Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 27th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ కోసం తల్లిని ఎదురించిన మిత్ర.. మనీషా అనుకున్నది సాధించగలదా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ, మిత్రలు కడియాలు తీయమని తెగేసి చెప్పేయడం మనీషా తన ప్లాన్ వేస్ట్ అయిందని తల బాదుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషాతో కలిసి పూజలో కూర్చొని కొంగుముడి వేసుకోవాలని కడియం తీసేయమని అరవింద మిత్రకు చెప్తుంది. కడియాలు తీయకూడదు వాటి అంతట అవే విడిపోయే వరకు అలాగే ఉండాలని పంతులు చెప్పారని పిల్లలు చెప్తారు. ఇంట్లో పంతులు కూడా అదే చెప్తారు.
మనీషా: ఆంటీ నా కడుపులో బిడ్డ కోసమే కొంగుముడి వేసుకోమని మీరే చెప్పారు కదా కడియం తీయమని మీరే మిత్రకు చెప్పండి.
అరవింద: నేను చెప్తున్నా మిత్ర ఆ కడియం తీసేయ్. మిత్ర నీకే చెప్పేది.
మిత్ర: నువ్వు చెప్పింది ఏమైనా చేస్తానమ్మా కానీ ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు.
మనీషా: ఆంటీ చెప్పిన వినవా మిత్ర.
దేవయాని: ఎందుకు వింటాడు ఇదంతా లక్ష్మీ ప్లాన్. ఇంట్లో ఈ పూజ ఉందని ముందే తెలుసుకొని ఇదంతా చేసింది.
మిత్ర: ఇందులో లక్ష్మీకి ఏం సంబంధం లేదు పిన్ని. పిల్లలు వేశారు.
అరవింద ఎంత చెప్పినా మిత్ర కడియం తీయడానికి ఒప్పుకోడు. మిత్రను ఇబ్బంది పెట్టొద్దని జయదేవ్ అంటాడు. దేవయాని మనీషాతో మిత్ర తీసేది ఏంటి మనీషా నీ బిడ్డ కోసం నువ్వే ఆ కడియం తీసేయ్ అంటే నా బేబీ కోసం ఏమైనా చేస్తాను అని మనీషా కడియం తీయడానికి వెళ్తే మిత్ర మనీషా మీద అరిచి కొట్టడానికి చేయి ఎత్తుతాడు. మనీషా షాక్ అయి ఏడుస్తుంది. మనీషా నీ ప్రతి రూపం మోస్తుంది అని అరవింద అంటే అంతా లక్ష్మీ వల్లే అని మనీషా అంటుంది. అరవింద, లక్ష్మీలకు గొడవ పెట్టాలని చూస్తున్నావా అని జయదేవ్ అంటాడు. దానికి దేవయాని అరవింద అక్క చెప్పిన దానికి మిత్ర ఏ రోజు కాదు అనలేదు అలాంటిది ఈ రోజు అక్క కంటే లక్ష్మీ మిత్రకు ఎక్కువ అయిపోయిందని అంటుంది. లక్ష్మీతోనే మిత్రకు కడియం తీయమని మనీషా చెప్పమని అరవిందతో మనీషా చెప్తే అరవింద లక్ష్మీకి చెప్తుంది. లక్ష్మీ తాను చెప్పను అంటుంది. పిల్లలు ఒట్టు పెట్టారని చెప్తుంది. లక్ష్మీ తన మీద ద్వేషంతో ఇలా చేస్తుందని మనీషా అంటే మిత్ర లక్ష్మీని ఏమైనా అంటే బాగోదని మిత్రకు వార్నింగ్ ఇస్తాడు. కడియాలు విడిపోయిన వెంటనే మనీషాతో కలిసి పూజ చేస్తానని మిత్ర చెప్తాడు.
మనీషా గదిలోకి వెళ్లి తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు అన్నీ విసిరి కొడుతుంది. దేవయాని వచ్చి మనీషాని ఆపుతుంది. జరగని పెళ్లికి కొంగు ముడి వేయాలి అంటే దేవుడు చూస్తూ ఉండడని మిత్ర, లక్ష్మీలకు బ్రహ్మముడి వేశాడని దేవయాని అనగానే మనీషా దేవయాని చీర కొంగుతో దేవయాని పీక పిసికేస్తుంది. నీ ప్లాన్ ఫెయిల్ అయితే నేను ఏం చేయాలని అంటుంది. పూజ జరిగి తీరాలి అని మనీషా అనగానే దేవయాని తుమ్మేస్తుంది. మనీషా కోపంతో దేవయాని గొంతు పట్టడానికి వెళ్తుంది. మరోవైపు వివేక్, జానులు పిల్లల్ని తెగ మెచ్చుకుంటారు. మీ అమ్మానాన్న విడిపోకుండా మీరే కలిపారని చెప్తారు. దేవుడే మాకు సాయం చేశారని పిల్లలు చెప్తారు. మనీషాని నలుగురు కలిసి తరిమి కొట్టాలని అనుకుంటారు.
అరవింద పూజ గురించి ఆలోచిస్తుంది. జయదేవ్ వెళ్లి మాట్లాడుతాడు. లక్ష్మీ మిత్రని గండాల వైపు తిప్పుతుందని మిత్రను శాశ్వతంగా కాపాడే శక్తి మిత్ర రక్తం పంచుకుపుట్టిన బిడ్డే కాపాడుతుందని లక్ష్మీకి ఇప్పుడు ఆ అవకాశం లేదని అంటుంది. లక్ష్మీ మిత్ర గురించే ఆలోచిస్తుంది మిత్రను కాపాడుకోవాలి అంటే లక్ష్మీ ఇంటికి దూరం అయిపోతుందని జయదేవ్ అంటాడు. లక్ష్మీ గురించి ఆలోచించే నిజం చెప్పకుండా ఆగిపోతున్నా అని అరవింద అంటుంది. మిత్రను కాపాడుకోవడానికి మనీషా కడుపులో ఉన్న బిడ్డే ఆధారం అని అంటుంది. పిల్ల దగ్గరకు లక్ష్మీ, మిత్ర వస్తారు. లక్కీకి పన్నీరు పలావ్ కావాలని అంటే మిత్ర పర్లేదు అని చేద్దామని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని సార్లు మనసు ముక్కలు చేసుకోవాలి.. నేను ఓ ఆడపిల్లనే.. జ్యోత్స్న డైలాగ్స్ పీక్స్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

