Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 5th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: భార్యకు సేవలు చేస్తున్న మిత్ర.. అరవిందని చంపేయాలని ప్లాన్ చేసిన మనీషా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode అరవింద మిత్రకు నిజం చెప్పాలి అనుకోవడం మనీషా అరవిందను చంపాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 5th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: భార్యకు సేవలు చేస్తున్న మిత్ర.. అరవిందని చంపేయాలని ప్లాన్ చేసిన మనీషా! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today november 5th episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 5th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: భార్యకు సేవలు చేస్తున్న మిత్ర.. అరవిందని చంపేయాలని ప్లాన్ చేసిన మనీషా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/05/f315c7c6f9eff750096b24045a478a731730805730413882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మా అన్నయ్య సీరియల్‌తో మహాసంగ్రామం పూర్తయిపోతుంది. లక్ష్మీకి ప్రమాదం జరగడం మిత్ర సేవలు చేయడం నుంచి ఇవాళ్టి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. మిత్ర లక్ష్మీకి నీరు తాగిస్తాడు. ఇక జున్ను, లక్కీ ఇద్దరూ ఆంజనేయ స్వామిని పిలిచి మా అమ్మని కాపాడకుండా ఏం చేస్తున్నావ్. ఏ చెట్టు మీద నిద్ర పోతున్నావ్ కదా అని అడుగుతారు. మా అమ్మకి యాక్సిడెంట్ చేసిన వాళ్లని శిక్షించమని అడుగుతారు పిల్లలు. మా అమ్మని బాధపెట్టిన వాళ్లు బాధ పడాలి అని వాళ్లు కింద పడి నడుం విరగొట్టుకోవాలి అని కోరుతారు.
మనీషా హాల్ నుంచి నడిచి వస్తుంటే మనీషా అరటి తొక్క తొక్కి జారిపోతుంది. శిక్షించేశాను అని ఆంజనేయస్వామి అంటారు. మళ్లీ మా అమ్మకి ఏమైనా ప్రమాదం జరిగితే నిన్ను వదలమని రాముడుతో చెప్పి శిక్ష వేయిస్తామని అంటారు. ఇక మనీషా నడుం నొప్పి అని విలవిల్లాడిపోతుంది. మనీషా దేవయానితో మిత్ర, లక్ష్మీ దగ్గరవుతున్నారని ఏం చేయాలో నా బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలీడం లేదని అంటుంది. దాంతో దేవయాని నాదీ అదే పరిస్థితి అని జాను కాల్చుకుతింటుందని అంటుంది.
మనీషా: నా ప్రాబ్లమ్తో పోల్చితే మీది ఒక ప్రాబ్లమేనా ఆంటీ. యాక్సిడెంట్ గురించి మిత్రకు చెప్పేస్తాను అని అరవింద ఆంటీ నాకు వార్నింగ్ ఇచ్చింది. ఆంటీనీ ఏకంగా పైకి పంపేస్తా.
దేవయాని: చంపేస్తావా మతి ఉండే మాట్లాడుతున్నావా.
మనీషా: ఆవిడను ఏదో ఒకటి చేయకపోతే నేనే పోయేలా ఉన్నాను.
దేవయాని: గోటితో పోయే దానికి గొడ్డలి వరకు ఎందుకు మనీషా.
మనీషా: అరవింద ఆంటీ నోరు తెరిస్తే మిత్ర రియలైజ్ అవుతాడు. లక్ష్మీ ఏం తప్పు చేయలేదు అని తనకు అర్థమవుతుంది. నన్ను పక్కన పడేస్తాడు. లక్ష్మీ నన్ను ఇంటి నుంచి పంపేస్తుంది.
దేవయాని: ఇప్పటికే లక్ష్మీ మీద అటాక్ వల్ల అందరూ అలర్ట్ అయ్యారు ఇప్పుడు నువ్వు అటాక్ చేస్తే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. మిత్రకు తెలిస్తే మొదటికే మోసం అవుతుంది.
మనీషా: ఏది అయితే అది అవుతుంది. ఆంటీ ఏ రోజు నోరు తెరుస్తుందో అప్పుడు నా బతుకు పోతుంది దాంతో ఈ పని చేయాల్సిందే.
దేవయాని: అక్క చనిపోతే నాకు లాభమేలే వస్తే నాకు పెత్తనం వస్తుంది లేదంటే ఇద్దరం పోతా ఓకే నీతో చేతులు కలుపుతా.
మిత్రకి జాను కాఫీ ఇస్తుంది. ఇంతలో లక్ష్మీ జానుని పిలిస్తే నేను వెళ్లను బావ ఇది వరకు నేను తన చెల్లిని ఇప్పుడు తోటి కోడలిని కదా నేను వెళ్లను అంటుంది. అలా అంటావ్ ఏంటి అని మిత్ర అడిగితే మీ భార్య కదా మీరే చూసుకోండి మీరే కాఫీ తీసుకెళ్లండని అంటుంది. దాంతో మిత్ర కాఫీ తీసుకొని వెళ్తాడు. లక్ష్మీ బ్రష్ చేయించమని అడుగుతుంది. దాంతో మిత్ర నాకు బ్రెష్ చేయించమని అంటావా అంటే లక్ష్మీ దానికి అత్తయ్యని పిలుస్తాను అంటుంది. ఇక పెద్దావిడని పిలుస్తావా అని అంటే మీకు తప్పదు అని లక్ష్మీ అంటుంది. బాగా ఎక్కువ చేస్తున్నావ్ అని మిత్ర అంటే లక్ష్మీ వెటకారంగా అమాయకంగా మాట్లాడి మిత్రని ఇరికించేస్తుంది. నడవలేను అని చెప్పి మిత్రని తీసుకెళ్లమని అంటుంది. మిత్ర తీసుకెళ్తాడు. బ్రష్ చేయిస్తాడు. తర్వాత లక్ష్మీని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పెడతాడు. ఇక కాఫీని మిత్ర లక్ష్మీకి మీరు తాగండని అంటుంది. ఇద్దరూ కాఫీ ఫేర్ చేసుకుంటారు. లక్ష్మీ మనసులో జానుకి థ్యాంక్స్ చెప్పుకుంటుంది.
మరోవైపు అరవింద దేవుడికి పూజ చేస్తూ మిత్రకు నిజం చెప్పేస్తే తన బాధ్యత తీరిపోతుందని అనుకుంటుంది. మనీషా, దేవయానిలు చూసి మిత్రకు నిజం చెప్పే ధైర్యం అడుగుతున్నట్లుందని మనీషా అంటుంది. ఇప్పుడే మిత్రకు నిజం చెప్పేలా ఉందని మనీషా అంటుంది. ఇక దేవయాని మనీషా నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఎందుకు దూరంగా వచ్చావని మనీషా అడిగితే చెడు జరుగుతుంది అని తెలిసి నీతో కలిసి ఉండలేను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)