Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని నిలదీసిన అర్జున్, మిత్ర తన భర్త అని చెప్పిన లక్ష్మీ.. మనీషా ప్లాన్ వినేసిందిగా!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode మిత్రని వారంలో పెళ్లి చేసుకుంటానని మనీషా దేవయానితో చెప్పడం లక్ష్మి వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్ర ఇంట్లో గొడవ పడి మందు తాగుతున్నాడని వివేక్ లక్ష్మీకి కాల్ చేసి చెప్తాడు. లక్ష్మీ హడావుడిగా ఆటోలో వెళ్తుంది. అర్జున్ కూడా లక్ష్మీని ఫాలో అవుతాడు. లక్ష్మీ వివేక్తో మాట్లాడటం అర్జున్ చూసి తనతో మాట్లాడుతుందేంటని అనుకుంటాడు. ఇద్దరికి సంబంధం ఏంటని అనుకుంటాడు. మిత్ర కుటుంబానికి లక్ష్మికి సంబంధం ఏంటని ఆలోచిస్తాడు. మరోవైపు మనీషా మిత్రకు కాల్ చేస్తుంది. మిత్ర కట్ చేస్తాడు. మళ్లీ కాల్ చేస్తే నాకు ఎందుకు కాల్ చేస్తున్నావ్ నేను ఏం చేస్తే నీకు ఎందుకు నా గురించి నీకు ఎందుకని మాట్లాడుతాడు.
మనీషా: ఏంటి మిత్ర నువ్వు తాగావా మత్తుగా మాట్లాడుతున్నావ్.
మిత్ర: అవును తాగాను అయితే ఏంటి. ఎందుకు ఇలా తాగుతున్నావ్. అని నన్ను నిలదీయాలి అనుకుంటున్నావా. చూడు నువ్వు ఇంకా నాకు పెళ్లానివి కాలేదు. నేను ఇంకా నీ మెడలో తాళి కట్టలేదు. నన్ను అడగడానికి ఆపడానికి నీకు ఎలాంటి హక్కు లేదు.
మనీషా: అలా కాదు మిత్ర నిన్ను అడగడానికి ఆపడానికి కాదు అసలు ఇంతలా తాగాల్సిన అవసరం ఏమొచ్చింది. అసలు ఎక్కడున్నావ్ నువ్వు.
మిత్ర: నేను గెస్ట్ హౌస్‌లో సేఫ్‌గా ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టకు. ఫోన్ కట్ చేయ్. నువ్వు చేయవా సరే అయితే నేనే కట్ చేస్తా బాయ్..
కిటికీ నుంచి మిత్రను లక్ష్మీ చూసి బాధ పడుతుంది. వివేక్ మిత్ర దగ్గరకు వెళ్తే లక్కీ స్కూల్ వదిలే టైం అయిందని తనని పిక్ చేసుకోవడానికి వెళ్తానని అంటాడు. లక్కీ వెయిట్ చేయకూడదని అంటాడు. ఆ మాటలు విన్న లక్ష్మీ లక్కీ అంటే మిత్రకు ఇంత ప్రేమ అని అనుకుంటుంది. సొంత బిడ్డ అయిన జున్నుకి అందాల్సిన ప్రేమ లక్కీ అందుకుంటుందని అనుకుంటుంది. వివేక్ లక్కీని పిక్ చేసుకోవడానికి వెళ్తానని మిత్రను చూసుకోమని చెప్తాడు. నిద్ర పోతున్న మిత్ర దగ్గరకు లక్ష్మీ వెళ్లి మిత్రని టచ్ చేసి ఏడుస్తుంది. అత్తయ్య గారికి న్యాయం చేయాలి అనుకున్నాను కానీ మీకు అన్యాయం చేస్తున్నాను అనుకోలేదు అని అంటుంది. మన కుటుంబం కోసమే అందరిని వదిలి వెళ్లిపోయానని కానీ మీ కళ్లకి నేనే ఓ ద్రోహిలా కనిపిస్తున్నానని అనుకుంటుంది. మరోవైపు మిత్ర దగ్గరకు మనీషా, దేవయాని వస్తుంటారు. వాళ్లని చూసిన లక్ష్మీ దాక్కుంటుంది. మనీషా మిత్రని లేపుతుంది. దాంతో దేవయాని ఫుల్లుగా తాగేశాడు నువ్వు ఎంత లేపినా లేవడని అంటుంది.
