Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 28th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ, మిత్రలకు నిజం చెప్పేసిన అరవింద.. భర్త కోసం మనీషాని సవతిగా లక్ష్మీ అంగీకరిస్తుందా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode నందన్ వంశ ప్రతిష్ఠకు సంబంధించిన ఓ ప్రాజెక్ట్‌ని మనీషా కొట్టేసి సరయుకి ఇవ్వాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీకి పిల్లలు పన్నీరు పులావ్ చేయమని అడగటంతో మిత్ర నేను సాయం చేస్తాను చేద్దామని అంటారు. పిల్లలు గెంతులేస్తారు. మిత్ర, లక్ష్మీ ఇద్దరూ కిచెన్‌కి వెళ్తారు. దేవయాని మనీషాకి విషయం చెప్తుంది. లక్ష్మీ ఒక చేయి మిత్ర మరో చేయి ఉపయోగించి పిల్లల కోసం వంట చేస్తారు. మనీషా చూసి చిరాకు పడుతుంది.
జాను, వివేక్‌లు చాలా సంతోషపడతారు. మనం కూడా వెళ్లి సాయం చేద్దామని జాను అంటే ఇలాంటి టైంలో అస్సలు వెళ్లకూడదని వివేక్ చెప్తాడు. మనీషా వాళ్ల అంతు చూస్తానని అంటే దేవయాని వద్దని వాళ్ల మధ్యకు వెళ్లే నిన్ను కోసేస్తారని అంటుంది. దాంతో మనీషా కుళ్లుకొని గదిలోకి వెళ్లిపోతుంది. ఇక మనీషా సరయు మెసేజ్ చూసి సరయుకి కాల్ చేస్తుంది. మిత్ర నీ పక్కన లేడా అని సరయు అడిగితే లక్ష్మీ పక్కన ఉన్నాడని జరిగింది మనీషా సరయుకి చెప్తుంది. సరయు మనీషాతో ఎలా అయినా మిత్ర ప్రాజెక్ట్ కోసం రెడీ చేసిన ప్రాజెక్ట్ బ్లూ ఫ్రింట్ ఇవ్వమని అడుగుతుంది. బెదిరిస్తున్నావా అని మనీషా అంటే లేదు బెదిరించడం అంటే నీ నిజాలు తెలిసింది నాకు మాత్రమే అవి బయట పెట్టేయడం అంటుంది. నేను నీకు ఫ్రెండ్‌ని శత్రువుగా మార్చుకోకు అని అంటుంది. మనీషా ఫైల్ గురించి ఆలోచిస్తుంది.
మిత్ర ఫైల్ చెక్ చేస్తుంటే లక్ష్మీ పక్కనే కూర్చొని అరవింద కోసం ఆలోచిస్తుంది. లక్ష్మీ మిత్రతో అత్తయ్య గారు దేని గురించో బాధ పడుతున్నారని అత్తయ్య గారి భయం బాధ ఏంటో తెలుసుకోవాలని అంటుంది. ఇంతలో అరవింద, జయదేవ్ అక్కడికి వస్తారు. ఇద్దరూ అరవిందతో నువ్వు తిరిగి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తున్నావ్ అది ఏంటో మాకు చెప్పమని అడుగుతారు. అరవింద చెప్పబోతే జయదేవ్ అడ్డుకుంటాడు.
జయదేవ్: లక్ష్మీ మీ అత్తయ్యకు ఏ సమస్య లేదు.
అరవింద: ఉంది నాకు ఓ సమస్య ఉంది. కానీ నీ దగ్గర నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు తెలుసుకొని ఏం చేస్తావ్ లక్ష్మీ. నా సమస్యకు పరిష్కారం ఉంది కానీ నీ దగ్గర లేదు లక్ష్మీ.
లక్ష్మీ: మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య గారు.
అరవింద: నువ్వు దానం చేసిన నీ గర్భసంచి గురించి.. మళ్లీ నువ్వు తల్లివి కాదు అన్న నీ అమ్మతనం గురించి.. ఈ ఇంట్లో పుట్టవలసిన ఆడపిల్ల గురించి.
జయదేవ్: వద్దు అరవింద.
అరవింద: నన్ను చెప్పనివ్వండి నిజం దాచి అపార్థాలు పెంచుకునే కంటే నిజం వీళ్లకి తెలియాలి. నీ కోసం ఈ కుటుంబం కోసం ఓ ఆడపిల్ల కావాలి మిత్ర. నీ రక్తం పంచుకుపుట్టిన ఆడపిల్ల కావాలి. చెప్పు లక్ష్మీ ఆ బిడ్డను నువ్వు ఇవ్వగలవా. నీలో లేని మాతృత్వంతో అది జరుగుతుందా. ఈ వంశంలో మిత్ర రక్తం పంచుకున్న ఆడపిల్ల లేదు. అందుకే నీకు జున్నుతో పాటు మరో ఆడపిల్ల కావాలి అన్నాను కానీ నువ్వు ఆ అవకాశం లేకుండా చేశావు. వంశోద్ధారణ కోసం మిత్ర కోసం మిత్ర రక్తం పంచుకుపుట్టన నీ పేగు తెంచుకు పుట్టాల్సిన ఆడ బిడ్డ లేకుండా చేశావు లక్ష్మీ.
మిత్ర: లక్కీ ఉంది కదా మామ్.
అరవింద: నేను అంటున్నది నువ్వు ప్రేమతో పంచుకున్న బిడ్డ గురించి కాదు నీ రక్తం పంచుకుపుట్టాల్సిన బిడ్డ కోసం. లక్కీ నీ రక్తం పంచుకుపుట్టిన బిడ్డ కాదు కదరా. లక్ష్మీ మీద ఆశ చనిపోయింది కానీ మనీషా తల్లి కాబోతుందని తెలిసి మనీషా వల్ల అయినా ఈ వంశానికి ఆడపిల్ల రాకుండా పోతుందా అని తను ఎలాంటిది అయినా తనని కోడలిగా అంగీకరించా. నాకు మనీషా అంటే ప్రేమ లేదు. లక్ష్మీ అంటే ద్వేషం లేదు కానీ నాకు ఈ ఇంటికి ఆడపిల్ల కావాలి అందుకే మనీషా ఈ ఇంటికి కోడలు అయింది. నా మనసులో ఉన్నది మీకు చెప్పేశా ఇకనైనా అర్థం చేసుకోండి. కడుపుతో ఉన్న మనీషాని ఇబ్బంది పెట్టొద్దు. మిత్ర నందన్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీల ఫ్యూచర్ ఈ ఫైల్‌లో ఉంది రేపే బిడ్డింగ్ వేయాలి అయిపోతుంది కదా.
మనీషా సరయు చెప్పిన ఫైల్ గురించి ఆలోచిస్తుంది. దేవయాని వచ్చి మాట్లాడుతుంటే ఫైల్ దొంగతనంలో దేవయానిని భాగం చేయాలి అని అందుకు ఆమెకు లాభం కూడా రావాలి అని అనుకుంటుంది. మీరు ఊ అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలిపోతాయని మీరు సరే అంటే అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ గెంటేయొచ్చని మిత్ర దగ్గర ఉన్న ముఖ్యమైన ఫైల్ని కొట్టేసి జాను కొట్టేసిందని నమ్మిస్తే సరిపోతుందని అంటుంది. జానుని పంపడం కోసం దేవయాని సరే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!





















