Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అర్జున్, లక్ష్మీల పెళ్లి గురించి చలమయ్య దగ్గర బాధ పడిన వసుధార.. అర్జున్ ఇంటికి లక్కీ!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode :అరవిందను ఒప్పించి జున్ను లక్కీని తనతో పాటు తన ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మనీషా, మిత్రలకు పెళ్లి చేయాలని దేవయాని అరవిందకు చెప్తుంది. అరవింద దేవయానిని తిడుతుంది. మనీషా మిత్రను ఇంకా ప్రేమిస్తుందని, ఆ ప్రేమను అర్ధం చేసుకొని విలువ ఇవ్వాలని దేవయాని అంటుంది. దాంతో అరవింద ప్రేమ గురించి అంత ఆలోచించేదానివే అయితే ముందు నీ కొడుకు ప్రేమ గురించి ఆలోచించు. వివేక్ ప్రేమిస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయు అని చెప్తుంది. అరవింద మాటలకు దేవయాని ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. దాంతో దేవయాని కోపంతో తిండి దగ్గర నుంచి లేచి వెళ్లిపోతుంది. మనీషా కూడా వెళ్లిపోతుంది.
అర్జున్ లక్ష్మీకి దగ్గరుండి వడ్డిస్తాడు. లక్ష్మీ వంటలు తిని అద్భుతంగా ఉన్నాయని పొగిడేస్తుంది. వసుధార అర్జున్, లక్ష్మీల పెళ్లి టాపిక్ ఎలా తీసుకురావాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండటంతో వసుధారం ఈ టైంలో ఇంటి కోడలు ఉంటే ఎంత బాగుంటుంది అని అంటుంది. తన ఇంటికి ఓ కోడలు వస్తే బాగుంటుందని ఏమంటావ్ అని లక్ష్మీని అడుగుతుంది. దాంతో అర్జున్ తల్లిని అడ్డుకొని సమయం సందర్భం లేకుండా ఎందుకు ఆ టాపిక్ అని ఆపేస్తాడు.
వివేక్ జున్నుని వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. లక్కీ జున్నునీ జాగ్రత్తగా డ్రాప్ చేయమని చెప్తుంది. ఇక జున్ను అరవింద్ కాళ్లకు దండం పెడితే మిత్ర చూసి ఓవర్ యాక్షన్ అంటాడు. ఇక మిత్ర జున్నుకి బాయ్ చెప్పి మరెప్పుడు రాకు అంటాడు. దీంతో జున్ను మిత్ర పని చెప్తా అని లక్కీని తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. మిత్ర వద్దని అంటాడు. లక్కీ నానమ్మ పర్మిషన్ ఇచ్చిందని నేను వెళ్తానని మిత్రకు చెప్తుంది. మిత్ర తనకు టైం వస్తుందని అప్పుడు నీ పని చెప్తా అని అనుకుంటాడు. ఇక లక్కీ వీడియో తీస్తా అని ఆ సెటప్ అంతా పట్టుకొని జున్నుతో బయల్దేరుతుంది.
వసుధార చలమయ్య దగ్గర లక్ష్మీ, అర్జున్‌ల పెళ్లి గురించి చెప్పలేకపోయాను అని బాధపడుతుంది. అర్జున్ బలంగా ఆపేశాడు అని బాధపడుతుంది. చలమయ్య వీలైనంత తొందరగా వాళ్ల పెళ్లి గురించి మాట్లాడమని చెప్తాడు. లక్ష్మీ వెళ్లిపోతే అర్జున్ మళ్లీ పాత అర్జున్ అయిపోతాడు అని అందుకే జాగ్రత్తగా వాళ్లని కలపాలి అని వసుధార అంటుంది. ఆ మాటలు అర్జున్ చాటుగా వింటాడు. ఇంతలో జున్ను ఇంటికి వస్తాడు. లక్కీని చూసి లక్ష్మీ హ్యాపీగా ఫీలవుతుంది. లక్కీ పరుగున వచ్చి లక్ష్మీని అమ్మా అని హత్తుకుంటుంది. లక్కీకి లక్ష్మీ అంటే చాలా స్పెషల్ అని చెప్తుంది. నాన్న చెప్పింది కాదు అని నీకోసం వచ్చేంత స్పెషల్ అని అంటుంది. మీ నాన్నని కాదు అని వచ్చావ్ కదా మీ నాన్న బాధ పడరా అని అంటుంది లక్ష్మీ. తన తండ్రిని పొగిడేస్తుంది. జున్ను మాత్రం వెటకారంగా మాట్లాడుతాడు. ఇంతలో అర్జున్ వస్తాడు. మిత్ర తనకు తెలుసు అని అర్జున్ అంటే మీకు ఎలా తెలుసని లక్ష్మీ అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.