దేవయాని: ఏంటి మనీషా మిత్ర తప్ప తాగి పడిపోతే నువ్వు ఏదో సాధించినట్లు ఫీలవుతున్నావ్.
మనీషా: మిత్ర ఇంత తాగాడు అంటే ఆ లక్ష్మీ మీద ఉన్న ద్వేషం కోసం. ఆ లక్ష్మీ మీద ఉన్న అసహ్యం తీర్చుకోవడానికి. నాకు కావాల్సింది ఇదే. ఆ లక్ష్మీని మిత్ర ఎప్పటికీ ఇలాగే అసహ్యించుకోవాలి.
దేవయాని: అయినా ఇంకెంతలే వారంలో మిత్ర నీ సొంతం అయిపోతాడు కదా.
మనీషా: అవును ఆంటీ వివేక్ పెళ్లి లోనే మిత్రతో ఏదో విధంగా నేను పెళ్లి చేసుకుంటే మిత్ర శాశ్వతంగా నా వాడు అయిపోతాడు. వివేక్ పెళ్లిలో మిత్రని జాగ్రత్తగా డీల్ చేయాలా. ఎలా అయినా నా మెడలో తాళి కట్టేలా చేయాలి.
లక్ష్మీ: అయితే మిత్ర గారితో వారం రోజుల్లో మనీషా పెళ్లి చేసుకోబోతుంది. అది ఏలా అయినా సరే ఆపాలి. మనీషాకు మిత్రకు పెళ్లి జరగకూడదు.
వసుంధర తన ఒడిలో జున్నుని పడుకోపెట్టుకుంటాడు. అర్జున్ వచ్చి లక్ష్మీకి మనం ఊహించలేని రాచకార్యాలు ఉన్నాయని తన గతానికి చాలా పెద్ద పునాది ఉందని అంటాడు. కచ్చితంగా ఇవాళ లక్ష్మీకి తన గతం అడిగి తెలుసుకోవాలని జున్నుని ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోపెడతాడు. ఇంతలో లక్ష్మీ వస్తుంది.
అర్జున్: పిల్లాడిని అక్కున చేర్చుకునే వారితో మాట్లాడే టైం లక్ష్మీకి ఎక్కడుందిలే అమ్మ. ఏం లక్ష్మీ నీ బిజీబిజీ పనులు అయిపోయాయా. నువ్వు ఏవేవో చేసుకుంటూ పోతున్నావ్. వాటి వల్ల నువ్వు లాభపడుతున్నావా లేదో తెలీదు. నిన్ను ఏమైనా అడిగితే నీ గతం అడగొద్దు అని కరాఖండీగా చెప్తేస్తావ్. కానీ నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నా లక్ష్మీ. మొత్తం తెలియాలి లక్ష్మీ. నువ్వు చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావ్. బుర్కా వేసుకొని తిరగాల్సిన అవసరం ఏంటి. మన బిజినెస్ పార్టీలో ఎందుకు దాక్కున్నావ్ అక్కడ మిత్ర ఉన్నాడనా. ఫాదర్స్ డే రోజు దాక్కున్నావ్ ఎందుకు అక్కడ నందన్ కుటుంబం ఉందనా.. ఈ రోజు రహస్యంగా వివేక్‌ని కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. అసలు వివేక్ నీకు ఎలా తెలుసు. అసలు మిత్రకు నీకు సంబంధం ఏంటి.
లక్ష్మీ: ఏడుస్తూ మిత్ర గారు నా భర్త.
అర్జున్: మిత్ర నీ భర్తా.. అర్జున్, వసుంధర షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.