Chiranjeevi Lakshmi Sowbhagyavathi July 9th Episode: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర చేతికి కంకణం కట్టేసిన లక్ష్మీ.. లక్కీతో అబద్దం చెప్పించిన వివేక్!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode ఇంట్లో ఎవరూ చూడకుండా లక్ష్మీ మిత్ర చేతికి కంకణం కట్టడం మిత్ర చూసి డౌట్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: లక్ష్మీని మిత్ర గదిలోకి పంపడానికి వివేక్ మెయిన్ ఆఫ్ చేస్తాడు. లక్ష్మీ మిత్ర గదిలోకి వెళ్లడానికి హాల్‌లో పరుగులు తీయడం అక్కడే ఉన్న దేవయాని చూసి ఎవరు ఎవరు అని అడుగుతుంది. ఇంతలో అరవింద కిందకి వచ్చి ఏమైందని అడిగితే ఎవరో వెళ్లినట్లు ఉందని అంటుంది. ఇంతలో వివేక్ వచ్చి నేనే అంటాడు. దానికి దేవయాని ఓ లేడీ వెళ్లిందని అంటుంది. మనీషా కూడా వచ్చి వదిలేయ్‌అని మెయిన్ దగ్గరకు వెళ్లి చూడమని అంటుంది. దేవయాని మెయిన్ చూసి వస్తానని వెళ్తుంది. ఇక లక్ష్మీ మిత్ర గదికి వెళ్తుంది. పడుకున్న భర్తని చూసి ఎమోషనల్ అవుతుంది. మిత్రకు బొట్టు పెట్టి చేతికి కంకణం కడుతుంది. మెయిన్ ఎవర ఆఫ్ చేశారని దేవయాని ఆన్ చేస్తుంది. మిత్ర లేచి తన చేతికి ఉన్న కంకణం, బొట్టు చూస్తాడు.
మిత్ర: ఉన్నట్టుండి నా నుదిట మీదికి బొట్టు ఎలా వచ్చింది. ఎవరు పెట్టి ఉంటారు. చేతికి కంకణం ఉంది. ఇదంతా ఎవరు చేసుంటారు.
లక్ష్మీ: పొరపాటున కంకణం విప్పేస్తారా. అలా చేస్తే దీక్ష మొత్తం వేస్ట్ అయిపోతుంది.
వివేక్: వదిన ఇప్పుడు వస్తే దొరికిపోతుంది. రాకుండా చూడాలి.
లక్ష్మీ: మిత్ర వాటర్ తాగి లక్కీని పట్టుకొని పడుకుంటే.. మిత్ర గారి పక్కన పాప ఎవరు. మిత్ర, మనీషాలకు పెళ్లి కూడా కాలేదు కదా. అలాంటప్పుడు ఈ పాప ఎవరి పాప అయింటుంది.
మనీషా: ఏంటి ఆంటీ ఇంకా ఆలోచిస్తున్నారు.
దేవయాని: ఇందాక నా ముందు నుంచి ఎవరో వెళ్లారు మనీషా. వాళ్లు ఎవరో అర్థం కావడం లేదు.
దేవయాని మీదకు వస్తుంది. అనుమానంతో ఎవరో ఉన్నారని చూస్తుంది. లక్ష్మీ దేవయానిని చూసి తను చూడకుండా తప్పించుకొని బయటకు వెళ్తుంది. వివేక్ తల్లిని చూసి వదినను చూడకపోయి ఉంటుందని అనుకుంటాడు. ఉదయం ఇంటికి మిత్ర తండ్రి అమెరికా నుంచి వస్తాడు. అందరూ ఆయనతో మాట్లాడుతారు. లక్కీ తాతయ్య అంటూ తాత చంక ఎక్కిపోతుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇక ఆయన ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోయిందని మిత్రతో చెప్తారు. దాంతో బోర్ కొడుతుందని లక్కీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక మిత్ర చేతికి ఉన్న కంకణం చూసి పూజలు ఏమైనా అయ్యాయా అని అడుగుతాడు. దాంతో మిత్ర రాత్రి పడుకున్నప్పుడు మామ్ కట్టినట్లుందని అంటాడు.
అరవింద తాను కట్టలేదని అంటుంది. అందరూ ఎవరు కట్టారని ప్రశ్నించుకుంటారు. వివేక్ టెన్షన్ పడతాడు. లక్కీ దగ్గరకు వెళ్లి సాయం అడుగుతాడు. తండ్రి దగ్గరకు వెళ్లి కంకణం నువ్వే కట్టావ్ అని అబద్దం చెప్పమని అంటాడు. దేవయాని మాత్రం రాత్రి ఓ మనిషి వచ్చందని తాను చూశానని అంటుంది. అందరూ ఆ దిశగా ఆలోచిస్తారు. ఇంతలో లక్కీ వచ్చి నాన్నకి నేనే కంకణం కట్టానని అంటుంది. అందరూ కారణం అడుగుతారు. జున్ను ఇచ్చాడని అది కట్టుకుంటే మంచి జరుగుతుందని వాళ్ల అమ్మ తనకి ఇస్తే నేను మా నాన్నకి కట్టానని అంటుంది. నాన్నకి మంచి జరిగితే నాకు జరిగినట్లే అని నేను కట్టానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.