Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 8th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి డెడ్ లైన్ పెట్టిన మనీషా.. అరవింద ఎంట్రీ ఎప్పుడో!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రని పార్టీకి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా నువ్వే అందుకు ఏర్పాట్లు చేయాలని లక్ష్మీతో మనీషా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఇంటికి అరవింద కాల్ చేసి వచ్చేస్తున్నా అని అందరితో చెప్తుంది. మనీషాతో కూడా మాట్లాడి నేను వచ్చాక నువ్వు ఉండాలో ఉండకూడదో నిర్ణయిస్తానని అంటుంది. మనీషా చాలా టెన్షన్ పడుతుంది. ఆంటీ వస్తే తనకు ప్రమదామని ఈలోపే మిత్రని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అందులో భాగంగా మనీషా సరయుని కలిసి రీ యూనియన్ ఏర్పాటు చేసి అక్కడ మిత్రని మత్తులో ఉంచి తాళి కట్టించుకుంటానని అంటుంది. సరయు షాక్ అయిపోతుంది.
ప్లాన్ బాగుంది కానీ దాన్ని అమలు చేయడం కష్టం అని అంటే దానికి మనీషా అన్నీ నేను చూసుకుంటా మిత్రని నువ్వు ఈవెంట్‌కి వచ్చేలా చేయ్ అని అంటుంది. సరయు ఓకే చెప్తుంది. సరయు రాజు గారితో ఈ సారి పెళ్లి జరిగేలా ఉందని ఈ పెళ్లి అయితే లక్ష్మీ ఆ ఇంటిలో ఉండదు మనీషా మిత్రని ఫారిన్ తీసుకెళ్లిపోతుంది ఇక మనకు తిరిగే ఉండదని అంటుంది. మరోవైపు దేవయాని దగ్గరకు కొందరు వచ్చి తన కోడలు సీమంతం అని అందరిని పిలుస్తుంది. ఇక దేవయానితో పాటు లక్ష్మీ, జానులకు బొట్టు పెట్టి పిలుస్తుంది. జాను నువ్వు ఎప్పుడు మీ అత్తయ్యకి మనవడిని ఇస్తావ్ అని అంటుంది. ఇంకా విశేషం లేదని కోడలిని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇంతలో మనీషా వచ్చి భార్యభర్తలు కాపురం చేసి వాళ్లలో ఏ లోపం లేకపోతే పిల్లలు పుడతారు అని లోపం ఉంటే పుట్టరు అని అంటుంది. మందులు గురించి వివేక్‌లో లోపం గురించి అందరి ముందు చెప్తుంది.
లక్ష్మీ మనీషా అని పిలిస్తే ప్రాబ్లమ్ వివేక్‌లో లేదా జానులో ఉందా కొడుకులో లోపం ఉంటే కోడలు మందులు వేసుకోవడం ఏంటి అని వాళ్లు ప్రశ్నిస్తారు. దాంతో లక్ష్మీ ఈ విషయం ఇక్కడితో వదిలేయమని పంపేస్తుంది. బయట వాళ్ల ముందు ఈ మాటలు ఎందుకు అంటుంది. ఇక మనీషా ఆంటీ మీరు ఎప్పుడు నానమ్మ ఉన్నారు అంటే ఆ రాత నాకు ఉందో లేదో అని దేవయాని బాధ పడుతుంది. లక్ష్మీకి ఒక విషయం తెలుసు అని మనీషా అంటే లక్ష్మీ కవర్ చేస్తుంది. దేవయాని కోపంగా మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు అది చెప్తారా లేదా అని అడుగుతుంది. ఇంతలో మిత్ర, వివేక్‌లు వస్తారు. మనీషా వాళ్లతో లక్ష్మీ, వివేక్‌కి తెలిసిన విషయం గురించి ఆంటీ అడుగుతున్నారని అంటుంది. ఇద్దరికీ కోర్స్ వాడమన్నారు కదా అని వివేక్ అంటాడు. అత్తయ్యకి ఏం అనుమానం ఉండదు నువ్వు ఎందుకు లేనిపోనివి చెప్తావంటుంది. తనకు మనవడో మనవరాలో పుట్టడం లేదని బాధ పడుతుంది. మనీషాని లక్ష్మీ కోప్పడుతుంది.
జాను జీవితంతో ఆడుకోవద్దని అంటుంది. ఇక మనీషా ఈ రాత్రతో నీకు ఇచ్చిన గడువు తీరిపోతుంది మిత్రతో పెళ్లి జరగక పోతే ఆంటీకి నిజం చెప్తానని అంటుంది. ఎల్లుండి హోలీలో మిత్రని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని సరయు పిలవడానికి వస్తుంది. నువ్వే నన్ను మిత్రని ఆ ఈవెంట్‌కి పంపాలని అంటుంది. లక్ష్మీ ఏం చేయాలో తెలియని అయోమయంలో పడుతుంది. మరోవైపు జాను బాధ పడుతుంది. వివేక్ జానుని ఓదార్చుతాడు. మీకు ప్రాబ్లమ్ ఉంటే నేను మందులు వాటడం ఏంటి లోపం నీలో ఉందా నాలో ఉందా చెప్పు అని ఒట్టు వేస్తుంది. వివేక్ సర్ది చెప్తాడు. ఇక సరయు, రాజులు మిత్ర ఇంటికి వస్తారు. అందరిని పలకరిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

