంది. ఆడపడుచు కట్నం అని అంటుంది. లక్ష్మీ హారతి తీసుకొని వస్తుంది. సంజన తీసుకొని ఇంటి ఆడ పడుచుగా ఆ పని నేనే చేయాలి అని హారతి ఇస్తుంది. ఇంతలో దేవయాని వచ్చి హారతి పళ్లెం విసిరేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. జాను ముఖం చూడటమే అసహ్యంగా ఉందని తనకు ఇష్టం లేకుండా ఏ ముఖం పెట్టుకొని నా ఇంట్లో అడుగుపెడుతుందని అంటుంది. దానికి లక్ష్మీ నీ కోడలిగా వివేక్ భార్యగా అడుగు పెడుతుందని అంటుంది. లక్ష్మీ ఎప్పుడూ మిత్రతో సరిగ్గా కాపురం చేయలేదని దరిద్ర దేవత అని అంటుంది. దానికి అరవింద నా కోడలి విషయంలో నువ్వు కలుగు జేసుకోవద్దని అంటుంది. అప్పుడు దేవయాని నా కోడలి విషయంలో మీరు కలుగజేసుకోవద్దని అంటుంది. దాంతో మిత్ర ఏంటి పిన్ని మీరు మేం అని వేరు చేస్తున్నారని అంటాడు.
లక్ష్మీ: వివేక్ మాట్లాడాల్సిన టైంలో సైలెంట్‌గా ఉన్నావ్. ఇలా జరుగుతుందని నీకు తెలీదా. నాకు ఇలా జరుగుతుందని తెలుసు కాబట్టి పెళ్లి వద్దు అన్నాను.
వివేక్: లేదు వదినా ఇన్నాళ్లు మావి రెండు జీవితాలు ఇప్పుడు ఒకే జీవితం నేను జాను చేయి పట్టుకుంది తనతో జీవితాంతం కలిసి బతకడానికి. ఎవరు అవును అన్నా కాదు అన్నా జాను నా భార్య. నా భార్యగా ఈ ఇంటి కోడలిగా జాను ఇంట్లో అడుగు పెడుతుంది. మమల్ని ఆపే హక్కు అధికారం మా అమ్మకి లేదు.
దేవయాని: ఏం మాట్లాడుతున్నావ్రా నన్ను కాదని మీరు ఈ ఇంటికి ఎలా వస్తారో నేను చూస్తా.
సంజన: ఎందుకమ్మా అలా బెదిరిస్తున్నావ్ నువ్వు ఇంట్లోకి రావొద్దంటే అన్నయ్య వదినా వేరే కాపురం పెడతారు.
మనీషా: మనసులో అయ్యో అదే జరిగితే నా ప్లాన్ వేస్టే అయిపోతుంది.
సంజన: అన్నయ్య తన వాటా ఆస్తి తీసుకొని వెళ్లిపోయి హ్యాపీగా ఉంటాడు. ఎటు వచ్చి నష్టపోయేది నువ్వే. అయినా నువ్వేంటి అమ్మ పిల్లల సంతోషం కంటే పంతాలు ఎక్కువ అయ్యాయి.
అందరూ దేవయానిని ఒప్పిస్తారు. లక్ష్మీ రెండు చేతులు దండం పెట్టి తన చెల్లిని కోడలిగా ఒప్పుకోండి తను మిమల్ని బాగా చూసుకుంటుందని అంటుంది. దానికి దేవయాని నేను ఒప్పుకోను కావాలి అని వాళ్లు వస్తే కాల్చుకొని చనిపోతా అంటుంది. అంతా ఏదో తేడా కొడుతుందని మనీషా దేవయానిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కొత్త జంటను వీధిలో ఉంచొద్దని పైకి అని దేవయానికి మెల్లగా జరగబోయే నష్టం చెప్తుంది. దాంతో దేవయాని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని వెళ్లిపోతుంది. ఇక సంజనకు హారతి తీసుకురమ్మని అంటుంది. సంజన హారతి ఇచ్చి కొత్త జంటను లోపలికి ఆహ్వానిస్తుంది.. వివేక్, జానులు దేవుడికి దండం పెట్టుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.