Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 5th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ మాత్రమే నా భార్య మనీషాని పెళ్లి చేసుకోను.. మిత్ర నిర్ణయాని చస్తానంటోన్న మనీషా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మాత్రమే తన భార్య అని మనీషాని పెళ్లి చేసుకోనని మనీషా బిడ్డని తీసుకుంటానని మిత్ర చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 3rd Episode లక్ష్మీ మిత్రలు రౌడీలను కొట్టి పిల్లల్ని కాపాడుతారు. తల్లిదండ్రులకు తెలీకుండా కొండ గుట్టకు వెళ్లాలని పారిపోతారు. పోలీసులు రావడంతో రౌడీలను అప్పగిస్తారు. రౌడీలకు పిల్లల గురించి అడిగితే కొండ గుట్టకు వెళ్లారని చెప్తారు. లక్ష్మీ, మిత్రలు పరుగులు తీస్తారు. పిల్లలు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ముడుపు చెల్లించి తల్లిదండ్రులు ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటారు.
లక్ష్మీ, మిత్రలు పిల్లల్ని చూస్తారు. లక్ష్మీ పిల్లల్ని పట్టుకొని ఏడుస్తుంది. చెప్పకుండా ఇలా ఎందుకు చేశారని అడిగితే మీ కోసమే అని మనీషా వల్ల మీరు విడిపోతున్నారని మిమల్ని కలపాలి అని ఆంజనేయుడ్ని మొక్కుకున్నామని అంటారు. మరోవైపు మనీషా అక్కడికి వస్తుంటుంది.
మిత్ర: మేం విడిపోతాం అని మీకు ఎవరు చెప్పారు.
జున్ను: దేవయాని నానమ్మ.
లక్కీ: నువ్వు మనీషాని పెళ్లి చేసుకుంటున్నావని చెప్పారు. ఈ లక్ష్మీ అమ్మ నాకు అమ్మా కాదు అంటగా
జున్ను: అమ్మని వదిలేయకు నాన్న నేను అమ్మ ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాం.
లక్కీ: నాకు లక్ష్మీ అమ్మ కావాలి నాన్న మనమంతా కలిసి ఉందాం.
మిత్ర: మీ అమ్మ నాకు ప్రాణంతో సమానం నా ప్రాణాన్ని వదిలేస్తా అని మీరు ఎలా అనుకున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ తనే నా భార్య. తను మాత్రమే నా భార్య. మీకు ఈ నాన్న ఒక్కరే. అమ్మ కూడా ఒక్కరే. మీ అమ్మ స్థానంలోకి మనీషానే కాదు ఏ అమ్మాయిని తీసుకురాను. ప్రామిస్.
మనీషా: నా పరిస్థితి ఏంటి మిత్ర.
మిత్ర: నీకు అన్యాయం చేయను అని చెప్పాను కదా.
మనీషా: అయితే నన్ను పెళ్లి చేసుకుంటున్నావా లేదా.
మిత్ర: లక్ష్మీ ఉండగా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను మనీషా. అసలు నువ్వు అలా ఎలా ఆలోచించావు. నేను నిర్ణయం అంటే పెళ్లి అని ఎలా అనుకున్నావ్. నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది. అందుకు పూర్తి బాధ్యత నాదే నేను నీ బేబీకి ఫాదర్ అవుతాను కానీ నీకు భర్తను కాలేను. బేబీ పుట్టాక తన రెస్పాన్స్ బిలిటీ నేను తీసుకుంటా నీకు మరో లైఫ్ ఇస్తా. లైఫ్ లాంగ్ నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా. నీకంటూ ఓ లైఫ్ ఉండాలి అది నేను ఏర్పాటు చేస్తా.
లక్ష్మీ: మనీషా ఆయన మన ఇద్దరి గురించి ఆలోచిస్తున్నారు. మాట విను ఇద్దరం సంతోషంగా ఉంటాం.
లక్ష్మీ, మిత్రలు ఇంటికి ఫోన్ చేసి పిలల్ని తీసుకొని వస్తున్నాం అని చెప్తారు. ఇక దేవయాని ఆ విషయం మనీషాకి చెప్తే మనీషా అక్కడే ఉన్నాను అని మిత్ర తనని పెళ్లి చేసుకోనని చెప్పాడని మిత్రకు ఆ ఉద్దేశమే లేదట ఎప్పటికీ లక్ష్మీ మాత్రమే తన భార్య అంట అని చెప్తుంది. నేను చచ్చిపోయాను ఆంటీ నాకు ఇంక భవిష్యత్ లేదు చావు తప్ప ఇంకేం లేదని అంటే దేవయాని ఇంటికి రమ్మని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దని అంటుంది. మిత్ర మీద నీకు ఇంట్రస్ట్ ఉంది కదా నువ్వు రా అని ఒప్పిస్తుంది. ఇక రాత్రి వివేక్ మందులు కొనడానికి వస్తే మనీషా చూసి మెడికల్ షాప్‌లో ఉన్న జాను ఫ్రెండ్‌తో మాట్లాడి తనకు తెలీకుండా మెడిసిన్ ఫొటో తీసుకొని తన డాక్టర్‌కి విషయం అడిగి తెలుసుకుంటుంది. దాంతో ప్రాబ్లమ్ జానుకే అని మనీషాకి అర్థమవుతుంది. లక్ష్మీ పిల్లల కాళ్లకు మందు పెడుతుంటే మనీషా వచ్చి ప్రాబ్లమ్ వివేక్‌లో లేదని జానులో ఉందని అది వివేక్ కవర్ చేస్తున్నాడని అంటుంది. ఇంతలో వివేక్ వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

