Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 4th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను, లక్కీలను లక్ష్మీ కనిపెడుతుందా.. దేవయాని హితోపదేశం
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode పిల్లలు శాశ్వతంగా కనిపించకుండాపోవాలని అన్న మనీషాకి దేవయాని తప్పొప్పులు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర చేస్తానన్న న్యాయం ఏంటా అని మనీషా సీరియస్‌గా ఆలోచిస్తుంది. దేవయాని రావడంతో మిత్ర తన విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో అని అంటుంది. పిల్లలు తప్పిపోయారు ఆ విషయం గురించి ఆలోచించకుండా నీ పెళ్లి విషయం ఆలోచిస్తున్నావా అంటుంది. పిల్లలు ఎలా పోతే నాకేంటి అని మనీషా అంటుంది.
దేవయాని: తప్పు మనీషా పిల్లల్ని అలా అనకూడదు నీ కోపం లక్ష్మీ మీద అంతే మధ్యలో ఆ పిల్లలు ఏం చేశారు.
మనీషా: వాళ్ల వల్ల లాస్ట్ టైం మిత్ర నా మెడలో తాళి కట్టకుండా ఆగిపోయాడు. వాళ్లు శాశ్వతంగా కనిపించకుండా పోతే నాకు హ్యాపీ.
దేవయాని: తప్పు మనీషా చాలా పెద్ద తప్పు. చాలా పెద్ద పాపం మూట కట్టుకుంటున్నావ్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఈ రోజు నీది అబద్ధపు కడుపే కానీ రేపు మిత్రతో నీకు పెళ్లి అయితే నీకు పిల్లలు పుడతారు కదా వాళ్లకి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు. అందరు పిల్లల్ని మన పిల్లలే అనుకోవాలి.
మిత్ర: చెరువులో చేపల్ని తినే కొంగ చెరువు ఎండిపోయిన తర్వాత శాకాహారిగా మారిపోయింది అంట అలా ఉంది మీ ప్రవర్తన. ఇంత చెప్పే మీరు జాను విషయంలో ఎందుకు అలా ఉంటారు. ఎందుకు తనని తప్పించాలి అనుకుంటారు. తన విషయంలో మీరు చేసిన కుట్రలు మర్చిపోయారా.
దేవయాని: నేను మాట్లాడేది జాను కోసం కాదు పిల్లల కోసం.
మనీషా: జాను చిన్నపిల్లకాదు కానీ ఆడపిల్ల కదా.
దేవయాని: నేను తప్పులు చేశాను కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటితే ఆ దేవుడు కూడా కాపాడలేదు.
పోలీస్ స్టేషన్ దగ్గరు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు కిడ్నాప్ అయ్యారని కంప్లైంట్ ఇచ్చి ఏడుస్తారు. ఇంతలో మిత్ర, లక్ష్మీలు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. తమ పిల్లలు కనిపించడం లేదని అంటే ఇప్పటికే చాలా మంది పిల్లలు తప్పిపోయారని చెప్పడంతో లక్ష్మీ వాళ్లు షాక్ అయిపోతారు. నాగపూర్ బ్యాచ్ కిడ్నాప్ చేశారని వాళ్లు పరమ దుర్మార్గులని ఓ వ్యక్తి పోలీస్‌లకు చెప్తారు. లక్ష్మీ వాళ్లు షాక్ అయిపోతారు. అందరు తల్లిదండ్రులు ఏడుస్తారు. లక్ష్మీ కూడా మనపిల్లలు మనకు కనిపించరా అని ఏడుస్తుంది. మిత్ర లక్ష్మీని ఓదార్చుతాడు.
లక్ష్మీ, మిత్రలు గుడికి వెళ్తారు. ఇంటికి వెళ్దామని మిత్ర అంటే లక్ష్మీ రానని అంటుంది. మరోవైపు జున్ను, లక్కీలు ముడుపు కట్టుకొని బయటకు వస్తారు. పిల్లలు తల్లిదండ్రుల్ని చూసి అమ్మవాళ్లకు కనిపిస్తే మనల్ని కొండగుట్టకి వెళ్లనివ్వరు అని దాక్కుంటారు. మరోవైపు పనామె లక్ష్మీ వాళ్లతో పిల్లల్ని చూశానని చెప్తుంది. ఇద్దరూ పరుగులు తీస్తారు. పంతులు లక్ష్మీ వాళ్లకి విషయం చెప్తారు. మీ ఇద్దరూ కలిసి ఉండాలని మీ పిల్లలు మొక్కుకున్నారని ఆ మొక్కు తీర్చడానికి మాల వేసుకొని వెళ్తారని చెప్తారు. లక్ష్మీ, మిత్రలు బయటకు వెళ్తారు. మరోవైపు పిల్లలు నడుచుకుంటూ వెళ్తారు. నవలేక మధ్యలో కూర్చొంటారు. లక్కీ కాళ్లలో నుంచి రక్తం వస్తుంది. జున్ను విషయం చెప్తే అమ్మా నాన్నకోసం ఏమైనా పర్లేదు అంటుంది. పిల్లలు ఎవరికైనా లిఫ్ట్ అడుగుదామని పిల్లల్ని ఎత్తుకుపోయిన ముఠానే లిఫ్ట్ అడుగుతారు. పిల్లల్ని ఆ రౌడీలు ఎక్కించుకుంటారు. దారిలో ఓ చెక్ పోస్ట్ వస్తుంది. లక్ష్మీ,మిత్రలు అక్కడ ఎంక్వైరీ చేస్తారు. జున్ను, లక్కీలు చూసి భయపడతారు. ఇక పిల్లలు వెనక్కి చూసే టైంకి పిల్లలు కనిపిస్తారు.
లక్కీ, జున్నులు ఏం చేయాలా అనుకుంటారు. ఇక జున్ను తమ దగ్గరకు ఉన్న ఫొటో కింద పడేద్దాం పోలీసులు చూస్తారని అంటాడు. రౌడీలు దొరక్కుండా పారిపోతారు. జున్ను లక్కీలు తల్లిదండ్రుల ఫొటో పడేయడంతో పోలీసులు గుర్తు పట్టి పిల్లలు ఉన్నారని గుర్తిస్తారు. ఇక మిత్రకు కాల్ చేసి పిల్లలు ఉన్న వ్యాన్ మీ వెనకే ఉంది దాన్ని ఆపండి అని అంటారు. దాంతో మిత్ర కారు రోడ్డుకి అడ్డంగా ఆపుతారు. రౌడీలు వెనక్కి వెళ్లబోతే పోలీసులు ఉంటారు. మిత్ర రౌడీలను చితక్కొడితే లక్ష్మీ పిల్లల్ని కాపాడుతుంది. జున్న, లక్కీలు మాత్రం పారిపోవాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

